ETV Bharat / state

'రియాల్టీకి దూరంగా భ్రమలు కల్పిస్తే ప్రమాదం - అందుకే వాస్తవ పద్దు రూపొందించాం' - తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024

Telangana Budget Sessions 2024 : రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేలా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదాయం, వ్యయం మేరకు బడ్జెట్‌ ఉండాలనేది తమ ఆలోచన అని స్పష్టం చేశారు. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్‌ రూపొందించామని తెలిపారు.

Telangana Budget Sessions 2024
Telangana Budget Sessions 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 3:57 PM IST

Updated : Feb 15, 2024, 6:55 PM IST

'రియాల్టీకి దూరంగా భ్రమలు కల్పిస్తే ప్రమాదం - అందుకే వాస్తవ పద్దు రూపొందించాం'

Telangana Budget Sessions 2024 : తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు బడ్జెట్‌లో కృషి చేశామని ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు నిధులు అందని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితి రాకుండా వాస్తవ బడ్జెట్‌ రూపొందించామని వెల్లడించారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపామని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఏడోరోజులో భాగంగా బడ్జెట్‌పై చర్చకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.

Bhatti Replay To Telangana Budget Discussion 2024 : వాస్తవాలను విస్మరించి గతంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారని, ఏటా బడ్జెట్‌ను 20 శాతం పెంచుకుంటూ పోయారని భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదాయం, వ్యయం మేరకే బడ్జెట్‌ ఉండాలనే ఆలోచనతో వాస్తవ పద్దును ప్రవేశపెట్టామని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులకు 5 శాతానికి మించి తేడా లేకుండా చూడాలని, గతంలో తెలంగాణ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లుగా ప్రవేశపెడితే ఈసారి బడ్జెట్‌ రూ.2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానానికి శాసనసభ ఆమోదం - రేపటికి వాయిదా

"ఈసారి బడ్జెట్‌ తగ్గిస్తున్నారని చాలా మంది అడిగారు. ఆదాయం, వ్యయం మేరకు బడ్జెట్‌ ఉండాలనేది మా ఆలోచన. 2023-24లోనూ రూ.70 వేల కోట్ల తేడాతో బడ్జెట్‌ పెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అవసరాల మేరకు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. బడ్జెట్‌ మేరకు డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టకుండా ఎత్తేస్తారు. రాజస్థాన్‌లో 116.4 శాతం అధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌లో బడ్జెట్‌ కంటే అధికంగా ఖర్చు పెట్టారు. రూ.2.5 లక్షల కోట్లు బడ్జెట్‌ పెడితే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో మాదిరిగా 20 శాతం అధికంగా బడ్జెట్‌ పెడితే ప్రమాదం. వాస్తవాలకు దూరంగా భ్రమలు కల్పిస్తే ప్రమాదం ఏర్పడుతుంది." - భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం

గతంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే చేసిన అప్పులు కట్టేందుకు అప్పులు చేయక తప్పట్లేదని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11 లక్షల కోట్లు అప్పుల భారం ఉందన్న భట్టి, బడ్జెట్‌, బడ్జెటేతర రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు గతంలో రుణాలు కుదించారని పేర్కొన్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై సభ్యులు సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

"పదేళ్లుగా గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం యువత ఎదురుచూశారు. అధికారంలోకి రాగానే మేం ఉద్యోగాల నియామక పత్రాలు ఇస్తున్నాం. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి అదనపు సిబ్బందిని ఇచ్చాం. టీఎస్‌పీఎస్సీకి ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరు చేశాం. గ్రూప్‌-1లో 503 పోస్టులకు అదనంగా 64 పోస్టులు మంజూరు చేశాం. ఎప్పటికప్పుడు అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నాం." - భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం

ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్​ రిపోర్టు

కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక

Last Updated : Feb 15, 2024, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.