TG Government Reduces Of TET Exam Fees : తెలంగాణలో టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేవారికి గుడ్న్యూస్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్ష ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. టెట్ ఒక పేపరుకు(పేపర్-1 లేదా పేపర్-2) రూ.1000గా ఉన్న ఫీజును 750 రూపాయలకు తగ్గించింది. రెండు పేపర్లకు రూ.2వేలుగా ఉన్న పరీక్ష ఫీజును రూ.1000 తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల మేలో టెట్ ఎగ్జామ్ రాసి అర్హత సాధించని వారికి ఫీజునుంచి మినహాయింపునిచ్చింది.
గురువారం రాత్రి 11 గంటల నుంచి టెట్ దరఖాస్తు ప్రక్రియు ప్రారంభమైంది. సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 5న ప్రారంభం కావాల్సిన ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవ్వగా పరీక్ష ఫీజును తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిరుపేద, మధ్య తరగతి టెట్ అభ్యర్థులకు మేలు జరగనుంది.