ETV Bharat / state

వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16500 - చనిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రూ.5 లక్షలు - tg govt paid 16500 to flood victims - TG GOVT PAID 16500 TO FLOOD VICTIMS

Telangana Govt Help Flood Victims : భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతి కుటుంబానికి రూ.16,500 నగదు తక్షణమే ఇవ్వాలని నిర్ణయించుకుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Telangana Govt Help Flood Victims
Telangana Govt Help Flood Victims (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 8:42 AM IST

TG Govt help Flood Victims RS 16500 : వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్నే తెచ్చాయి. తీవ్ర వర్షాలకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలో వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సాయం చివరి బాధితుడి వరకూ అందుతుందని రెవెన్యూ, సమాచార, పౌర-సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. వర్షాల వల్ల నష్టపోయామని ఏ ఒక్క కుటుంబం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. భారీ వర్షాలపై సోమవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్రం వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. దీంతో అన్ని జిల్లాలను వర్షాలు, వరదలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వరదల వల్ల జరిగిన నష్టాలను అధికారులు పక్కాగా అంచనా వేయాలని ఆదేశించారు. ఒక్కో శాఖ పరిధిలో ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావాలనే దానిపై పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి ఇవ్వాలన్నారు. ఈ నివేదికలో కేంద్రానికి పంపాల్సిన అంశాలను పొందుపర్చాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధికులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 33 మంది మృతి చెందారని అధికారులు తెలపగా, ఆ కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేయాలని తెలిపారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్​రెడ్డి, సీఎస్​ శాంతికుమారి, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్​తో పాటు వ్యవసాయ, విద్యుత్​, మున్సిపల్​, పంచాయతీరాజ్​, విద్య, హౌసింగ్​, రోడ్లు, నీటి పారుదల శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

వరద సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి : 'వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున అందించి, వాటిని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయనున్నాం. అయితే అప్పుడు సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రూ.10వేలు సాయం ప్రకటించారు. కానీ విధ్వంసాన్ని చూసిన తర్వాత ఆ మొత్తానికి మరో రూ.6,500 జోడించి మొత్తం రూ.16,500కు పెంచారు. వెంటనే ఈ సాయం అందాలని అధికారులు ఆదేశించాం. ప్రాథమికంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా ప్రతి ఎకరానికి రూ.10 వేలు సాయం అందేలా చర్యలు తీసుకుంటాం.' అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరద బాధితులు 2 లక్షల మందిగా ఉన్నారు.

పత్రాల కోసం పోలీస్​ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు : వరదల కారణంగా చాలా ఇళ్లలోకి నీరు చేరి భూ, ఆస్తి పత్రాలు, ఆధార్​, రేషన్​ కార్డులతో పాటు విలువైన అనేక పత్రాలు తడిసిపోవడం, కొట్టుకుపోవడం జరిగాయి. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది? ఈ పత్రాల కోసం స్థానిక పోలీస్​ స్టేషన్​లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన చోట దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలా ఆ దరఖాస్తును పరిశీలించి డూప్లికేట్​ పత్రాలను అందిస్తామని, తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం భరోసా కల్పించింది.

వర్షం పడితే వణుకే : బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ఆ ఊరు ప్రజలు - Flood Affects in Telangana

ఎల్లుండి రాష్ట్రానికి కేంద్ర బృందం రాక - వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన, నష్టంపై అంచనా - CENTRAL TEAM VISIT To FLOOD AREAS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.