ETV Bharat / state

రైతు రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గ భేటీ - ఈ నెల 15 లేదా 18న నిర్వహణ - TG CABINET MEETING ON RUNA MAFI - TG CABINET MEETING ON RUNA MAFI

Telangana Cabinet Meeting on Runa Mafi Scheme : రుణమాఫీ అమలు దిశగా సర్కారు చర్యలు చేపట్టింది. విధివిధానాలు అమలుకు ఈనెల 15 లేదా 18న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Telangana Cabinet on Crop Loan Waiver Scheme
Cabinet Meeting on Crop Loan Waiver Scheme (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 7:00 AM IST

Updated : Jun 13, 2024, 7:06 AM IST

రైతు రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గ భేటీ - ఈనెల 15 లేదా 18న నిర్వహణ (ETV Bharat)

Telangana Cabinet Meeting on Runa Mafi Scheme : రైతులకు ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. రుణమాఫీ విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌ నిర్ణయించారు. ఈనెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపర నిర్ణయాలపై ఆ భేటీలో చర్చించి వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు.

పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ, ఆర్థిక శాఖాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం, అందుబాటులో ఉన్న వనరులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి, అర్హులైన రైతుల గుర్తింపునకు విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది.

రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులపై అధ్యయనం : రాష్ట్రంలో గతంలో రుణమాఫీ అమలైన తీరును పరిశీలించటంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వాటి వల్ల ప్రయోజనాలు, నిర్దేశించిన అర్హతలను పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా 6 వేల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారిని ఆ పథకం నుంచి మినహాయించింది.

రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు అలాంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? తద్వారా అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధివిధానాలుండాలి? అన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషణ చేస్తోంది. వాటన్నింటిపైనా వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది.

రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్‌ సమీక్ష - ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం - CM Revanth on Crop Loan Waiver

రూ.2 లక్షల రుణమాఫీపై రేవంత్ సర్కారు కసరత్తు - దీనిపై వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయమిదే - Govt Focus On Crop Loan Waiver

Last Updated : Jun 13, 2024, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.