ETV Bharat / state

హైడ్రాకు ఫుల్​ పవర్స్​ - జనవరి నుంచి అన్ని రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం - తెలంగాణ కేబినెట్​ భేటీ నిర్ణయాలు ఇవే - Telangana Cabinet Meeting 2024 - TELANGANA CABINET MEETING 2024

Telangana Cabinet Meeting 2024 : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్​ రెడ్డిలు మీడియాకు వివరించారు.

Telangana Cabinet Meeting 2024
Telangana Cabinet Meeting 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 5:44 PM IST

Updated : Sep 20, 2024, 10:43 PM IST

Telangana Cabinet Meeting 2024 : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం పూర్తి అయింది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మీడియాకు వివరించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల్లో అక్రమ నిర్మాణాలును కూల్చివేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించినట్లు తెలిపారు. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని పలు విభాగాల నుంచి డిప్యుటేషన్​పై రప్పిస్తున్నామని వెల్లడించారు. ఆ విభాగానికి 169 మంది అధికారులు, 964 మంది ఔట్​సోర్సింగ్ సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు.

ఈ ఖరీఫ్ నుంచి ఎంఎస్​పీకి అదనంగా రూ.500 : కేబినెట్ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులకు రూ.4637 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామని వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పరిశీలించి ఇంజినీర్లు, ఏజెన్సీతో మాట్లాడామని వివరించారు. 2027 సెప్టెంబర్‌లోగా ఎస్‌ఎల్‌బీసీ, డిండి పనులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్‌ నుంచి ఎంఎస్‌పీకి అదనంగా రూ.500 చెల్లించి సన్నాలు కొంటామని వెల్లడించారు.

"మిగతా శాఖలకు ఉండే స్చేచ్ఛ హైడ్రాకు వర్తిస్తుంది. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించాం. ఆ విభాగానికి అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్​పై రప్పిస్తున్నాం. మనోహరాబాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైద్య కళాశాలల్లో 3 వేలకు పైగా పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తాం. "- పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి

కేబినెట్ తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు ఇవే :

  • ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్​లో చేర్చామని మంత్రుల బృందం తెలిపింది.
  • ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం.
  • ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ. కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ.
  • పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తిస్తుందని మంత్రులు వెల్లడించారు.
  • మనోహరాబాద్​లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
  • 8 మెడికల్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం. 3వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల.
  • ఏటూరునాగారం అగ్నిమాపక స్టేషన్​కు 34 మంది సిబ్బంది మంజూరు.
  • కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల, హకీంపేటలో జూనియర్‌ కళాశాల మంజూరు.

నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ- అజెండాలోని కీలక అంశాలివే! - Telangana Cabinet Meet Today

సచివాలయంలో రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ - విధివిధానాలపై చర్చ

Last Updated : Sep 20, 2024, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.