ETV Bharat / state

రేషన్​కార్డు ఆశావహులకు గుడ్​న్యూస్ - విధివిధానాలపై నేడు కేబినెట్ భేటీ - TELANGANA CABINET MEETING TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 6:55 AM IST

Updated : Aug 1, 2024, 7:35 AM IST

TG Cabinet Meet on New Ration Cards : నూతన రేషన్​కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఇవాళ రేషన్​కార్డుల జారీకి సీఎం రేవంత్​ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈసమావేశంలో నూతన రేషన్​కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేయనున్నారు.​

TG Cabinet Meet on New Ration Cards
TG Cabinet Meet on New Ration Cards (ETV Bharat)

TG Cabinet Meet on New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలపై నేడు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది.

విధివిధానాల ఖరారుపై చర్చ : అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో రెండు రోజుల క్రితం ప్రకటించారు. రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధివిధానాలపై నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. దారిద్య్ర రేఖకు దిగువన బీపీఎల్ ఉన్న వారికే రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. అయితే బీపీఎల్​ను పునర్నిర్వచించే అవకాశం ఉంది. వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర వరకు ఉన్న కుటుంబాలను బీపీఎల్​గా ఇప్పుడు పరిగణిస్తున్నారు.

అయితే బీపీఎల్​కు కుటుంబానికి గరిష్ఠ ఆదాయం, భూమిని కూడా నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొత్త వైద్య కళాశాలలకు భూమి కేటాయింపుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్, ప్రజావాణి దరఖాస్తులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాలు : మరోవైపు ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ మెట్రో సిటీలో సుస్థిర పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, సివిల్ కోర్టుల చట్ట సవరణ, తెలంగాణ చట్టాల బిల్లులు కూడా శాసనసభలో చర్చకు పెట్టనున్నారు. శాసనమండలి, శాసనసభ రెండిట్లోనూ ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ అనంతరం మండలిలోను చర్చించి ఆమోదించుకోవాల్సి ఉంది.

నేడు ఉదయం 9 గంటలకు రాజ్​భవన్​లో గవర్నర్ జిష్ణు దేవవర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్​ భేటీ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి భూమిపూజ చేస్తారు.

రైతులకు అలర్ట్ - రెండో విడత రుణమాఫీ విడుదల - 2ND PHASE CROP LOAN WAIVER RELEASED

హైదరాబాద్‌ చేరుకున్న నూతన గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ - స్వాగతం పలికిన సీఎం రేవంత్​

Last Updated : Aug 1, 2024, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.