New Ration Cards Soon in Telangana : అర్హులందరికీ త్వరలోనే రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన కేబినెట్ భేటీలో విధివిధానాలు ఖారారు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వనున్నట్లు వివరించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై అడిగిన ప్రశ్నకు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారు. ఇవాళ పౌరసరఫరాలశాఖ పద్దులపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.
కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు : కేసీఆర్ చర్యలతో రాష్ట్రంలో ధాన్యం గణనీయంగా పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సన్నబియ్యం టెండర్లు రద్దు చేశారా? లేదా అని ప్రశ్నలు వేశారు. కొత్త రేషన్ కార్డులు అన్నారు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. కరీంనగర్ పర్యాటక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు రావని మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. శాసనసభలో సోమవారం నుంచి గరంగరం చర్చలు జరుగుతున్నాయి.
పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు : అంతకుముందు శాసనసభలో రైతు బంధు, పంట భరోసాపై శాసనసభలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి తుమ్మల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలపై ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వ్యవసాయేతర భూములకు గత ప్రభుత్వం రూ.25 వేల కోట్ల రైతుబంధు సాయం ఇచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. ప్రస్తుతం రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన పథకాలన్నింటినీ మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతుబంధు సమితి అధ్యక్షుడుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చినప్పుడు సూటబుల్ కాదని చెప్పానని గుర్తు చేశారు
రైతులకు అలర్ట్ - రెండో విడత రుణమాఫీ విడుదల - 2ND PHASE CROP LOAN WAIVER RELEASED