Congress on Telangana Formation Day Celebrations : పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీ భవన్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో తెలంగాణ సిద్దించిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని అసెంబ్లీలో చెప్పిన గత ముఖ్యమంత్రి కేసీఆర్, తరువాత చాలా సార్లు అవమానించారని ధ్వజమెత్తారు.
పదేళ్లలో తెలంగాణ ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు దూరంగా పాలన జరిగిందని, అందుకే కేసీఆర్ను జనాలు ఓడించారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని చెప్పారు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందో వాళ్ల గుర్తుగా అమర వీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో ఉంచుతున్నామని వివరించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొన్నం, సీతక్క తుమ్మల, జూపల్లి, రాజ్య సభ సభ్యులు అనిల్ యాదవ్, అది శ్రీనివాస్, రోహిత్ చౌదరీ, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana Formation Day Celebrations in CPI Office : గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మవంచన పరిపాలన చేశారని, అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ గౌరవంగా అందర్నీ కలుపుకొని పోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు సందర్భంగా ఇవాళ హిమాయత్ నగర్లోని సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగుర ఎగురవేశారు.
అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్న నాయకులు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలని నారాయణ కోరారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, వాటిని సక్రమంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని, దాని కోసం తమ ఉద్యమ బాట నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది సంబురం - అమరులకు నివాళులతో ప్రారంభం - TELANGANA FORMATION DAY 2024