ETV Bharat / state

ఊరూరా మీ-సేవ కేంద్రాలు - డ్వాక్రా సంఘాలకు మంజూరు చేయనున్న సర్కార్ - Govt Focus On Set Up Mee Seva

Govt Will Set Up Mee seva Centers : ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహిళా శక్తి పథకం ద్వాారా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనుంది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. పంద్రాగస్టు నాటికి వీటిని ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది.

Govt Will Set Up Mee seva Centers
Govt Will Set Up Mee seva Centers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 10:06 AM IST

Govt Will Set Up Mee seva Centers : ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలనందిస్తున్న మీ-సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్​ఎహెజీ) మహిళలకు వీటిని మంజూరు చేయనుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది.

పంద్రాగస్టు నాటికి : పంద్రాగస్టు నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,525 మీ-సేవ సెంటర్లున్నాయి. వీటిలో మూడు వేల వరకు పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వేయిన్నర వరకే గ్రామాల్లో ఉన్నాయి.

Mee Seva Services : ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌ సంబంధిత సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ, 600కు పైగా ప్రైవేటు సేవల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు, నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళాశక్తి పథకం కింద మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

గ్రామైక్య సంఘాల పేరిట : ప్రభుత్వం ఈ మీ - సేవ కేంద్రాలను గ్రామైక్య సంఘాల (విలేజ్‌ ఆర్గనైజేషన్‌) పేరిట మంజూరు చేస్తుంది. ఈ పథకం ద్వారా కేంద్రం ఏర్పాటుకు 2.50 లక్షల రుణాన్ని స్త్రీ నిధి ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. వీటితో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ప్రముఖ కంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్, బయోమెట్రిక్‌ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీ సేవ కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆయా సంఘాలు లోన్​ను నెల నెలా తిరిగి చెల్లించాలి.

Govt Focus On MEE Seva Centers : స్త్రీనిధి, స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక, అంగన్‌వాడీ కేంద్ర భవనాలు లేదా, వాటి ప్రాంగణాల్లో గ్రామైక్య సంఘాల పేరిట కేంద్రానికి 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో వసతి కల్పిస్తారు. ఆయా సంఘాల్లోని ఇంటర్‌ ఉత్తీర్ణులైన సభ్యురాళ్లను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు. కేంద్రం నిర్వహణ, సేవలపై మీ సేవ సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తారు. అనంతరం లబ్ధిదారులైన మహిళా సంఘాలతో మీ సేవ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంటుంది.

ఆపరేటర్లకు నెలరోజుల శిక్షణ : ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మేరకు పారదర్శకమైన సేవలందిస్తారు. మీ-సేవ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వహణను తనిఖీ చేస్తుంటారు. నెల రోజులు శిక్షణ, ఈ నెలాఖరు వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Meeseva Services On Mobile : "మీ సేవ" సెంటర్​తో పని పడిందా..? మీ ఫోన్​లోనే చేసుకోండిలా!

'మీసేవా కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్​లో స్లాట్​ బుకింగ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.