ETV Bharat / state

గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డిసెంబరులో ఎగ్జామ్స్​ - Telangana Group 2 Exam Dates

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 3:41 PM IST

Updated : Aug 22, 2024, 4:45 PM IST

Telangana Group-2 Exam Schedule 2024 : తెలంగాణలో గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్. టీజీపీఎస్సీ గ్రూప్- 2 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు నిర్వహించనుంది. గతంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్​ 2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Telangana Group-2 Exam Schedule 2024
Group-2 Exam Schedule 2024 (ETV Bharat)

Telangana Group-2 Exam Schedule 2024 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్​ను తాజాగా విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలకు మొత్తం నాలుగు పేపర్లు రాయాల్సి ఉండగా.. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. గతంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్​ 2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Telangana Group-2 Exam Dates : మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ ప్రకారమైతే ఈనెల 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, డీఎస్సీ, గ్రూప్‌ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పోస్ట్​పోన్​ అయ్యాయి. దీంతో గ్రూప్‌-2 పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఇవాళ ప్రకటించారు. రాష్ట్రంలో గ్రూప్‌ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ 2022 డిసెంబర్‌ 29న ఇవ్వగా, అప్పటినుంచి వేర్వేరు కారణాలతో పరీక్షలు పలుమార్లు వాయిదాపడగా ఈసారి డిసెంబర్‌ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది.

రెండు సెషన్స్​లో పరీక్షలు : కొత్త షెడ్యూల్‌ ప్రకారం, రెండు సెషన్లలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటలవరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ సెక్రటరీ డా.ఇ. నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు. ఈ ఎగ్జామ్స్ ప్రారంభానికి వారం రోజుల ముందునుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం నుంచి నేటి వరకు వేర్వేరు కారణాలతో పరీక్షల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో నిరుద్యోగ యువత గందరగోళానికి గురికావాల్సి వచ్చింది. వీటన్నింటికీ చెక్​ పెడుతూ రేవంత్​ సర్కార్ ఇటీవల సంపూర్ణ పరీక్షల సమాచారంతో జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్ చేసింది. వేర్వేరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసే నెల, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారనే వివరాలను జాబ్‌ క్యాలెండర్‌లో పొందుపర్చింది. నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్​ను వివరించింది.

జాబ్‌ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఎగ్జామ్స్ జరుగుతాయి. గ్రూప్‌-1 పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహిస్తామని, గ్రూప్‌-2 పరీక్షలను డిసెంబర్‌లో, గ్రూప్‌-3 పరీక్షలు నవంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఖాళీలకు ఇప్పటికే నోటిపికేషన్లు విడుదలై ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష నిర్వహించి మెయిన్స్‌కు అర్హత పొందిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేశారు.

నిరుద్యోగులకు బిగ్​ అలర్ట్​ - ఆ పోస్టులన్నీ ఇకపై గ్రూప్‌-3లోకి - Telangana Job Notification Reforms

జాబ్ క్యాలెండర్​పై ఎన్నో సందేహాలు - పరీక్షల షెడ్యూల్​పై అయోమయం - TELANGANA JOB CALENDAR 2024

Last Updated : Aug 22, 2024, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.