Telangana Group-1 Notification 2024 : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Assembly Speech) తెలిపారు. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి గ్రూప్- 1 నిర్వహిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యం అయ్యిందని స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారన్న రేవంత్, 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
"నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జీరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం కాదు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్దిష్ట విధానం ఉంటుంది. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యం అయ్యింది. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారు. ఈ ప్రభుత్వం 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నాం. సీఎంవోలో మైనార్టీ ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగించాం. మైనార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే అడ్డుకున్నారు." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
CM Revanth Assembly Speech : ప్రజావాణి(Praja Vani)లో ధరణి, హౌసింగ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదు వస్తున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాభవన్‌లో ఐఏఎస్ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని వెల్లడించారు. ముళ్ల కంచెలు త్వరగా కూల్చేందుకే డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేశామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కలుస్తారని, ప్రజా సమస్యలను తన దృష్టికి తెచ్చేందుకు వస్తున్న ఎవరినైనా కలుస్తానని తేల్చి చెప్పారు. విపక్ష నేత తన సొంత మనుషులను కూడా అనుమానిస్తున్నారని ఆరోపించారు.
గవర్నర్‌తో ముప్పై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారు : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
"వరంగల్‌లో 9 ఏళ్ల క్రితం కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని ప్రారంభించారు. 9 ఏళ్లల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని ఎందుకు పూర్తి చేయలేదు. ప్రగతి భవన్‌ను ఆగమేఘాల మీద నిర్మించుకున్నారు. చక్కగా ఉన్న సచివాలయాన్ని వాస్తు కోసం కూలగొట్టి ఏడాదిలో భారీగా నిర్మించారు. గత సీఎం డిజైన్ చేసి నిర్మించిన మేడిగడ్డ మేడిపండు అయ్యింది. రూ.90,700 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరంతో 90 వేల ఎకరాలకు కూడా నీరు అందలేదు. కాళేశ్వరం పేరు ఎత్తగానే కేఆర్‌ఎంబీ గురించి మాట్లాడుతున్నారు. విభజన చట్టం మొత్తం తన సూచనలతోనే రాశారని కేసీఆర్ గతంలో అన్నారు. ప్రాజెక్టులను అప్పగించాలని దిల్లీలో ఉన్న ప్రధాని అడుగుతున్నారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటే దిల్లీకి వెళ్లి ధర్నా చేయాలి. దిల్లీకి వెళ్లకుండా నల్గొండలో సభ పెడతామంటున్నారు. మోదీ నల్గొండలో ఉన్నారా?" అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఏపీని నీళ్లు తీసుకొమ్మని చెప్పిందెవరు : ఏపీ మంత్రి ఇంటికి వెళ్లి రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెప్పిందెవరని బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి స్పందించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు నీళ్లు తీసుకోమ్మని చెప్పిందెవరని ప్రశ్నించారు. రోజుకు 8 టీఎంసీలు తరలించేలా రాయలసీమ లిఫ్టు నిర్మిస్తుంటే అడ్డుకోకుండా ఉన్నది ఎవరని నిలదీశారు. మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్‌పైకి ఏపీ పోలీసులు వస్తే చేతకాకుండా కూర్చున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాకు నీరు ఇచ్చే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందెవరని అడిగారు.
పదేళ్లలో కేవలం ఒక కిలోమీటర్ టన్నెల్ మాత్రమే తవ్వారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అన్యాయం జరగలేదు. రాజకీయ స్వార్థం కోసం రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై 2015లోనే సంతకాలు చేశారు. నదీ పరివాహకం ప్రకారం కృష్ణా జలాల్లో 68 శాతం నీరు అడగకుండా సంతకం పెట్టారు. కేవలం 298 టీఎంసీలు ఇస్తామని కేంద్రం అంటే సంతకాలు పెట్టిందెవరు? కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతుల హక్కులకు మరణశాసనం రాసింది.
తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుని గడీల ఉండలేదు : సీఎం రేవంత్ రెడ్డి
LIVE UPDATES : 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి