ETV Bharat / state

LIVE UPDATES : తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా - మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్​ - telangana assembly live updates - TELANGANA ASSEMBLY LIVE UPDATES

Telangana Assembly Sessions 2024
Telangana Assembly Sessions 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 9:50 AM IST

Updated : Jul 24, 2024, 5:39 PM IST

Telangana Assembly Sessions 2024 : రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండో రోజు రసవత్తరంగా సాగాయి. ఉదయం గం.10 నుంచి మొదలైన ప్రశ్నోత్తరాలు, అనంతరం కేంద్ర బడ్జెట్​పై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే శాసనసభ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

LIVE FEED

5:30 PM, 24 Jul 2024 (IST)

శాసనసభ సమావేశాలు రేపు మధ్యాహ్నానికి వాయిదా

  • గురువారానికి వాయిదా పడిన శాసనసభ సమావేశం
  • వచ్చే నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించాలని మేం నిర్ణయించుకున్నాం
  • రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలి
  • శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
  • కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై తీర్మానం
  • తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్ష చూపిందని అసెంబ్లీలో తీర్మానం

5:26 PM, 24 Jul 2024 (IST)

పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పింది : సీఎం రేవంత్‌

  • అందరం ఏకతాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచాలి, నిధులు సాధించుకోవాలి : సీఎం రేవంత్‌
  • పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పింది
  • కేంద్రం మాత్రం రాష్ట్రాలకు 32 శాతం పన్నులనే పంచుతోంది
  • కేంద్రం పన్నులు కాకుండా సెస్సుల రూపంలో వసూలు చేసుకుని రాష్ట్రాలకు ఎగ్గొడుతోంది

5:20 PM, 24 Jul 2024 (IST)

తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 30 పైసలు కూడా రావట్లేదు : సీఎం రేవంత్

  • తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉందో ప్రజలకు తెలియాలి: సీఎం
  • తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 30 పైసలు కూడా రావట్లేదు
  • తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయి
  • కేంద్రం మాత్రం తెలంగాణకు పదేళ్లలో కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది
  • ఐదు దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి రూ.22.66 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయి
  • పదేళ్లలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.6 లక్షల కోట్లు
  • యూపీ నుంచి రూ.3.47 లక్షల కోట్లు పన్నులు వస్తే.. అక్కడ ఖర్చు పెట్టింది రూ.6.91 లక్షల కోట్లు
  • దేశం అభివృద్ధి, ఆదాయంలో తెలంగాణది ఎంతో కీలకపాత్ర
  • ఎంతో కీలకమైన హైదరాబాద్‌కు నిధులు కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోంది

5:15 PM, 24 Jul 2024 (IST)

ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారు : సీఎం రేవంత్‌

  • ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారు : సీఎం రేవంత్‌
  • తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారు
  • పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్లలో హామీలను పూర్తి చేయాల్సి ఉంది
  • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన హక్కులను పట్టించుకోలేదు
  • నిలదీసి అడగాల్సిన రాష్ట్రప్రభుత్వం పదేళ్లు పట్టించుకోలేదు
  • సమాఖ్య స్ఫూర్తిని కాపాడేలా మేము ప్రధాని మోదీని కలిసి నిధులు అడిగాం

5:13 PM, 24 Jul 2024 (IST)

రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం కాపాడాలి: సీఎం

  • రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం కాపాడాలి: సీఎం
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం దశాబ్దాల పాటు సమాఖ్య స్ఫూర్తిని కాపాడింది
  • అన్ని రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ నిర్మించింది
  • భాక్రానంగల్‌, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది
  • ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేసి దేశాన్ని పరిపుష్ఠం చేసింది
  • ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ చర్యల వల్లనే భారత్‌ ఆర్థికంగా నిలదొక్కుకుంది

5:02 PM, 24 Jul 2024 (IST)

పదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది: వివేక్‌

  • పదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది: వివేక్‌
  • బీఆర్ఎస్‌ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీకి ఎన్నోసార్లు మద్దతు ఇచ్చారు
  • ఎన్ని బిల్లులకు మద్దతు ఇచ్చినా రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు
  • రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే కేవలం 27 పైసలు ఇస్తున్నారు
  • యూపీ మాత్రం రూపాయి చెల్లిస్తే మళ్లీ రూ.1.72 ఇస్తున్నారు

4:58 PM, 24 Jul 2024 (IST)

తెలంగాణ రక్తంలోనే పోరాటం ఉంది ఇప్పుడు కేంద్రంపై పోరాడాలి : కూనంనేని

  • నయా పద్దతుల్లో కార్పోరేట్లకు దోచిపెడుతున్నారు: కూనంనేని
  • బొగ్గు, నీళ్లు, ఖనిజం, కరెంట్‌ ఉన్నప్పటికీ బొయ్యారం ఉక్కు పరిశ్రమను ఎందుకు చేపట్టటం లేదు
  • గిరిజన యూనివర్సిటీని నామమాత్రంగా ప్రకటించారు, నిధులు ఇవ్వలేదు
  • కేంద్రాన్ని అడుక్కుంటే నిధులు వచ్చే పరిస్థితి లేదు
  • తెలంగాణ రక్తంలోనే పోరాటం ఉంది ఇప్పుడు కేంద్రంపై పోరాడాలి
  • రాష్ట్రంలో కేంద్రం జీఎస్టీ వసూలు చేసుకోకుండా చేయాలి

4:54 PM, 24 Jul 2024 (IST)

బీజేపీకి దక్షిణ భారత్‌లో సీట్లు రావట్లేదు కాబట్టే నిధులు సరిగా ఇవ్వట్లేదు : ఎమ్మెల్యే కూనంనేని

  • దక్షిణ భారత రాష్ట్రాలు విడిపోవాలి అనే డిమాండ్లు వచ్చేలా పరిస్థితి తయారైంది :కూనంనేని
  • ఈ పరిస్థితులు దేశానికి మంచిదికాదు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • బీజేపీకి దక్షిణ భారత్‌లో సరిగా సీట్లు రావట్లేదు ఆ కోపం వాళ్లలో ఉంది
  • బీజేపీకి దక్షిణ భారత్‌లో సీట్లు రావట్లేదు కాబట్టే నిధులు సరిగా ఇవ్వట్లేదు
  • ఇవాళ ఏపీ అవసరం ఉంది కాబట్టే కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చారు

4:49 PM, 24 Jul 2024 (IST)

కేంద్రం జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను యాచకులుగా మార్చింది : కూనంనేని

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మాత్రమే: కూనంనేని
  • ప్రజలు చెల్లించిన పన్నులనే మళ్లీ మనం ఖర్చు చేస్తున్నాం
  • నిధులు మేము ఇచ్చాం, మేము ఇచ్చాం అని అనటం సరికాదు
  • రాష్ట్రాలు ఇవ్వకపోతే కేంద్రానికి నిధులు ఎక్కడ : కూనంనేని
  • కేంద్రం జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను యాచకులుగా మార్చింది
  • కేంద్రం అనేది మిథ్య అని ఆనాడు ఎన్టీఆర్‌ అందుకే అన్నారు
  • దేశానికి నేడు రాజనీతజ్ఞుల కొరత ఉంది: ఎమ్మెల్యే కూనంనేని
  • 2014 నుంచి కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువయ్యాయి
  • దక్షిణ భారత రాష్ట్రాలు విడిపోవాలి అనే డిమాండ్లు వచ్చేలా పరిస్థితి తయారైంది

4:42 PM, 24 Jul 2024 (IST)

దిల్లీలో సీఎం రేవంత్‌ దీక్ష చేస్తానంటే మేం మద్దతు ఇస్తాం: హరీశ్‌రావు

  • కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది వాస్తవం: హరీశ్‌రావు
  • తెలంగాణకు జరిగిన అన్యాయంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తాం: హరీశ్‌రావు
  • దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటే వచ్చేందుకు బీఆర్ఎస్‌ సిద్ధం: హరీశ్‌రావు
  • దిల్లీలో సీఎం రేవంత్‌ దీక్ష చేస్తానంటే మేం మద్దతు ఇస్తాం: హరీశ్‌రావు

4:34 PM, 24 Jul 2024 (IST)

కేసీఆర్ వస్తే జంతర్‌మంతర్‌ వద్ద నేను దీక్షలో కూర్చుంటా : సీఎం రేవంత్‌రెడ్డి

  • దిల్లీలో దీక్ష చేసేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ రావాలి: సీఎం రేవంత్‌
  • కేసీఆర్‌ వస్తే దిల్లీలో దీక్ష చేసేందుకు నేను సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
  • కేసీఆర్ వస్తే జంతర్‌మంతర్‌ వద్ద నేనూ దీక్షలో కూర్చుంటా: సీఎం
  • రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్‌ దీక్షకు ముందుకు రావాలి: సీఎం
  • పాలకపక్ష నేతగా నేను వస్తా ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ రావాలి: సీఎం
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా నేను సిద్ధం : సీఎం రేవంత్‌రెడ్డి
  • సచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుకునుడో జరగాలి: సీఎం రేవంత్‌

4:21 PM, 24 Jul 2024 (IST)

రాష్ట్రానికి నిధుల కోసం కేంద్రంపై పోరాడుదాం: భట్టి విక్రమార్క

  • రాష్ట్రానికి నిధుల కోసం కేంద్రంపై పోరాడుదాం: భట్టి విక్రమార్క
  • అన్ని పార్టీల నేతలు మోదీ వద్దకు వెళ్లి నిధుల గురించి అడుగుదాం
  • ప్రధాని, కేంద్రమంత్రుల వద్దకు ఎన్నోసార్లు వెళ్లి విజ్ఞప్తి చేశాం

4:11 PM, 24 Jul 2024 (IST)

రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బీజేపీ వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది : భట్టి

  • పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదు : భట్టి
  • బయ్యారం ఉక్కు పరిశ్రమ అడిగితే ఇవ్వలేదు: భట్టి
  • ఐటీఐఆర్‌, ఎయిమ్స్, నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదు
  • మెట్రో విస్తరణకు నిధులు అడిగితే ఇవ్వలేదు
  • కేంద్రం నిధులు ఇవ్వటం దయాదాక్షిణ్యాలు కాదు
  • రాష్ట్రాల నుంచి వెళ్లిన పన్నులే కేంద్రానికి ఆదాయం
  • రాష్ట్రాల్లో వసూలు చేసిన పన్నుల్లో మళ్లీ అన్ని రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి
  • రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బీజేపీ వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది
  • కేంద్రంలోని బీజేపీ వైఖరి సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదకరంగా మారింది
  • ఎన్డీఏ ప్రభుత్వ వివక్షపై చాలా రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది

4:05 PM, 24 Jul 2024 (IST)

విభజనచట్టంలోని అంశాల గురించి కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగాం : భట్టి

  • విభజనచట్టంలోని అంశాల గురించి కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగాం : భట్టి
  • నిజంగా సాయం అవసరమైన తెలంగాణకు కూడా ఎందుకు ఇవ్వలేదు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలను వదిలేయాలి

3:57 PM, 24 Jul 2024 (IST)

విభజనచట్టం చేసిందే తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు: భట్టి

  • రాష్ట్ర ప్రయోజనాలపై చర్చిస్తే సరైన మద్దతు రాలేదు : భట్టి
  • రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాల గురించే కొందరు ఆలోచించారు
  • విభజనచట్టం చేసిందే తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు: భట్టి
  • వెనకబడిన తెలంగాణ అభివృద్ధి చెందేలా విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారు
  • పొరుగు రాష్ట్రం ఏపీకి ఇచ్చినందుకు మాకు ఏమీ బాధలేదు

3:54 PM, 24 Jul 2024 (IST)

ఆరు గ్యారంటీలను రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలి : ఎంఐఎం ఎమ్మెల్యే

  • ఆరు గ్యారంటీలను రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలి : ఎంఐఎం ఎమ్మెల్యే
  • రాష్ట్రంలో విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్రం ఆలోచిస్తోంది
  • విద్యుత్‌ను అదానీ కంపెనీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది
  • పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయలేక అదానీకి ఇస్తున్నారా

3:47 PM, 24 Jul 2024 (IST)

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దిల్లీలో పోరాడుదాం: కేటీఆర్‌

  • రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దిల్లీలో పోరాడుదాం: కేటీఆర్‌
  • రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కలిసికట్టుగా పోరాడుదాం: కేటీఆర్‌
  • అందరం వెళ్లి దిల్లీలో జంతర్‌ మంతర్ వద్ద దీక్ష చేద్దాం: కేటీఆర్‌
  • కేంద్రమంత్రులు నిధులు తెస్తారో రాజీనామా చేస్తారో తేల్చుకోవాలి: కేటీఆర్‌

3:45 PM, 24 Jul 2024 (IST)

తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోవటం సరికాదు: పొన్నం

  • తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోవటం సరికాదు: పొన్నం
  • వాకౌట్‌ చేయటం అంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఒప్పుకున్నట్లే: పొన్నం

3:42 PM, 24 Jul 2024 (IST)

శాసనసభ నుంచి వాకౌట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

  • శాసనసభ నుంచి వాకౌట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • 'కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం ' తీర్మానాన్ని వ్యతిరేకించిన బీజేపీ

3:32 PM, 24 Jul 2024 (IST)

తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40 పైసలు కూడా రావట్లేదు : మంత్రి పొన్నం

  • కేంద్రంలో కుర్చీ కాపాడుకోవటానికి ఏపీ, బిహార్‌కు మాత్రమే నిధులు ఇచ్చారు
  • తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40 పైసలు కూడా రావట్లేదు
  • హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో బీజేపీ సభ్యులు చెప్పాలి
  • సిరిసిల్లకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఏం తెచ్చారో చెప్పాలి
  • చేనేతల ఆత్మహత్యలపై రాజకీయాలు చేసే బండి సంజయ్ నిధులు ఎందుకు తేలేదు
  • సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌కు బండి సంజయ్‌ నిధులు ఎందుకు తేలేదు
  • కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఎన్నో దరఖాస్తులు ఇచ్చాం

3:27 PM, 24 Jul 2024 (IST)

కేంద్రమంత్రులు కనీసం వారి నియోజకవర్గాలకు కూడా నిధులు తెచ్చుకోలేకపోయారు : మంత్రి పొన్నం

  • కేంద్రమంత్రులు కనీసం వారి నియోజకవర్గాలకు కూడా నిధులు తెచ్చుకోలేకపోయారు : మంత్రి పొన్నం
  • చారిత్రక నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవటం వివక్ష కాదా?
  • తెలంగాణలోని 7 మండలాలను ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో కలిపారు
  • 7 మండలాలను ఏపీలో కలపటం వల్ల సీలేరు ప్రాజెక్టును కోల్పోయాం
  • కేంద్రంతో సత్సంబంధాలు ఉంటే నిధులు ఇస్తారని భావించాం

3:19 PM, 24 Jul 2024 (IST)

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే లేకుండా చేశారు : మంత్రి పొన్నం

  • రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్‌ లేదు
  • అఖిలపక్ష నేతలను కేంద్రం వద్దకు బీజేపీ నేతలు తీసుకెళ్తారని ఆశించాం
  • కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే లేకుండా చేశారు
  • తెలంగాణ అంటే మోదీకి మొదట్నుంచి చిన్నచూపు: మంత్రి పొన్నం
  • తెలంగాణ ఏర్పాటునే మోదీ ఎన్నోసార్లు అవమానించారు
  • తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టారు

3:15 PM, 24 Jul 2024 (IST)

ఉపాధిహామీ కింద నిధులు తెచ్చామనటం హాస్యాస్పదం: పొన్నం

  • ఉపాధిహామీ కింద నిధులు తెచ్చామనటం హాస్యాస్పదం: పొన్నం
  • మూసీ శుద్ధికి నిధులు అడిగితే అవినీతి కోసం అడిగినట్లా?
  • గంగ, సదర్‌మట్‌ శుద్ధిని మోదీ ప్రభుత్వం చేపట్టాలేదా?
  • గంగ, సదర్‌మట్‌ శుద్ధిని కమీషన్ల కోసమే చేపట్టారా?

3:11 PM, 24 Jul 2024 (IST)

విభజనచట్టం హామీల అమలు విషయంలో ఏపీకి న్యాయం చేశారు : మంత్రి కొండా సురేఖ

  • విభజనచట్టం హామీల అమలు విషయంలో ఏపీకి న్యాయం చేశారు : మంత్రి కొండా సురేఖ
  • విభజనచట్టం హామీల అమలు విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారు
  • రాష్ట్రానికి నిధులు ఎందుకు రాలేదో సభలో చర్చిస్తే బాగుంటుంది
  • రాష్ట్రంలో రూ.80 వేల కోట్ల ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి
  • ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద కూడా కేంద్రం నిధులు ఇస్తోంది

3:05 PM, 24 Jul 2024 (IST)

బీజేపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు : శ్రీధర్‌ బాబు

  • బీజేపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు : శ్రీధర్‌ బాబు
  • రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో బీజేపీ సభ్యులు చెప్పారు

3:01 PM, 24 Jul 2024 (IST)

అసెంబ్లీలో చర్చ పెట్టి రాష్ట్రానికి నిధులు సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం : ఉపముఖ్యమంత్రి

  • అసెంబ్లీలో చర్చ పెట్టి రాష్ట్రానికి నిధులు సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం
  • అమృత్ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం రూ.3500 కోట్లు ఇచ్చింది
  • టెండర్ల ప్రక్రియ లేకుండానే పనులను మిత్రులకు ఇచ్చుకున్నారు

2:52 PM, 24 Jul 2024 (IST)

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సింది రాలేదు: మంత్రి పొంగులేటి

  • కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సింది రాలేదు: మంత్రి పొంగులేటి
  • కేంద్రంలోని బీజేపీ మొండిచేయి చూపితే కాంగ్రెస్‌ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి
  • బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

2:49 PM, 24 Jul 2024 (IST)

ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

  • ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
  • మంచి చేస్తుందనే నమ్మకంతోనే బీజేపీ ఎంపీలను గెలిపించారు
  • మూసీ ప్రాజెక్టు పేరుతో కోట్లు దోచుకోవాలని చూస్తున్నారు
  • ఏదోరకంగా బీజేపీను బద్నాం చేయాలని చూస్తున్నారు
  • ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మావైపే ఉంటారు
  • రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

2:46 PM, 24 Jul 2024 (IST)

8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి: ఆది శ్రీనివాస్‌

  • 8 మంది భాజపా ఎంపీలు రాజీనామా చేయాలి: ఆది శ్రీనివాస్‌
  • కేంద్రాన్ని భాజపా నేతలు ఇంకా సమర్థించటం సిగ్గుచేటు
  • పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు న్యాయం చేయలేదు
  • భాజపా ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

2:44 PM, 24 Jul 2024 (IST)

బయ్యారంలో ముడిసరుకు థర్డ్ గ్రేడ్‌ అని నివేదిక వచ్చింది: మహేశ్వరరెడ్డి

  • బయ్యారంలో ముడిసరుకు థర్డ్ గ్రేడ్‌ అని నివేదిక వచ్చింది: మహేశ్వరరెడ్డి
  • రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నాం: మహేశ్వరరెడ్డి
  • హామీలు నెరవేర్చలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: మహేశ్వరరెడ్డి

2:37 PM, 24 Jul 2024 (IST)

కాంగ్రెస్‌ నేతలు ఆరు గ్యారంటీలపై చిత్తశుద్ధి పెట్టాలి : మహేశ్వరరెడ్డి

  • మీరెన్ని అబద్ధాలు చెప్పినా విన్నాం-మీరు కాస్త నిజాలు వినాలి..: మహేశ్వరరెడ్డి
  • కాంగ్రెస్‌ నేతలు ఆరు గ్యారంటీలపై చిత్తశుద్ధి పెట్టాలి: మహేశ్వరరెడ్డి
  • విభజన చట్టం తెచ్చింది ఎవరు. రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరు : మహేశ్వరరెడ్డి
  • నియమాలు, నిబంధనలు తెలిసి కూడా రాష్ట్రాన్ని వంచించారు : మహేశ్వరరెడ్డి
  • బయ్యారం స్టీల్‌ప్లాంట్ ఇస్తామని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు? : మహేశ్వరరెడ్డి

2:26 PM, 24 Jul 2024 (IST)

ఏపీకి రూ.10 వేల కోట్లు ఇచ్చారని పదేపదే చెప్పడం సరికాదు: మహేశ్వరరెడ్డి

  • కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ కలిసి మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు: మహేశ్వరరెడ్డి
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రం ఎడారిగా మారుతుంది: మహేశ్వరరెడ్డి
  • ఏపీకి రూ.10 వేల కోట్లు ఇచ్చారని పదేపదే చెప్పడం సరికాదు: మహేశ్వరరెడ్డి
  • కేంద్రానికి మీరు డీపీఆర్‌లు ఏమైనా ఇచ్చారా
  • మూసీని ఏటీఎంలా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
  • సీఎం రేవంత్‌ నియోజకవర్గానికి రూ.4 వేల కోట్లు ఎలా ఇస్తారు?

2:10 PM, 24 Jul 2024 (IST)

కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకూ మేం మద్దతివ్వలేదు: కేటీఆర్‌

  • కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకూ మేం మద్దతివ్వలేదు: కేటీఆర్‌
  • దళితుడు రాష్ట్రపతి అయ్యేటప్పుడు మద్దతిచ్చాం: కేటీఆర్‌
  • తెలుగుబిడ్డ ఉపరాష్ట్రపతి అయ్యేటప్పుడు మద్దతిచ్చాం: కేటీఆర్‌
  • కేసీఆర్‌ను కాదు.. ధైర్యముంటే మోదీని తిట్టండి..: కేటీఆర్‌

2:08 PM, 24 Jul 2024 (IST)

కేంద్ర బడ్జెట్‌పై చర్చించమంటే కేటీఆర్ ఆవు కథ చెబుతున్నారు: సీఎం

  • కేంద్ర బడ్జెట్‌పై చర్చించమంటే కేటీఆర్ ఆవు కథ చెబుతున్నారు: సీఎం
  • కేంద్రానికి, భాజపాకు కోపం వస్తుందని కేటీఆర్‌ పదేపదే ఆవు కథ చెబుతున్నారు: సీఎం
  • కేంద్రానికి కేసీఆర్‌ ఎలా ఊడిగం చేశారో నేను కొన్ని ఉదాహరణలు చెబుతా: సీఎం
  • జీఎస్టీ బిల్లుకు అందరి కంటే ముందు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారు: సీఎం
  • ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్‌ మద్దతు తెలిపారు: సీఎం
  • ఆర్టీఐకి తూట్లు పొడిచేందుకు తెచ్చిన సవరణ బిల్లుకు కేసీఆర్‌ మద్దతిచ్చారు: సీఎం
  • ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ సంతోష్‌ ఆర్టీఐ సవరణ బిల్లుకు మద్దతిచ్చారు: సీఎం
  • నోట్ల రద్దును అద్భుతమంటూ అప్పట్లో కేసీఆర్‌ ఆకాశానికెత్తారు: సీఎం
  • ఆనాటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకు అనుకూలంగా భారాస ఓట్లేసింది: సీఎం
  • ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ అంశాల్లో బీఆర్​ఎస్​ మద్దతు ఇచ్చింది: సీఎం
  • మాకేమీ అక్కర్లేదు.. మీ ప్రేమ చాలని చెప్పిన మనిషి కేసీఆర్‌..: సీఎం
  • విద్యుత్‌పై రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక విధానమే లేదు: సీఎం
  • రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారు: సీఎం
  • బీఆర్​ఎస్​ పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసింది: సీఎం
  • బీఆర్​ఎస్ పరిపాలనలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది: సీఎం
  • మీరేం చేశారో చూశాకే ప్రజలు తీర్పు ఇచ్చారు: సీఎం రేవంత్‌రెడ్డి

2:07 PM, 24 Jul 2024 (IST)

మేం తప్పులు చేసి ఉంటే అందుకే ప్రజలు శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు కదా: కేటీఆర్‌

  • డిస్కమ్‌లలో ఏం జరుగుతుందో ఆ శాఖమంత్రి భట్టి తెలుసుకోవాలి: కేటీఆర్‌
  • బిల్లు కలెక్షన్‌కు వెళ్లే అదానీ మనుషులు వచ్చారని గొడవలు అయ్యాయో లేదో తెలుసుకోవాలి: కేటీఆర్‌
  • అదానీ మనుషులు వచ్చారని పాతబస్తీలో గొడవలు జరిగాయని ఇంటెలిజన్స్‌ రిపోర్టు ఇచ్చిందో లేదో తెలుసుకోవాలి: కేటీఆర్‌
  • పాతబస్తీ ఎమ్మెల్యేలతో మీటింగ్‌ పెట్టి వారి భయాలు తొలగించండి: కేటీఆర్‌
  • మేం తప్పులు చేసి ఉంటే.. అందుకే ప్రజలు శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు కదా: కేటీఆర్‌
  • మేం పొరపాట్లు చేశామని అనుకుంటే మీరు సక్రమంగా చేయండి: కేటీఆర్‌
  • డిస్కమ్‌లు ప్రైవేటీకరించం.. అదానీకి ఇవ్వం అని సీఎం ప్రకటన చేయాలి: కేటీఆర్‌
  • అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా మేం ప్రైవేటీకరణకు వ్యతిరేకం: కేటీఆర్‌
  • హైదరాబాద్‌ మెట్రోకు కూడా కేంద్రం ఏనాడూ సహకరించలేదు: కేటీఆర్‌
  • కేంద్రం సహకరించకున్నా మెట్రోను విస్తరించాం: కేటీఆర్‌
  • కేంద్రం నిధులు ఇవ్వదు.. సీఎం, మంత్రులు రాష్ట్రంపై నిందలు వేస్తారు: కేటీఆర్‌
  • బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని దివాలా తీసిందంటే అప్పులెరిస్తారు.. పెట్టుబడులు ఎవరు పెడతారు: కేటీఆర్‌

2:07 PM, 24 Jul 2024 (IST)

సింగరేణి అంశంపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం: భట్టి

  • కేటీఆర్‌ సభతో పాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: భట్టి
  • హైదరాబాద్‌ పవర్‌ సర్కిల్‌ను ప్రైవేటువాళ్లకు ఇస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు: భట్టి
  • ఎవరో పత్రికల్లో రాసినదాన్ని పట్టుకుని సభలో మాట్లాడితే ఎలా? : భట్టి
  • బీఆర్​ఎస్​ వాళ్లలా ఏది పడితే అది చేసే వాళ్లం కాదు: భట్టి విక్రమార్క
  • సింగరేణి అంశంపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం: భట్టి

2:05 PM, 24 Jul 2024 (IST)

బీజేపీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేం ఇబ్బంది?: కేటీఆర్‌

  • మా హయాంలో చాలా సాధించాం: కేటీఆర్‌
  • దిల్లీతత్వం ఇంతకాలానికి కాంగ్రెస్‌కు బోధపడింది: కేటీఆర్‌
  • తెలంగాణ హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతాం: కేటీఆర్‌
  • విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడాం: కేటీఆర్‌
  • మోదీ సర్కారుపై తెలంగాణ కోసం మేం అనేక పోరాటాలు చేశాం: కేటీఆర్‌
  • బీజేపీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేం ఇబ్బంది?: కేటీఆర్‌
  • రేవంత్‌ రెడ్డి కష్టపడే ఈస్థాయికి చేరుకున్నారు: కేటీఆర్‌
  • రేవంత్‌ రెడ్డి చిన్న వయస్సులోనే సీఎం అయ్యారు: కేటీఆర్‌
  • చిన్న వయస్సులోనే సీఎం అయినందుకు రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు: కేటీఆర్‌
  • మేం ఏం మాట్లాడాలో కూడా మీరే చెబితే ఎట్లా?: కేటీఆర్‌
  • శాసించి సాధించుకోవాలి.. యాచిస్తే ఏమీ రాదు: కేటీఆర్‌
  • కేంద్ర వివక్షను ఎండగట్టడంలో మేం సహకరిస్తాం: కేటీఆర్‌
  • కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశాం: కేటీఆర్‌
  • డిస్కమ్‌లు ప్రైవేటీకరించాలని భాజపా చెబుతోంది: కేటీఆర్‌
  • హైదరాబాద్‌ పవర్‌ సర్కిల్‌ను అదానీకి ఇస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు: కేటీఆర్‌
  • డిస్కమ్‌లను ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా: కేటీఆర్‌
  • మోటార్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్రం ఒత్తిళ్లకు లొంగవద్దు: కేటీఆర్‌

2:05 PM, 24 Jul 2024 (IST)

మొన్న దిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చారు: సీఎం రేవంత్‌రెడ్డి

  • కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్‌ కోటా అనుకున్నా అంతకంటే దారుణం: సీఎం
  • తండ్రి పేరు చెప్పుకుని నేను మంత్రిని కాలేదు: రేవంత్‌రెడ్డి
  • కిందిస్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యాను: రేవంత్‌రెడ్డి
  • అవగాహనారాహిత్యంతో సభను కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు: సీఎం
  • కీలకమైన చర్చకు కేసీఆర్ ఎందుకు రాలేదు?: సీఎం రేవంత్‌రెడ్డి
  • మొన్న దిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చారు: సీఎం రేవంత్‌రెడ్డి

2:05 PM, 24 Jul 2024 (IST)

రేవంత్‌ పేమెంట్‌ కోటాలో సీఎం అయ్యారని మేమూ అనొచ్చు: కేటీఆర్‌

  • రేవంత్‌ పేమెంట్‌ కోటాలో సీఎం అయ్యారని మేమూ అనొచ్చు: కేటీఆర్‌
  • మేనేజ్‌మెంట్‌ కోటాలో మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా?: కేటీఆర్‌
  • సభానాయకుడు అలా విమర్శలు చేయవచ్చా: కేటీఆర్‌
  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను మేం సమర్ధిస్తున్నాం: కేటీఆర్‌

1:15 PM, 24 Jul 2024 (IST)

కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు: సీఎం

  • కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదు?: సీఎం

1:14 PM, 24 Jul 2024 (IST)

తీర్మానం ప్రతిని మాకు ఇవ్వలేదు: కేటీఆర్‌

  • తీర్మానం ప్రతిని మాకు ఇవ్వలేదు: కేటీఆర్‌
  • తీర్మానం, ప్రకటన లేకుండా చర్చ జరపడం సరికాదు: కేటీఆర్‌

1:12 PM, 24 Jul 2024 (IST)

మాకు జవాబు చెప్పండి చాలు.. మీకు కేసీఆర్‌ అక్కర్లేదు: కేటీఆర్‌

  • ముఖ్యమైన అంశంలో ప్రజలకు తప్పుడు సంకేతం పోకూడదు: కేటీఆర్‌
  • ప్రభుత్వ తీర్మానానికి నూటికి నూరుశాతం మద్దతిస్తాం: కేటీఆర్‌

  • మాకు జవాబు చెప్పండి చాలు.. మీకు కేసీఆర్‌ అక్కర్లేదు..: కేటీఆర్‌

1:07 PM, 24 Jul 2024 (IST)

రాష్ట్ర ప్రజల తరఫున అందరూ కలిసి కేంద్రాన్ని నిలదీయాలి: సీఎం

  • మన రావాల్సిన హక్కులు, నిధులు, అనుమతులపై పోరాడుతున్నాం: సీఎం
  • రాష్ట్ర ప్రజల తరఫున అందరూ కలిసి కేంద్రాన్ని నిలదీయాలి: సీఎం

12:55 PM, 24 Jul 2024 (IST)

ఐపీఎస్‌లను ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు: శ్రీధర్‌బాబు

  • జాతీయ రహదారుల విషయంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారు: శ్రీధర్‌బాబు
  • హైదరాబాద్‌-కల్వకుర్తి హైవే అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది: శ్రీధర్‌బాబు
  • సీఎం, మంత్రులు దిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేసినా నిధులు కేటాయించలేదు: శ్రీధర్‌బాబు
  • ఐపీఎస్‌లను ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు: శ్రీధర్‌బాబు

12:46 PM, 24 Jul 2024 (IST)

ఇక్కడి బల్క్ డ్రగ్స్ పరిశ్రమలను ప్రోత్సహించడం లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

  • మా రాష్ట్రానికి ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు?: మంత్రి శ్రీధర్‌బాబు
  • ఇతర రాష్ట్రాలకు ఇచ్చి మాకెందుకు ఐఐఎం ఇవ్వలేదు?: మంత్రి శ్రీధర్‌బాబు
  • వెనుకబడిన జిల్లాలకు పెండింగ్ నిధులు ఇవ్వలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
  • హైదరాబాద్‌ ఫార్మా క్యాపిటల్‌ అని మరిచిపోయారా?: మంత్రి శ్రీధర్‌బాబు
  • తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది: మంత్రి శ్రీధర్‌బాబు
  • ఇక్కడి బల్క్ డ్రగ్స్ పరిశ్రమలను ప్రోత్సహించడం లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
  • హైదరాబాద్‌లో మంచి ఈకో సిస్టం ఉందని కేంద్రం గుర్తించాలి: శ్రీధర్‌బాబు
  • మెడికల్ డివైజస్‌ పార్కు, మెగా టెక్స్‌టైల్ పార్కుకు నిధులు కోరాం: శ్రీధర్‌బాబు

12:36 PM, 24 Jul 2024 (IST)

తెలంగాణ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది: మంత్రి శ్రీధర్‌బాబు

  • తెలంగాణ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది: మంత్రి శ్రీధర్‌బాబు
  • తెలంగాణకు పదేళ్లుగా ఏమీ కేటాయించలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
  • మీ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి: మంత్రి శ్రీధర్‌బాబు
  • ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోరా?: మంత్రి శ్రీధర్‌బాబు
  • ఇలాగే వ్యవహరిస్తే మీరు ఆశించిన వికసిత్ భారత్‌ సాధ్యమా?: మంత్రి శ్రీధర్‌బాబు

12:31 PM, 24 Jul 2024 (IST)

భద్రాచలం, రామప్ప దేవాలయం, వేములవాడ అభివృద్ధి ఊసే లేదు: శ్రీధర్‌బాబు

  • మీకు మద్దతిస్తున్నారు కనుక ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించారు: శ్రీధర్‌బాబు
  • ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తామని బడ్జెట్‌లో చెప్పారు: శ్రీధర్‌బాబు
  • మా విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
  • సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని దిల్లీ పెద్దలను కోరాం: శ్రీధర్‌బాబు
  • పర్యాటకాభివృద్ధికి సహకరించాలని దిల్లీ పెద్దలను కోరాం: శ్రీధర్‌బాబు
  • భద్రాచలం, రామప్ప దేవాలయం, వేములవాడ అభివృద్ధి ఊసే లేదు: శ్రీధర్‌బాబు
  • యాదగిరిగుట్ట, కాళేశ్వరం గురించి ప్రస్తావనే లేదు: శ్రీధర్‌బాబు

12:22 PM, 24 Jul 2024 (IST)

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది: శ్రీధర్‌బాబు

  • కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది: శ్రీధర్‌బాబు
  • రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదు: శ్రీధర్‌బాబు
  • సమైక్య స్ఫూర్తి దెబ్బతినేలా నిన్నటి కేంద్ర బడ్జెట్‌ ఉంది: శ్రీధర్‌బాబు
  • విభజన చట్టం హామీల గురించి ప్రస్తావించలేదు: శ్రీధర్‌బాబు
  • విభజన చట్టంలో మనకు రావాల్సినవి ఏమీ రాలేదు: శ్రీధర్‌బాబు
  • రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగిలే వ్యవహరించారు: శ్రీధర్‌బాబు
  • మన రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద గ్రోత్ ఇంజిన్‌ : శ్రీధర్‌బాబు
  • తెలంగాణ ప్రమేయం లేకుండా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చేస్తారు?: శ్రీధర్‌బాబు
  • కేంద్రం ప్రస్తావించిన ఇండస్ట్రియల్ నోడ్‌ ఏపీలో ఉంది: శ్రీధర్‌బాబు
  • ఏపీకి కేంద్రం ఏం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు: శ్రీధర్‌బాబు
  • విభజన చట్టం పేరుతో మాపై వివక్ష చూపడం సరికాదు: శ్రీధర్‌బాబు

11:39 AM, 24 Jul 2024 (IST)

నలుగురు మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల సంతాపం తెలిపిన సభ

  • నలుగురు మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల సంతాపం తెలిపిన సభ
  • ప్రజాప్రతినిధులుగా రాష్ట్రానికి అందించిన సేవలను గు‌ర్తుచేసిన సభాపతి
  • మాజీ ఎమ్మెల్యేల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించిన సభ

11:38 AM, 24 Jul 2024 (IST)

25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ హామీ ఏమైంది?: హరీశ్‌రావు

  • సభలో మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు: హరీశ్‌రావు
  • ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పష్టమైన జవాబివ్వలేదు: హరీశ్‌రావు
  • గ్రూప్‌-1 మెయిన్స్‌ విషయంలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం: హరీశ్‌
  • మెగా డీఎస్సీ అని మోసం చేశారు: హరీశ్‌రావు
  • 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ హామీ ఏమైంది?: హరీశ్‌రావు

11:22 AM, 24 Jul 2024 (IST)

డిస్కంలకు నెలవారీగా గృహజ్యోతి బిల్లులు చెల్లిస్తున్నాం: మంత్రి భట్టి

  • రేషన్‌కార్డు దరఖాస్తులను నెలలపాటు పెండింగ్‌లో ఉంచారు: వాణి
  • ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారు?: వాణి
  • మెరుగైన పాలన కోసమే కొత్త విధానం రూపొందిస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌
  • ఇప్పటికే రేషన్‌ కార్డు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు: ఉత్తమ్‌
  • ఇప్పటికే గృహజ్యోతి జీరో బిల్లులు ఇచ్చాం: మంత్రి భట్టి
  • రూ.కోటీ 77 లక్షల మందికి జీరో బిల్లులు ఇచ్చాం: మంత్రి భట్టి
  • గృహజ్యోతి పథకం కోసం రూ.2,700 కోట్లు కేటాయించాం: మంత్రి భట్టి
  • డిస్కంలకు నెలవారీగా గృహజ్యోతి బిల్లులు చెల్లిస్తున్నాం: మంత్రి భట్టి
  • ఇచ్చిన హామీ మేరకు గృహజ్యోతి జీరో బిల్లులు ఇస్తున్నాం: మంత్రి భట్టి

11:18 AM, 24 Jul 2024 (IST)

బీఆర్​ఎస్​, బీజేపీ వాయిదా తీర్మానాలు తిరస్కరించిన సభాపతి

  • బీఆర్​ఎస్​, బీజేపీ వాయిదా తీర్మానాలు తిరస్కరించిన సభాపతి

11:04 AM, 24 Jul 2024 (IST)

హరీశ్‌రావు సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారు: సీఎం

  • హరీశ్‌రావు సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారు: సీఎం
  • హరీశ్‌రావు పదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు: సీఎం
  • హరీశ్‌రావు శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు: సీఎం
  • సభాపతిపై వ్యాఖ్యలు చేయడం హరీశ్‌రావుకు తగదు: సీఎం
  • ఆర్టీసీ కార్మికుల తరఫున మాట్లాడేందుకు సీపీఐకి అవకాశం ఇచ్చారు: సీఎం
  • సీపీఐకి అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నించడం హరీశ్‌కు సరికాదు: సీఎం
  • ప్రశ్న అడిగివారికే మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎక్కడా లేదు: సీఎం
  • ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలో అనేది సభాపతి విచక్షణ: సీఎం
  • ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ఉంది: సీఎం
  • ఒక కార్మిక నేతను తొలగించేందుకు సంఘాలనే గత ప్రభుత్వం రద్దు చేసింది: సీఎం
  • సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించవద్దని భారాస నేతలకు మనవి: సీఎం

11:03 AM, 24 Jul 2024 (IST)

సమ్మె సమయంలో ఖమ్మంలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు: కూనంనేని

  • ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో గతప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది: కూనంనేని
  • సమ్మె సమయంలో ఖమ్మంలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు: కూనంనేని

10:56 AM, 24 Jul 2024 (IST)

నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు: హరీశ్‌రావు

  • నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు: హరీశ్‌రావు
  • మా ప్రశ్నకు జవాబివ్వకుండా మంత్రి ఏదేదో చెబుతున్నారు: హరీశ్‌రావు

10:52 AM, 24 Jul 2024 (IST)

ఆర్టీసీ కార్మికులను అభినందిస్తున్నాం: మంత్రి పొన్నం

  • ఆర్టీసీ అంశాన్ని బీఆర్​ఎస్​ రాజకీయం చేస్తోంది: మంత్రి పొన్నం
  • యూనియన్లు రద్దు చేసి ఇప్పుడు పునరుద్ధరణ మాట్లాడుతున్నారు: పొన్నం
  • ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదు: పొన్నం
  • ఆర్టీసీ సొమ్మును గత ప్రభుత్వం వాడుకుంది: మంత్రి పొన్నం
  • ఆర్టీసీకి మేం నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నాం: మంత్రి పొన్నం
  • ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నాం: మంత్రి పొన్నం
  • ఆర్టీసీలో 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నాం: మంత్రి పొన్నం
  • పనిభారం పెరిగినా ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేస్తున్నారు: మంత్రి పొన్నం
  • ఆర్టీసీ కార్మికులను అభినందిస్తున్నాం: మంత్రి పొన్నం
  • ఎన్నికల ముందు ఆదరబాదరాగా ప్రభుత్వంలో విలీనం చేశారు: మంత్రి పొన్నం
  • ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు మేం చెల్లించాం: మంత్రి పొన్నం
  • ఆర్టీసీ కార్మికులపై బీఆర్​ఎస్​ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు: పొన్నం
  • ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత: మంత్రి పొన్నం
  • ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్​ఎస్​కు లేదు: మంత్రి పొన్నం
  • మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఇచ్చాం: పొన్నం
  • ఆర్టీసీని పూర్తిగా చంపేందుకు బీఆర్​ఎస్​ ప్రయత్నం చేసింది: మంత్రి పొన్నం
  • ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి లోటూ రానివ్వం: మంత్రి పొన్నం

10:47 AM, 24 Jul 2024 (IST)

ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు?: హరీశ్‌రావు

  • ఆర్టీసీ కార్మికులతో అదనపు గంటలు పనిచేయిస్తున్నారు: హరీశ్‌రావు
  • ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు?: హరీశ్‌రావు
  • ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారు?: హరీశ్‌రావు

10:41 AM, 24 Jul 2024 (IST)

ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్‌ డేట్ ప్రకటిస్తారు: హరీశ్‌రావు

  • ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్‌ ఎన్నో హామీలు ఇచ్చింది: హరీశ్‌రావు
  • ఆర్టీసీ కార్మికులను పీఆర్‌సీ పరిధిలోకి తెస్తామన్నారు: హరీశ్‌రావు
  • ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్‌ డేట్ ప్రకటిస్తారు: హరీశ్‌రావు
  • కార్మికుల యూనియన్‌ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారు?: హరీశ్‌రావు
  • పీఆర్‌సీ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు?: హరీశ్‌రావు
  • ఫిబ్రవరి 10నే సీఎం చెక్కు చూపించారు, ఇంకా చెల్లించలేదు: హరీశ్‌రావు
  • నెక్లస్‌రోడ్‌ నుంచి బస్‌భవన్‌కు చెక్కు ఎప్పుడు చేరుతుంది?: హరీశ్‌రావు

10:37 AM, 24 Jul 2024 (IST)

తండాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చర్యలు: మంత్రి సీతక్క

  • తండాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చర్యలు: మంత్రి సీతక్క
  • తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చే అంశం చర్చిస్తున్నాం: సీతక్క
  • 1936 నాటి రెవెన్యూ గ్రామాలే ఇంకా కొనసాగుతున్నాయి: మంత్రి సీతక్క

10:35 AM, 24 Jul 2024 (IST)

  • పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదు: సీఎం
  • అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తాం: సీఎం
  • అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
  • ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదు: : సీఎం
  • బీఆర్​ఎస్​ నేతల వైఖరి ఇంకా మారలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
  • తప్పులు చేశారు, ప్రజలు శిక్షించారు, అయినా మారలేదు: సీఎం
  • బీఆర్​ఎస్​ నేతలకు మంచిబుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం: సీఎం
  • రోడ్లు సరిగాలేక ప్రమాదాలు జరిగి అనేకమంది చనిపోతున్నారు: సీఎం
  • తండాలను అభివృద్ధి వైపు నడిపించాలని నిర్ణయించాం: సీఎం

10:26 AM, 24 Jul 2024 (IST)

కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

  • కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
  • నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి: రేవంత్‌రెడ్డి
  • కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలి: రేవంత్‌రెడ్డి
  • పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్‌

10:23 AM, 24 Jul 2024 (IST)

తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఉత్తమ్‌

  • తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఉత్తమ్‌
  • సుందిళ్ల బ్యారేజ్ వద్ద ఇంకా సీపేజ్ కొనసాగుతోంది: మంత్రి ఉత్తమ్‌
  • గంధమల్లపై ఇప్పటివరకు రూపాయి పనికూడా జరగలేదు: మంత్రి ఉత్తమ్‌
  • గంధమల్ల భూసేకరణపై అధ్యయనం చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌
  • స్థానికులు భూసేకరణకు సహకరిస్తే పనులు ప్రారంభిస్తాం: మంత్రి ఉత్తమ్‌
  • 1.5 టీఎంసీల నీరు నిలిపేలా గంధమల్లలో పనులు ప్రారంభిస్తాం: ఉత్తమ్‌
  • 4.28 టీఎంసీల కెపాసిటీ కావాలంటే గంధమల్ల మునిగిపోతుంది: ఉత్తమ్‌
  • గంధమల్ల గ్రామస్థులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు: ఉత్తమ్‌
  • ఎంత కెపాసిటీతో గంధమల్ల నిర్మించాలో త్వరలో నిర్ణయం: మంత్రి ఉత్తమ్‌

10:16 AM, 24 Jul 2024 (IST)

గంధమల్ల రిజర్వాయర్ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది: మల్లన్న

గంధమల్ల రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు ప్రాంతానికి లాభం: తీన్మార్‌ మల్లన్న

ఈ బడ్జెట్‌లో గంధమల్ల రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలి: మల్లన్న

10:13 AM, 24 Jul 2024 (IST)

తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడితే పుష్కలంగా నీళ్లు వస్తాయి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.ఐదు వేల కోట్లు కేటాయించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

10:13 AM, 24 Jul 2024 (IST)

చాలా బస్సులు ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్నాయి: మక్కాన్‌ సింగ్‌

  • పాఠశాల బస్సులకు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి: మక్కాన్‌ సింగ్‌
  • కొన్ని బస్సులపై పేర్లు, వివరాలు కూడా ఉండవు: మక్కాన్ సింగ్
  • పాఠశాల, కళాశాల బస్సులను తరచుగా తనిఖీ చేయాలి: మక్కాన్ సింగ్

10:06 AM, 24 Jul 2024 (IST)

అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం

  • అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

9:49 AM, 24 Jul 2024 (IST)

కాసేపట్లో శాసనసభ సమావేశాలు

  • బీఏసీ సమావేశ నిర్ణయాలను సభ ముందుంచనున్న సీఎం
  • ఇవాళ్టి అజెండాలో తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తీర్మానం పెట్టనున్న ప్రభుత్వం

9:48 AM, 24 Jul 2024 (IST)

నిరుద్యోగుల సమస్యపై ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

  • నిరుద్యోగుల సమస్యపై ఉభయ సభల్లో భారాస వాయిదా తీర్మానం
  • జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల ఆందోళనలపై వాయిదా తీర్మానం
  • ప్రభుత్వ అణిచివేత వైఖరిపై చర్చ కోరుతూ భారాస వాయిదా తీర్మానం

Last Updated : Jul 24, 2024, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.