Commercial Taxes Department to Review GST Assessments once Again : రాష్ట్రంలో గత సర్కార్ హయాంలో జరిగిన జీఎస్టీ అసెస్‌మెంట్లల్లో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు వాణిజ్య పన్నుల శాఖ అనుమానిస్తోంది. కొందరు అధికారులు అసెస్‌మెంట్ల సమయంలో ప్రభుత్వ రాబడులకు గండికొట్టి జేబులు నింపుకున్నట్లు ఇటీవల నిర్వహించిన అనేక పరిశీలనల్లో ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. వందల కోట్లల్లో ఆదాయానికి గండిపడి ఉంటుందని అంచనా వేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి తిరిగి పునఃపరిశీలన చేసి పన్నును మదింపు చేసేందుకు నడుం బిగించారు.
Tax Department: పదోన్నతులు కల్పించారు.. పోస్టింగ్‌లు ఇవ్వడం మరిచారు
ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన అసెస్‌మెంట్లను పునఃపరిశీలన చేసేందుకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 108 ప్రకారం కింది స్థాయి అధికారులు చేసిన అసెస్‌మెంట్లను పైస్థాయి అధికారులు పునఃపరిశీలన చేసేందుకు, లోటుపాట్లను సవరించి ఎక్కువ ట్యాక్స్ మదించేందుకు అవకాశం ఉంది. తెలంగాణలో 2021-22, 2022-23, 2023-24 ఈ మూడు ఆర్థిక సంవత్సరాల్లో 14 వాణిజ్య పన్నుల డివిజన్ల పరిధిలో రూ.16,172 కోట్ల విలువైన, 70,000లకు పైగా అసెస్‌మెంట్లు పూర్తి చేశారు. అయితే ఇందులో 13,000ల కోట్లకుపైగా విలువైన దాదాపు 15,000ల అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఐదు కోట్లకు పైగా టర్నోవర్ కలిగినవి ఉండడంతో వాటన్నింటినీ పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు.
పన్నుల వసూళ్లు పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ పక్కాప్లాన్
అంతర్గత ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ : ఇప్పటికే 13,000లకు పైగా అసెస్‌మెంట్ల పునఃపరిశీలనకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రతి సర్కిల్, ప్రతి డివిజన్ పరిధిలో చేసిన అసెస్‌మెంట్ల జాబితాను ఆయా డివిజన్ జాయింట్ కమిషనర్లకు, కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్లకు ఇచ్చారు.
అయితే కమిషనర్ శ్రీదేవి ఆదేశాల మేరకు జాయింట్ కమిషనర్లు గతంలో అసెస్‌మెంట్లు చేసిన వాటిలో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉండి ఉంటే అన్నింటినీ పొందుపరుస్తూ ఆమెకు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది. అలాగే వాటిని పూర్తిస్థాయిలో పరిశీలన చేసి తప్పులు దొర్లిన అసెస్‌మెంట్ల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ శ్రీదేవి స్పష్టం చేశారు.
TS Govt on Suspected GST Assessment : కిందిస్థాయి అధికారులు చేసిన పన్ను మదింపును తాజాగా పైస్థాయి అధికారులు పునఃపరిశీలించి తప్పులు ఉంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించడంతో వాణిజ్య పన్నుల శాఖలో కలకలం రేగుతోంది. వాస్తవానికి అసెస్ చేసి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది న్యాయస్థానంలో న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు భావించాల్సి ఉంటుంది. ఎవరైనా అధికారి వ్యాపారులతో కుమ్మక్కై వారికి మేలు చేకూర్చి, పన్ను మదింపులో అక్రమాలకు పాల్పడి, వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధిపొందినట్లు రుజువైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
GST Fraud Cases in Telangana : ఇందులో ఏలాంటి అనుమానాలకు తావు లేదు. తెలిసో తెలియకో జరిగిన తప్పిదాలతో ఎక్కడ ఇరుక్కుపోతామోనన్నఆందోళన కొందరు అధికారుల్లో ఉంది. రూ.13,000ల కోట్లకు పైగా విలువైన రూ.5 కోట్లకుపైగా టర్నోవర్ కలిగిన 15,000ల అసెస్‌మెంట్లను పునఃపరిశీలన ద్వారా కనీసం పదిశాతం అంటే వెయ్యి కోట్లకుపైగా రాబడి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది.
Fake GST Registrations : నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం