Telangana High Court On Building a Compound Wall : కాంపౌండ్ వాల్ నిర్మించడానికి స్థానిక సంస్థల నుంచి తప్పనిసరిగా అనుమతి ఉండాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ నిర్మాణం తాత్కాలికమైనా, శాశ్వతమైనా సంబంధిత మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకుని అనుమతి చేయలేమని తెలిపింది. హైడ్రా కూల్చివేసిన ప్రహరీని నిర్మించుకోవడానికి అనుమతించాలంటూ ఏపీలోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య కె. ఉమామహేశ్వరమ్మ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో ఉన్న తన 9ఎకరాల స్థలానికి చెందిన ఫామ్‌హౌస్ ప్రహారీ గోడను, అందులో ఉన్న షెడ్లను హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఉమామహేశ్వరమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ తాజాగా మరోసారి విచారణ చేపట్టగా, పిటిషినర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదులు శ్రీనివాస్ వాదనలు వినిపించారు. హైడ్రా కాంపౌండ్ వాల్‌ను కూల్చివేయడంతో స్థలానికి భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అమీన్‌పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని వివరించారు. దీనికి హైకోర్టు తీర్పునిస్తూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి స్థానిక సంస్థల నుంచి అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
దుర్గం చెరువు ఒక్కటే కాదు - హైదరాబాద్ వాసులకు ఇకపై '100' ఆప్షన్స్!
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం : హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో ఉన్న కమ్మరవాడి ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను హైక్టోర్టు ఆదేశించింది. ఒకవేళ అవి అక్రమ నిర్మాణాలని తేలితే చర్యలు తీసుకుని, అమలు నివేదికను హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌కు సమర్పించాలని ఆదేశించింది. వంశపారంపర్యంగా వచ్చిన 426 చదరపు గజాల స్థలంలో చేసుకున్న నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ అబ్దుల్ ముబీన్‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కుమ్మరవాడిలో 350కిపైగా అక్రమ నిర్మాణాలున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఈ అక్రమ నిర్మాణాల్లో స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేలవి కూడా ఉన్నాయన్నారు. కార్పొరేటర్ ఆదేశాలతోనే పిటిషనర్‌కు మాత్రమే నోటీసులు జారీ చేశారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి మొత్తం వ్యవహారంపై 4 వారాల్లో విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోవాలని ఆదేశించారు.
బిల్డర్లకు హైడ్రా వార్నింగ్ - కూల్చివేతలపై కీలక ప్రకటన
ఈసారి చెట్లపై 'హైడ్రా' ఫోకస్ - ఇక హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ సమస్యకు చెక్?