LRS official website : నాలుగేళ్లుగా సాగుతున్న తెలంగాణ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసింది. తెలంగాణలో 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131, 2023 జులై 31న జారీ చేసిన జీవో 135 నిబంధనల ఆధారంగా స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన, ఫీజుల చెల్లింపును పూర్తి చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం Layout Regularization Scheme -2020 కోసం వెబ్‌సైట్ ఆధారంగా వినియోగదారులకు ఆటంకం లేకుండా ప్రక్రియను పూర్తి చేయనుంది. https://lrs.telangana.gov.in/ ఈ అధికారిక లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వెబ్‌సైట్‌ను లాగిన్ చేయవచ్చు.
అసంపూర్ణ దరఖాస్తులే !
- LRS 2020లో అందిన 75 శాతం దరఖాస్తుల్లో పూర్తి వివరాలను వినియోగదారులు అప్‌లోడ్ చేయలేదు.
- అసంపూర్ణ దరఖాస్తుదారులు వెంటనే వెబ్‌సైట్‌ను లాగిన్ చేసి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలని తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రకటించింది.
- తెలంగాణలో 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131, 2023 జులై 31న జారీ చేసిన జీవో 135లలోని నిబంధనలే ప్రస్తుతం వర్తింస్తాయి.
- 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్టర్ చేసిన అనుమతి లేని, చట్ట విరుద్ధమైన లేఅవుట్లు, ప్లాట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- 2020 అక్టోబరు 15లోపు ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను మాత్రమే ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటారు.
- అధికారులు ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా.. వాటిలో 60,213 మాత్రమే ఆమోదం పొందాయి.
- ఇలా పరిశీలించినప్పుడు 75 శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వినియోగదారులు అప్‌లోడ్ చేయలేదు.
- సరైన డాక్యుమెంట్లు, వివరాలు అందజేయని వారు మరోమారు సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
- సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ అప్‌లోడ్ చేయాలి.
ఇలా ఈజీగా అప్‌లోడ్ చేయండి:
- 2020 అక్టోబరు 15లోపు వెయ్యి రూపాయలు చెల్లించి LRSకు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు అందులో పేర్కొన్న ఫోన్ నెంబర్ ఆధారంగా లాగిన్ కావాలి.
- https://lrs.telangana.gov.in/ ను లాగిన అయిన వెంటనే ఆఫీసర్ లాగిన్, సిటిజన్ లాగిన మనకు స్క్రీన్‌పై కనపడతాయి.
- సిటిజన్ లాగిన్ క్లిక్ చేసి దరఖాస్తుదారు మొబైల్ నంబరును ఎంటర్ చేయాలి
- మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా సిటిజన్ లాగిన్‌లోకి ఎంటర్ కావాలి.
- సిటిజన్ లాగిన్‌కు ఎంటర్ అయిన వెంటనే మెనూ బార్‌లో అప్లికేషన్ స్టేటస్‌ను క్లిక్ చేసి మన దరఖాస్తు అదేనో కాదో చెక్ చేసుకోండి
- స్టేటస్‌లో మన అప్లికేషన్ ఏ అధికారి వద్ద ఉందో ఆ అధికారి పేరు, మొబైల్ నెంబర్, మన దరఖాస్తు నెంబర్ ఉంటుంది. ఆ పక్కనే వీవ్ చూస్తే డిటేయిల్స్ ఉంటాయి.
- మళ్లీ మెనూ బార్ చివర్లో అప్‌లోడ్ డాక్యుమెంట్ కేటగిరినీ క్లిక్ చేయండి.
- అప్‌లోడ్ డాక్యుమెంట్స్ కేటగిరీ క్లిక్ చేయగానే బ్లూలో మన అప్లికేషన్ ఉంటుంది. దానిపై ఎంటర్ చేయండి.
- మన వివరాలతో మొత్తం డేటా అక్కడ ఉంటుంది. ఆడేటాలో ఏమైనా తప్పులు, ల్యాండ్ డిటేయిల్స్ చెక్ చేసుకుని సవరించుకోవచ్చు.
- ఆ కిందనే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ కనపడతోంది. అక్కడ సేల్‌డీడ్, లింక్ డాక్యుమెంట్, లే అవుట్ కాపీ, ప్లాట్ డైమెన్షన్‌ను అప్‌లోడ్ చేయమని అడుగుతోంది.
- ఇప్పుడు అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్‌ను ముందుగానే 5MB సైజ్ దాటకుండా PDF రూపంలోకి మార్చుకోండి.
- 5MB దాటకుండా PDF చేసుకున్న డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి.
- అప్‌లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్, ఇతర వివరాలను చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
- సబ్మిట్ చేసిన తర్వాత అప్‌లోడ్ సక్సెస్‌పుల్‌తో పాటు ఒక నెంబర్ వస్తోంది ఆ నెంబర్‌ను మీ వద్ద భద్రపరుచుకోండి.
- ఇలా ఆన్‌లైన్‌తో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్‌లను కూడా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే సంప్రదించవచ్చని ప్రభుత్వం సూచించింది.
- ఈ వెబ్‌సైట్‌ను ఫాలో అయి సెప్ట్ బై సెప్ట్ అవసవరమైన దరఖాస్తులు, వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం వల్ల బ్రోకర్స్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ధైర్యంగా నో బ్రోకర్స్ ప్లీజ్ అనొచ్చు.
అధికారిక వెబ్‌సైట్: https://lrs.telangana.gov.in/
LRS: ఎల్‌ఆర్‌ఎస్ లేఅవుట్ల పరిశీలనకు ప్రభుత్వం మార్గదర్శకాలు