Teachers Promotions in Telangana State : రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతుల కల నెరవేరింది. ఎంతో కాలంగా వారు ఎదురుచూస్తున్న ప్రమోషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకోసం గత 20 ఏళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్య ఉపాధ్యాయులు (పీఈటీల) ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియకు అడ్డుగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించడంతో 18,942 మందికి మేలు జరిగింది.
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా సీఎం వద్దే ఉండటంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో టీచర్ల ప్రమోషన్లకు మార్గం సుగమం అయింది. వివాదాలకు తావులేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్ 1, 2 పరిధిలోని గవర్నమెంట్, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మేలు జరిగింది. పదోన్నతుల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ విధానమంతా ఆన్‌లైన్‌లో పారదర్శకతతో పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అర్హులైన వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులకు నోచుకోలేదని, తమ 20 ఏళ్ల కల నెరవేరిందని పేర్కొంటున్నారు.
పదోన్నతుల కేటాయింపు విధానం :
మల్టీజోన్-1 (ప్రభుత్వ, స్థానిక సంస్థలు)
- ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ - 10,083
- స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రిన్సిపల్స్ - 1,094
- మల్టీజోన్-2
- ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ - 6,989
- స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు - 776
Students Shed Tears After Teacher Shydulu Transfer : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడు. గురు-శిశ్యుల బంధానికి ప్రతీకగా నిలిచే ఓ అపురూప ఘట్టానికి వేదికైంది సూర్యాపేట జిల్లా పోలుమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 14 ఏళ్లుగా అదే బడిలో పనిచేస్తూ, తెలుగు ఉపాధ్యాయుడు సైదులు బదిలీపై వెళ్తున్న వేళ పాఠశాల ఆవరణలో ఉద్వేగభరిమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
పదోన్నతితో వెళ్తున్న తెలుగు ఉపాధ్యాయుడు సైదులుకు వీడ్కోలు సందర్భంగా, విద్యార్థులంతా బోరున విలపించారు. ఇన్నాళ్లు తమ ఉన్నతి కోసం పరితపించి తరగతి పాఠాలే కాదు జీవిత పాఠాలు బోధించిన టీచర్ సైదులు చుట్టూచేరి కాళ్లపై మోకరిల్లి, వెళ్లిపోవద్దంటూ ఏడ్చేశారు. గురువును పట్టుకుని వెళ్లొద్దంటూ వేడుకున్నారు. విద్యార్థుల ప్రేమాభిమానాలను చూసి టీచర్ సైదులు సైతం బావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు.
నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి ఊరట - రూ.406 కోట్ల నిధులు విడుదల