ETV Bharat / state

'ఇందిరమ్మ ఇండ్లు' లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ - మూడు నెలల్లో అర్జీల పరిశీలన పూర్తయ్యేలా ప్లాన్ - Indiramma Illu Scheme in Telangana - INDIRAMMA ILLU SCHEME IN TELANGANA

Indiramma House Scheme in Telangana : తెలంగాణలో ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మూడు నెలల్లో అర్జీల పరిశీలను పూర్తిచేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయనున్నారు.

Indiramma Illu  Scheme in Telangana
Indiramma Illu Scheme in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 11:23 AM IST

Updated : Jun 14, 2024, 11:44 AM IST

Indiramma Housing Scheme in Telangana Updates : తెలంగాణలో ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల అర్జీల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సర్కార్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

TG Govt Exercise on Indiramma Illu Applications : రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత డబుల్ బెడ్ రూం ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధులను నాలుగు దశల్లో సర్కార్ విడుదల చేస్తుందని తెలిపింది.

ఈ పథకాన్ని ఈ సంవత్సరం మార్చి 11న భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇళ్ల నమూనాలనూ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తెలంగాణ సర్కార్ బడ్జెట్‌లో నిధులు కేటాయించటంతో హడ్కో సుమారు రూ.1,000 కోట్లు రుణంగా మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అందుతుంది. ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

లబ్ధిదారుల ఎంపికే సవాల్‌ : ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన ఐదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. వచ్చిన అర్జీలు 82.82 లక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్‌గా మారింది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు.

అధ్యయనానికి బృందాలు : పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధివిధానాలను అధ్యయనం చేయాలని తెలంగాణ సర్కార్ తాజాగా నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకం అమలులో ఆయా రాష్ట్రాల అనుభవాలనూ పరిగణనలోకి తీసుకోవటం ద్వారా తెలంగాణలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్దేశించారు. ఈ నేపథ్యంలోనే అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి.

లాటరీ విధానంలో ఎంపిక! : సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వ్ కోటా కింద ఉంచాలనేది యోచన. అర్జీలతో పోలిస్తే మంజూరుచేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

Government Focus on Indiramma Illu : గతంలో సిద్ధమైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చనని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ఇదే ప్రతిపాదించామని చెప్పారు. వడపోతలో భాగంగా ప్రాథమికంగా అర్హత పొందిన అన్ని అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుందన్నారు. ఆ పరిశీలనను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. మూడు నెలల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఆ తరవాత లబ్ధిదారులు ఎంపిక కసరత్తు చేపడతామని ఆయన వెల్లడించారు.

82.82 లక్షల దరఖాస్తులు : వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహించిన ప్రజావాణిలో ఇళ్ల కోసం 82,82,332 అర్జీలు అందాయి. వాటిలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన దరఖాస్తులను వేరుచేసే ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఒకే ఇంటి నంబరుతో వచ్చిన అర్జీలను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ దశలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావటం, అధికారులు ఎన్నికల కార్యకలాపాల్లో నిమగ్నమవడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇచ్చేందుకు హడ్కో అంగీకారం - లోక్​సభ ఎలక్షన్స్​ తర్వాత మొదలెట్టడమే! - indiramma Illu

'ఇందిరమ్మ ఇళ్లు'పై ప్రభుత్వం కీలక నిర్ణయం - పట్టణ గృహాలకు కేంద్రం సాయం తీసుకోవాలని యోచన

Last Updated : Jun 14, 2024, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.