ETV Bharat / state

నేడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం - వాటిపైనే ప్రధాన చర్చ - Telangana Cabinet Meeting May 18th - TELANGANA CABINET MEETING MAY 18TH

TS Cabinet Meeting 2024 : శనివారం కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వివిధ శాఖలు పలు అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ విభజన వివాదాలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం పెంపు మార్గాలపై సమావేశంలో చర్చ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించి, మరమ్మతులు, తదుపరి కార్యచరణలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త విద్యా సంవత్సరం సన్నాహాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుంది.

Bifurcation Issues Of Ts And Ap
Telangana Cabinet Meeting (Twitter)
author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 4:39 PM IST

Updated : May 17, 2024, 10:46 PM IST

Telangana Cabinet Meeting 2024 : రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వ శాఖలు వివిధ అంశాలపై వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు పూర్తి కానున్నందున, పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు.

పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10లోని వందకుపైగా ఆస్తుల విభజన, హైదరాబాద్​లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ కేబినెట్ ముందు పెట్టనుంది. ఏపీతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతు రుణమాఫీపై సీఎం స్పెషల్​ ఫోకస్ : రైతు రుణమాఫీపై కూడా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీ ఇచ్చినందున, ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు రూ.32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంతో పాటు విధివిధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

CM Revanth Review On Income Sources : రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ, నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, తదితర శాఖలతో సమావేశం నిర్వహించి, బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయాన్ని సాధించాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్ సమీక్షించనుంది.

ధాన్యం సేకరణ వేగం పెంచడానికి అవసరమైన ప్రణాళిక, అకాల వర్షాలతో తడిసిన ధాన్యం వంటివి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్​లో చర్చ జరగనుంది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది.

కొత్త విద్యా సంవత్సరం సన్నాహాలపై మంత్రివర్గంలో చర్చ : మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలపై చర్చించి మరమ్మతులపై ఏం చేయాలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యునిఫాంల పంపిణీ, విద్యా సంస్థల్లో వసతులపై చర్చించనున్నారు. పాఠశాల, కళాశాల, ఉన్నత విద్యా శాఖలు, ఇంటర్ బోర్డు వివిధ అంశాలపై నివేదికలు సిద్ధం చేశాయి.

'అమ్మకాలు పెరిగినప్పటికీ మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదు' - CM Revanth Review On Income Sources

జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి - అపరిష్కృత విభజన అంశాలపై సీఎం రేవంత్​ ఫోకస్ - Telangana Cabinet Meeting May 18th

Last Updated : May 17, 2024, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.