Global Rice Summit in Hyderabad 2024 : ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు హైదరాబాద్ వేదికైంది. తాజ్‌కృష్ణ హోటల్లో శుక్ర, శనివారాల్లో ఇంటర్నేషనల్ కమోడిటీస్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, వ్యవసాయ పరిశోధన సంస్థల కన్సార్టియంతోపాటు భారత వరి పరిశోధన సంస్థ, పలు వ్యవసాయ విశ్వ విద్యాలయాలు పాల్గొననున్నాయి. దాదాపు 30 దేశాల నుంచి వరి ఎగుమతి, దిగుమతిదారులు, శాస్త్రవేత్తలు, రైతులు హాజరుకానున్నారు.
బియ్యం దిగుమతుల కోసం భారత్ వైపు : ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారత్‌లో కొత్త వరి వండగాలు, వాతావరణ మార్పులు తట్టుకునే రకాల పరిశోధనలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలతోపాటు విదేశీ ఎగుమతులపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుతం యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం బియ్యం దిగుమతుల కోసం భారత్ వైపు చూస్తున్నాయి.
Telangana Govt on Global Rice Summit : ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి పెరుగుతున్న డిమాండ్‌ను సరిగ్గా వినియోగించుకుంటే దేశ రైతులకు సరైన ధరతోపాటు, పెద్ద మొత్తంలో ఉన్న నిల్వ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అంతర్జాతీయ కమోడిటీస్ సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు నిర్వహించనుంది. దిగుమతి, ఎగుమతిదారులకు వ్యాపార అవకాశాలు వృద్ధి చేసేలా ఒక వేదిక కల్పించడంతోపాటు రాష్ట్రంలోని వరి రైతులకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా బియ్యం అత్యధికంగా వినియోగించే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. సంవత్సరానికి 155 మిలియన్ మెట్రిక్ టన్నులు వాడుతోంది. అదే భారత్‌లో 114.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. బంగ్లాదేశ్‌లో 37.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం వాడుతున్నారు. ఇండోనేషియా 35.6, వియత్నాం 21.9 మిలియన్ మెట్రిక్ టన్నులు చొప్పున వినియోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బియ్యం దిగుమతి చేసుకునే దేశాల్లో ఫీలిప్పీన్స్ అగ్రస్థానంలో ఉంది. చైనా, ఇరాక్, బెనిన్, మొజాంబిక్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 2022-23 సంవత్సరంలో దాదాపు 191 దేశాలు 420 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి చేసుకున్నాయి. ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.
రైతులకు మేలు చేస్తుందని భావిస్తున్న ప్రభుత్వం : తెలంగాణ నుంచి సోనామసూరి, సాంబమసూరి, హెచ్ఎంటీ-1010(బాయిల్డ్), ఐఆర్ 64 (స్టీమ్ రైస్) రకాలు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రం నుంచి ముఖ్యంగా ఫీలిప్పీన్స్, యూఎస్ఏ, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే వంటి దేశాలకు ఎక్కువగా బియ్యం దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు రాష్ట్ర రైతులకు మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
సిద్దిపేట యువకుడి వినూత్న ఆవిష్కరణ - ఇకపై పొలంలోనే బియ్యం ఉత్పత్తి! - a Man Makes Harvester Mission
రెండు గంటలు ఛార్జ్ చేస్తే రోజంతా నాటేయొచ్చు - ఈ సూపర్ మెషీన్ గురించి మీరూ తెలుసుకోవాల్సిందే