ETV Bharat / state

పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్ - ఆ రోజు నుంచే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ - TS SSC Supplimentary Exam 2024 - TS SSC SUPPLIMENTARY EXAM 2024

TS SSC Supply Exams Date 2024 : రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా పరీక్షలు రాయగా, 91.31 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.

TS SSC Supplementary Exams Date 2024
TS SSC Supply Exams Date 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 3:20 PM IST

TS SSC Supplementary Exams Date 2024 : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5 లక్షల 5 వేల 813 మంది హాజరు కాగా, వారిలో 91.31 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. బాలురు 89.42 శాతం మంది పాస్ కాగా, బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించి ముందంజలో నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో 93.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, తెలుగులో పరీక్ష రాసిన వారిలో 80.71 శాతం మంది మాత్రమే పాస్​ కావడం గమనార్హం.

ఈసారి టెన్త్ ఫలితాల్లో జడ్పీ పాఠశాలలు, గురుకులాలు సత్తా చాటాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,297 సూల్స్​వంద శాతం పాస్ పర్సెంటేజ్ సాధించగా, అందులో 1,347 జడ్పీ స్కూల్స్ , 1,77 కేజీబీవీలు, 142 బీసీ వెల్ఫేర్ పాఠశాలలు ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 6 పాఠశాలలు 'సున్న' ఉత్తీర్ణతను సాధించాయి. వాటిలో 4 ప్రైవేట్​వి కాగా, మరో 2 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా చూస్తే 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ మొదటి స్థానంలో నిలవగా, సిద్దిపేట ఆ తర్వాతి స్థానంలో, 65.10 శాతంతో వికారాబాద్ ఆఖరి స్థానంలో నిలిచాయి.

పదో తరగతి ఫలితాలు విడుదల - మళ్లీ బాలికలదే హవా - TELANGANA SSC RESULTS RELEASED 2024

జూన్​ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు : ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్లపై విద్యా శాఖ స్పష్టతనిచ్చింది.​ జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇదే సమయంలో నేటి నుంచి 15 రోజుల పాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్​కు అవకాశం కల్పిస్తున్నామన్న ఆయన, మే 16లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రీకౌంటింగ్​కు రూ.500, రీ-వెరిఫికేషన్​కు రూ.1000 చెల్లించాలని స్పష్టం చేశారు.

ఇంటర్​లో మార్కులు తగ్గాయా? డోంట్​ వర్రీ! రీకౌంటింగ్​, రీవెరిఫికేషన్​కు ఇలా అప్లై చేసుకోండి! - Inter Results Recounting

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు - TS Inter Supplementary Exam 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.