ETV Bharat / state

హైదరాబాద్ - నాగార్జునసాగర్‌ మధ్య 4 వరుసల రోడ్డుకు ప్రభుత్వం ప్రతిపాదన - TG GOVT KEY DECISIONS ON TOURISM

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 5:31 PM IST

Updated : Aug 31, 2024, 8:04 PM IST

Tourism Development in Telangana :హుస్సేన్​సాగర్ చుట్టూ స్కైవే నిర్మించడంతో పాటు, బుద్ధవిగ్రహాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం నెలకొల్పడంతో పాటు ఫణిగిరి, నేలకొండపల్లి, హుస్సేన్‌సాగర్ బౌద్ధ పర్యాటక ప్రాంతాలన్నీ కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు నాలుగు వరసల రోడ్డు నిర్మించాలని ఆర్అండ్ బీ శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

CM Revanth Key Decisions on Tourism Development
Tourism Development in Telangana (ETV Bharat)

CM Revanth Key Decisions on Tourism Development : రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అంతర్జాతీయ పర్యటక, ఆధ్యాత్మిక బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం నెలకొల్పేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

బుద్ధ మ్యూజియం ఏర్పాటు : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్​ను పంపించింది. బుద్ధవనంలో 25 కోట్ల రూపాయలతో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం, ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటితో పాటు అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం ఏర్పాటును కూడా ప్రణాళికలో పొందుపరచాలని నిర్ణయించింది. నాగార్జునసాగర్​ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్‌వాటర్ వరకు బోట్‌లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు.

టూరిజం సర్క్యూట్‌ : హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు నాలుగు వరసల రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్​లోని బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్​సాగర్ పరిసరాలను ప్రపంచస్థాయి పర్యాటక హబ్‌గా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి డిజైన్లు తయారు చేయించాలని అధికారులకు సీఎం చెప్పారు. బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం సర్కిల్‌గా అభివృద్ధి చేయనున్నారు. ట్యాంక్‌బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్​ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారం లో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఫుడ్​ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గోల్కొండ చుట్టూ రోడ్లన్నీ ఇరుకుగా అయినందున, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని, ఆక్రమణలుంటే తొలగించాలని అయితే అక్కడి ప్రజలు నిరాశ్రయులు కాకుండా పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

"నాగార్జున సాగర్" టూర్ - కేవలం రూ.800లకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ! - Nagarjuna Sagar Tour

నేలకొండపల్లి బౌద్ధస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం : మంత్రి భట్టి - Ministers visit Nelakondapally

Last Updated : Aug 31, 2024, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.