ETV Bharat / state

హైదరాబాద్‌లో సెల్లార్లకు ఇక సెలవు? - వాటికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వ యోచన - TG Govt on Cellars - TG GOVT ON CELLARS

TG Govt Planning to Stop Cellars : బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్‌ కోసం చేపట్టే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెల్లార్లపై ఫిర్యాదులు వస్తుండటంతో పాటు వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మేరకు సెల్లార్లనే అనుమతించకుండా చట్టబద్ధత తీసుకొచ్చి, పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించనున్నట్లు సమాచారం.

Telangana Government on Cellars in Building
TG Govt Planning to Stop Cellars (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 10:13 AM IST

Telangana Government on Cellars in Building : బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేసే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెల్లార్లపై ఫిర్యాదులు వస్తుండటంతో పాటు వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాల సమయంలోనూ మోటార్లతో సెల్లార్లలో నిలిచిన నీటిని తోడాల్సి వస్తోంది. చాలా లోతు తవ్వకాలతో వచ్చే మట్టితోనూ సమస్యగా ఉంది. ఇళ్ల నిర్మాణ ఖర్చు పెరుగుదలకు కారణమవుతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో ప్రస్తుతం ఐదారు సెల్లార్ల వరకు అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌లో భూకంప ప్రభావిత ప్రాంతాల (సెసిమిక్‌ జోన్స్‌)ను సర్కార్​ గతంలో గుర్తించింది.

అక్కడ సెల్లార్ల నిర్మాణాలు చాలా ప్రమాదకరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సెల్లార్లనే అనుమతించకపోతే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంలో చట్టబద్ధత తీసుకొచ్చి, పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించనున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. భవనాల్లో పార్కింగ్​కు సెల్లార్ల స్థానంలో స్టిల్ట్​లను (భూమి నుంచే పార్కింగ్‌ కోసం నిర్మాణం చేపట్టడం) చేపట్టాలని అధికారులు డిజైన్​లో సవరణలు చేస్తున్నారు. ఎన్ని అంతస్తులైనా స్టిల్ట్‌ నిర్మాణాలకు అనుమతులివ్వొచ్చని వివరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ ఎత్తులో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.

'ఇప్పటికే జీహెచ్​ఎంసీ పరిధిలో సెల్లార్ల స్థానంలో స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చాం. రెండు నుంచి మూడు స్టిల్లుల వరకు అనుమతిస్తున్నాం. ఇళ్ల నిర్మాణదారుల నుంచి సానుకూలత వస్తోంది. కానీ వాణిజ్య భవనాల నిర్మాణదారులు వీటిపై ఆసక్తి చూపటం లేదు'- అధికారులు

త్వరలో కొలిక్కి రానున్న సెల్లార్లపై మేథోమథనం : గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఈ తరహా నిర్మాణాలను అనుమతించినట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఒకరు తెలిపారు. రెండు నుంచి 3 స్టిల్టుల వరకు అనుమతిస్తున్నారని, ఇళ్ల నిర్మాణదారుల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నా, వాణిజ్య భవనాల నిర్మాణదారులు వీటిపై ఆసక్తి చూపటం లేదని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య నిర్మాణాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చాలా డిమాండ్​ ఉంటుంది. ఆ స్థానంలో పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తే నష్టపోతామన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చట్టంలో సవరణలు చేస్తేనే దీని అమలు సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన ఈ మేధోమథనం త్వరలో కొలిక్కి వస్తుందని సమాచారం.

సెల్లార్​ నిర్మాణాలపై ముందస్తు అనుమతులు తీసుకోవాలి - స్పష్టం చేసిన హైకోర్టు

ఇంటిని ఎత్తేస్తూ... సెల్లార్​ నిర్మిస్తా...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.