ETV Bharat / state

నీటి పారుదల శాఖలో ప్రక్షాళన స్టార్ట్ - ఇద్దరు ఈఎన్సీలపై వేటు వేసిన సర్కార్ - Telangana ENC Muralidhar resigns

Telangana Govt Serious Action on Irrigation Department : మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా నీటి పారుదల శాఖ ప్రక్షాళనకు నడుం బిగించిన తెలంగాణ సర్కార్, ఇద్దరు ఈఎన్సీలను తప్పించింది. ఈఎన్సీ జనరల్ మురళీధర్‌రావును రాజీనామా చేయాలని ఆదేశించిన ప్రభుత్వం, రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును బాధ్యతల నుంచి తొలగించింది. మరికొంతమంది ఇంజినీర్లపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Telangana ENC Muralidhar resigns
Telangana Govt Serious Action on Irrigation Departmen
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 10:02 PM IST

Updated : Feb 8, 2024, 9:14 AM IST

నీటిపారుదల శాఖలో ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్

Telangana Govt Serious Action on Irrigation Department : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖలో ఇద్దరు కీలక సీనియర్ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌లను తప్పించింది. ఈఎన్సీ జనరల్ మురళీధర్‌రావును రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును తొలగిస్తూ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Telangana ENC General Muralidhar Rao Resigns : మురళీధర్, వెంకటేశ్వర్లు ఇరువురూ పదవీ విరమణ చేసిన అనంతరం కూడా ఈఎన్సీలుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మురళీధర్​రావు పదవీ విరమణ అయిన దశాబ్దం తర్వాత కూడా అదే బాధ్యతల్లో ఉన్నారు. మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage) డిజైన్ మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి దశలోనూ లోపాలు ఉన్నాయని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇంజినీర్లు, జవాబుదారీతనంతో నడుచుకోలేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

'మేడిగడ్డ ఒప్పందాలు ముగిశాయి - పనులు చేయాలంటే కొత్త కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే'

Minister Uttam ordered ENC General Resign : నిబంధనలు పాటించలేదని, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని, నిర్వహణ కూడా సరిగా లేదని విజిలెన్స్ చెప్పినట్లు తెలిసింది. ప్రతి దశలోనూ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ సరిగా స్పందించలేదని, విధి నిర్వహణలో పూర్తి అలక్ష్యం ఉందని ఆక్షేపించినట్లు సమాచారం. గుత్తేదారుతో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలు, ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు సహా ఇతరత్రా విషయాల్లో ఇంజినీర్ల వైఖరిని విజిలెన్స్ తప్పుపట్టినట్లు తెలిసింది.

నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన : ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో పాటు పనులు పర్యవేక్షించిన పలువురు ఇతర ఇంజినీర్ల పేర్లను కూడా విజిలెన్స్ (Vigilance Inquiry Medigadda) తన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇద్దరు ఈఎన్సీలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఔట్ లెట్ల అప్పగింత వ్యవహారంలో కూడా ఈఎన్సీ జనరల్ మురళీధర్‌రావు వైఖరిపై సర్కార్ ఆగ్రహంగా ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన ఇంజినీర్లపై కూడా త్వరలోనే చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తంగా నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన జరగనుందని చర్చ జరుగుతోంది.

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

చర్చనీయంగా సర్కార్ నిర్ణయం : మరోవైపు నీటి పారుదల శాఖలో కీలకమైన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) పదవికి కొత్తగా ఎవరిని నియమిస్తారనే అంశంపై చర్చ మొదలైంది. బడ్జెట్ సమావేశాల్లో నీటి పారుదల రంగంపై శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అన్ని అంశాలపై విస్తృతంగా చర్చిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సమావేశాల ప్రారంభం ముందు రోజు సర్కార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయంగా మారింది.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు - విజిలెన్స్‌ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు

మేడిగడ్డలో పని పూర్తైనా తొలగించని కాఫర్‌ డ్యాం - విజిలెన్స్‌ విచారణలో ఆసక్తికర విషయాలు

Last Updated : Feb 8, 2024, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.