ETV Bharat / state

8 నుంచి బడ్జెట్​ సమావేశాలు - అసెంబ్లీ వేదికగా మరో 2 గ్యారంటీలు ప్రకటించనున్న సీఎం!

Telangana Cabinet Meeting Decisions : తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణను కేబినేట్ ఖరారు చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్​ను టీజీగా మారుస్తూ తీర్మానం చేసింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరో రెండు కొత్త పథకాల అమలును ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రకటిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​బాబు వెల్లడించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 9:46 PM IST

Updated : Feb 5, 2024, 7:01 AM IST

Telangana  Anthem Change Today
Telangana Cabinet Meeting Key Points
వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మారుస్తూ కేబినెట్ తీర్మానం

Telangana Cabinet Meeting Decisions : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన సుమారు మూడు గంటలకుపైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు, చేర్పులు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు, ప్రతి నెలా రూ.25 వేల పింఛన్ : సీఎం రేవంత్​ రెడ్డి

Telangana Cabinet Key Decisions 2024 : రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను మంత్రిమండలి ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్​ను టీజీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. గత పాలకులు తమ పార్టీ పేరును పోలి ఉండేలా టీఎస్‌ను పెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు(Minister Duddilla Sridhar Babu) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కులగణన చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, 10 బడ్జెట్​ ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించింది. ఆ నిబంధనలను గత ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టీజీని కాదని టీఎస్‌గా నిర్ణయించింది. గెజిట్‌ మేరకు టీఎస్​ను టీజీగా మార్చాలని మా మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్‌ చట్టంలో సవరణలు చేస్తాం. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను కేబినేట్ ఆమోదించింది. మేము చెప్పిన విధంగా ప్రజాపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి

CM Revanth Reddy Cabinet Meeting Decisions 2024 : ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరో రెండు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​బాబు తెలిపారు. రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్‌ను త్వరలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం.

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలోని 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కేంద్రాలుగా అప్​గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాజేంద్రనగర్‌లో హైకోర్టుకు 100 ఎకరాలను కేటాయించింది. ఖైదీలకు క్షమాభిక్ష కోసం అవసరమైన ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయశాఖలో ఏఈవో ఖాళీలను నింపాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. గ్రూప్-1 ఇతర నియామకాలకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.

TS Name Change TG : ధరణి కమిటీ నివేదిక త్వరలో వస్తుందని దానిపై అసెంబ్లీలో చర్చిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. మెగా డీఎస్సీ కోసం భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్​బాబు వెల్లడించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష జరిపారని శ్రీధర్​బాబు పేర్కొన్నారు.

నిజాం షుగర్స్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - హాజరైన మంత్రులు శ్రీధర్​ బాబు, దామోదర

'విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టులు అప్పగించాం - బీఆర్ఎస్​ చేసిన తప్పులను మాపై వేయాలని చూస్తున్నారు'

Last Updated : Feb 5, 2024, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.