ETV Bharat / state

LIVE UPDATES : రేపు ఉదయం 10 గంటలకు వాయిదా పడిన శాసనసభ - TG ASSEMLBLY SESSION LIVE UPDATES

ASSEMBLY LIVE UPDATES
Telangana Assembly Session Toda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 10:10 AM IST

Updated : Aug 1, 2024, 3:05 PM IST

Telangana Assembly Session Today : గురువారం రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఇవాళ హైదరాబాద్ మెట్రో సిటీ సుస్థిర పట్టణాభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, సివిల్ కోర్టుల చట్ట సవరణ, తెలంగాణ చట్టాల బిల్లులపైనా చర్చిస్తున్నారు.

LIVE FEED

3:03 PM, 1 Aug 2024 (IST)

శాసనసభ వాయిదా

రేపు ఉదయం 10 గంటలకు వాయిదా పడిన శాసనసభ

3:02 PM, 1 Aug 2024 (IST)

గాంధీజీ ఆలోచనతోనే యంగ్‌ ఇండియా వచ్చింది : శ్రీధర్ బాబు

గాంధీజీ ఆలోచనతోనే యంగ్‌ ఇండియా వచ్చిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 30 లక్షల చిలుకుపైగా నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారని

టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఆయన తెలిపారు.

2:51 PM, 1 Aug 2024 (IST)

స్కిల్‌ వర్సిటీ ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

స్కిల్‌ వర్సిటీ ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వం కూడా స్కిల్ వర్సిటీలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు స్కిల్ వర్సిటీ వల్ల లబ్ధి చేకూరుతుందని స్కిల్ వర్సిటీలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాల్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులను ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వం యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి కోసం రూ.12లక్షలు ఇవ్వాలని ఆయన తెలిపారు.

2:23 PM, 1 Aug 2024 (IST)

30 లక్షల చిలుకుపైగా నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు : శ్రీధర్​బాబు

గాంధీజీ ఆలోచనతోనే యంగ్‌ ఇండియా అనే పేరు వచ్చిందని శ్రీధర్​బాబు అన్నారు. 30 లక్షల చిలుకుపైగా నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారని తెలిపారు. టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.

2:14 PM, 1 Aug 2024 (IST)

స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి : భట్టి

స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని భట్టి తెలిపారు. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నామని పేర్కొన్నారు. అందరికి మేలు జరిగేలా స్కిల్‌ యూనివర్సిటీ ఉంటుందని వివరించారు. కొంతమంది వ్యక్తుల కోసమే ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువచ్చారని విమర్శించారు.

2:07 PM, 1 Aug 2024 (IST)

జైళ్లో ఉన్న సొంత చెల్లి గురించి మాట్లాడరు : సీఎం రేవంత్‌రెడ్డి

జైళ్లో ఉన్న సొంత చెల్లి గురించి మాట్లాడరని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీని దెబ్బ తీసి స్కిల్‌ వర్సిటీ ఆలోచనను అడ్డుకునేందుకు యత్నించారని ఆరోపించారు. దళిత వ్యక్తిని సీఎం చేస్తానని మోసం చేశారని ధ్వజమెత్తారు. దళిత ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి బర్త్‌రఫ్‌ చేశారని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ, రాహుల్‌ ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. సోనియా, రాహుల్‌ గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌ను చేశారని గుర్తుచేశారు. నేరళ్ల దళితులను కరెంట్‌ షాకులతో హింసించారని మండిపడ్డారు. నేరళ్ల బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మీరాకుమారిని విమానాశ్రయంలో అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

1:48 PM, 1 Aug 2024 (IST)

సబిత, సునీత కోసం కొట్లాడింది నేను : సీఎం రేవంత్‌రెడ్డి

సీతక్కను అవమానించేలా సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పెట్టడమేనా మీ నీతి అని బీఆర్​ఎస్​ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించవచ్చా అని మండిపడ్డారు. ఎవరి ఉచ్చులో పడి తప్పుదోవ పడుతున్న అక్కలకు తాను చెబుతున్నది ఒక్కటేనని అన్నారు. మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తిహాడ్‌ జైలులో ఉన్నారని వ్యాఖ్యానించారు. మమ్మల్ని అరెస్టు చేయవద్దు, అవసరమైతే మా చెల్లెలను ఏడాదిపాటు జైలులో ఉంచమని బేరసారాలు చేసుకున్నారని ఆరోపించారు. సబిత, సునీత కోసం కొట్లాడింది తాను అని పేర్కొన్నారు. మహిళలను తను గౌరవిస్తానని, తనను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందువరుసలో ఉన్నారని తెలిపారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు.

1:42 PM, 1 Aug 2024 (IST)

నా కుటుంబసభ్యురాలు సీతక్క పట్లం ఎంత అవమానకరంగా మాట్లాడారు : సీఎం

బీఆర్​ఎస్​ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తుందని సీఎం రేవంత్​ అన్నారు. అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తుందని విమర్శించారు. సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించానని తెలిపారు. ఒక అక్క తనను నడిబజారులో వదిలేసినా ఏం అనలేదని వివరించారు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని, తన ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఒకరు మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ పదవి తెచ్చుకున్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపారు. తన కుటుంబసభ్యురాలు సీతక్క పట్లం ఎంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

1:40 PM, 1 Aug 2024 (IST)

ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు జైళ్లో ఉన్నారు: సీఎం రేవంత్​

ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రి పదవుల్లో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు జైళ్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

1:36 PM, 1 Aug 2024 (IST)

యంగ్‌ ఇండియా స్కిల్ వర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెడుతున్నాం : సీఎం

  • ప్రధానప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదు వచ్చివాళ్లు వాకౌట్‌ చేశారు : సీఎం రేవంత్
  • యంగ్‌ ఇండియా స్కిల్ వర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెడుతున్నాం
  • ఈ 17 కోర్సులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి
  • ఈ యూనివర్సిటీ నిర్వహణ కోసం పీపీపీ విధానం తీసుకొచ్చాం
  • హెల్త్‌కేర్‌, ఫార్మాస్యూటికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఏఐ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్సెస్‌ కోర్సులు
  • టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, ఆటోమేటివ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ల వెహికల్స్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సైన్సెస్‌, అండ్ ఇన్సూరెన్స్‌ కోర్సులు తీసుకువస్తాం

1:33 PM, 1 Aug 2024 (IST)

నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

  • నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
  • మహాత్మాగాంధీ నిర్వహించిన యంగ్‌ ఇండియా పత్రిక స్ఫూర్తితో 'యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ' ఏర్పాటు
    రాజీవ్‌గాంధీ అందించిన సాంకేతిక నైపుణ్య స్ఫూర్తితో ఈ యూనివర్సిటీ ప్రారంభించుకుంటున్నాం
  • ఉద్యోగాలు పొందడం కాదు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ బిల్లు తీసుకొచ్చాం
  • యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం నాయకులు సభకు వచ్చి సూచనలు ఇస్తే స్వాగతించేవాళ్లం

1:29 PM, 1 Aug 2024 (IST)

స్కిల్‌ వర్సిటీలో 15 కోర్సులు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం : సీఎం

  • సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువత పోటీ పడాలి: సీఎం
  • స్కిల్‌ వర్సిటీలో 15 కోర్సులు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం
  • వృత్తి నైపుణ్యం లేకపోవడంతో సర్టిఫికేట్‌ ఉన్నా ఉద్యోగాలు రావట్లేదు
  • హెల్త్‌కేర్, ఫార్మా, ఏఐ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, యానిమేషన్‌, గేమింగ్‌ తదితర కోర్సులను తీసుకురాబోతున్నాం
  • 3 నుంచి 6 నెలలు

1:24 PM, 1 Aug 2024 (IST)

కాంగ్రెస్‌ వేసిన పునాదిరాయితో హైదరాబాద్‌లో ఐటీ రంగం వేళ్లూనుకుంది : సీఎం

  • కాంగ్రెస్‌ వేసిన పునాదిరాయితో హైదరాబాద్‌లో ఐటీ రంగం వేళ్లూనుకుంది : సీఎం
  • ప్రపంచంలో ఐటీరంగ నిపుణులు భారతీయులు నలుగురు ఉంటే అందులో తెలుగువారు ఒకరు ఉంటారు
  • సాంకేతిక నిపుణుల కోసం ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తుంది
  • గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ వంటి దిగ్గజసంస్థలకు సీఈవోలుగా భారతీయులు ఉండటం గర్వకారణం
  • రాజీవ్‌గాంధీ నిర్ణయం వల్లే కంప్యూటర్‌ యుగంలో భారత్ ప్రపంచంతో పోటీపడుతుంది

1:20 PM, 1 Aug 2024 (IST)

నెహ్రూ విద్య, నీటిపారుదలకు మెుదటి ప్రాధాన్యత ఇచ్చారు : సీఎం

  • నెహ్రూ విద్య, నీటిపారుదలకు మెుదటి ప్రాధాన్యత ఇచ్చారు: సీఎం
  • మారుమూల ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు
  • ప్రతిపేదవాడికి విద్య అందాలన్న లక్ష్యంతో రిజర్వేషన్లు తీసుకొచ్చారు
  • రెసిడెన్షియల్‌ స్కూళ్ల ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చారు
  • ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేంచుదుకు నెహ్రూ పునాది వేశారు
  • ఎస్సీ, ఎస్టీలకు ఇందిరాగాంధీ ఉపకార వేతనాలు అందించారు
  • ఇందిరాగాంధీ ప్రభుత్వంరంగ సంస్థలను నెలకొల్పారు: సీఎం
  • రైల్వే, ఎల్‌ఐసీ, రక్షణరంగం, విమానయానం వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు
  • రాజీవ్‌గాంధీ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేశారు: సీఎం
  • నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైటెక్‌ సిటీకి పునాదిరాయి వేశారు
  • హైదరాబాద్‌లో ఐటీరంగ నిపుణులను తయారుచేసేందుకు కృషి చేశారు

1:18 PM, 1 Aug 2024 (IST)

అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెస్టు

  • అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెస్టు
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లిన పోలీసులు

12:49 PM, 1 Aug 2024 (IST)

సీఎం ఛాంబర్‌ ముందు బైఠాయించిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో సీఎం ఛాంబర్‌ ముందు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు బైఠాయించారు. క్షమాపణ చెప్పేవరకు సీఎం ఛాంబర్ ముందే కూర్చుంటామని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బయటకు పంపారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణ నుంచి బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు బయటకు తరలించారు.

12:44 PM, 1 Aug 2024 (IST)

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అందరికంటే ముందే అమలు చేస్తాం : సీఎం రేవంత్​

దేశంలోనే అందరికంటే ముందే ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

12:35 PM, 1 Aug 2024 (IST)

ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించారు : హరీశ్​ రావు

ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించారని హరీశ్​రావు పేర్కొన్నారు. గాంధీభవన్‌ వద్ద ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ వర్గీకరణ చేయట్లేదని మందకృష్ణ నేతృత్వంలో గాంధీభవన్‌ను ముట్టడించేందుకు వచ్చారని గుర్తు చేశారు.

12:31 PM, 1 Aug 2024 (IST)

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్​ఎస్​ స్వాగతిస్తుంది : హరీశ్​ రావు

సభ కౌరవులసభలాగా నిర్వహిస్తున్నారని హరీశ్​రావు విమర్శించారు. ఈ సభ కౌరవుల సభను తలపిస్తుందని పేర్కొన్నారు. అంతిమంగా గెలిచేది పాండవులని, నిలిచేది పాండవులే అని వ్యాఖ్యానించారు. అధికారం పక్షం అహంకారంతో చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్​ఎస్​ స్వాగతిస్తుందని తెలిపారు. 29 నవంబర్‌ 2014లో తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేసీఆరే స్వయంగా ప్రధానికి వివరించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని వివరించారు.

12:29 PM, 1 Aug 2024 (IST)

ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్‌ ఎందుకు మాట్లాడటం లేదు? : శ్రీధర్‌బాబు

ఎస్సీ వర్గీకరణకు అంశంపై బీఆర్‌ఎస్‌ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రిశ్రీధర్​బాబు ప్రశ్నించారు.

12:26 PM, 1 Aug 2024 (IST)

ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్‌ సభకు వచ్చి సూచనలు చేయాలి : సీఎం రేవంత్​

వర్గీకరణ అంశంపై అభిప్రాయం చెప్పేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వండని సీఎం కోరారు. వర్గీకరణను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై కేసీఆర్‌ సభకు వచ్చి సూచనలు చేయాలని డిమాండ్​ చేశారు.

12:23 PM, 1 Aug 2024 (IST)

ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు అండగా నిలిచాయి : కడియం శ్రీహరి

సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఎస్సీ వర్గీకరణకు గతంలో టీడీపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప్రభుత్వాలు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశాయని చెప్పారు. ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపించాయని వివరించారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు అండగా నిలిచాయని, వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ఫిడవిట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.

12:21 PM, 1 Aug 2024 (IST)

బీఆర్​ఎస్​ సభ్యులకు అవకాశం ఇస్తాం : స్పీకర్

ఎస్సీ వర్గీకరణపై మాట్లాడేందుకు బీఆర్​ఎస్​ సభ్యులకు అవకాశం ఇస్తామని స్పీకర్ తెలిపారు.

12:17 PM, 1 Aug 2024 (IST)

ఎస్సీ వర్గీకరణ అంశంపై బీఆర్​ఎస్​ అభిప్రాయం చెప్పాలి : శ్రీధర్‌బాబు

ఎస్సీ వర్గీకరణ విషయంపై బీఆర్​ఎస్​ అభిప్రాయం చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్​ చేశారు. ఈ అంశంపై మాట్లాడతామంటే అవకాశం ఇస్తామని తెలిపారు. చారిత్రక తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

12:16 PM, 1 Aug 2024 (IST)

ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన కూనంనేని

వర్గీకరణపై సుప్రీం తీర్పును మనస్ఫూర్తిగా హర్షిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.

12:15 PM, 1 Aug 2024 (IST)

ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన అక్బరుద్దీన్‌

ఎస్సీ వర్గీకరణను శాసనసభలో అక్బరుద్దీన్‌ స్వాగతించారు.

11:56 AM, 1 Aug 2024 (IST)

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు : సీఎం

ఎస్సీ వర్గీకరణ కోసం 27 ఏళ్లుగా పోరాటం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం సాగించారని తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం తాను, సంపత్‌ వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన తమను సభ నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్తామని చెప్పిందని, కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణను అందరికంటే ముందే రాష్ట్రంలో అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పుడిచ్చిన నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. నోటిఫికేషన్లలో ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాలని సభను కోరారు.

11:31 AM, 1 Aug 2024 (IST)

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల బైఠాయింపు

శాసనసభలో పోడియం ముందు బీఆర్​ఎస్​ సభ్యులు బైఠాయించారు.

10:52 AM, 1 Aug 2024 (IST)

రాష్ట్ర యువత బీఆర్​ఎస్​ సభ్యుల చేష్టలను గమనిస్తుంది: శ్రీధర్‌బాబు

సభలో గట్టిగా నినాదాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని శ్రీధర్‌బాబు అన్నారు. సభలో బీఆర్​ఎస్​ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ప్రయోజనం కంటే బీఆర్​ఎస్​కు రాజకీయ భవిష్యత్తే ముఖ్యం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ యువత భవిష్యత్‌ కోసం సహకరిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర యువత బీఆర్​ఎస్ సభ్యుల చేష్టలను గమనిస్తుందని పేర్కొన్నారు.

10:47 AM, 1 Aug 2024 (IST)

అసెంబ్లీలో బీఆర్​ఎస్​ సభ్యుల నినాదాలు

బీఆర్​ఎస్​ సభ్యులు సభలో నినాదాలు చేస్తున్నారు. సభ్యుల నినాదాలే మధ్యే అసెంబ్లీ సభ కొనసాగుతోంది.

10:46 AM, 1 Aug 2024 (IST)

స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. గత ప్రభుత్వం యువతను పట్టించుకోలేదన మండిపడ్డారు. స్కిల్ వర్సిటీలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లను పెట్టాలని కోరారు. జిల్లాల్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. గత ప్రభుత్వం యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి కోసం రూ.12లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

10:45 AM, 1 Aug 2024 (IST)

మంచి పర్సంటేజ్‌తో పాసైనా ఉద్యోగాలు లేవు : మంత్రి కోమటిరెడ్డి

అకడమిక్‌లో మంచి పర్సంటేజ్‌తో పాసైనా ఉద్యోగాలు లేవని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. నైపుణ్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఉద్యోగాలు రావట్లేదని తెలిపారు.

10:40 AM, 1 Aug 2024 (IST)

సభామర్యాదలు పాటిస్తే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తా : స్పీకర్

హరీశ్​ రావు, కేటీఆర్‌ సభామర్యాదలను కాపాడాలని స్పీకర్ కోరారు. సభామర్యాదలు పాటిస్తే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తానని తెలిపారు. సబితకు మాట్లాడే అవకాశం కల్పించాలని బీఆర్​ఎస్​ పట్టుబడుతోంది. బీఆర్​ఎస్​ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని స్పీకర్ హెచ్చరించారు.

10:36 AM, 1 Aug 2024 (IST)

యువత భవిష్యత్‌ కోసం ఆలోచించాలి : శ్రీధర్‌బాబు

మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తామని మంత్రి శ్రీధర్​బాబు పేర్కొన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి యువత భవిష్యత్‌ కోసం ఆలోచించండని సూచించారు. స్కిల్‌ యూనివర్సిటీ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని కోరారు.

10:31 AM, 1 Aug 2024 (IST)

పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్‌ వర్సిటీ : శ్రీధర్‌బాబు

2024-25 సంవత్సరంలో 2000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ముచ్చర్లలో స్కిల్‌ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిషిప్‌ పెట్టాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. సుమారు 60 శాతం మంది అధ్యాపకులు, నిపుణులు నియమిస్తామని తెలిపారు. పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్‌ వర్సిటీ కొనసాగుతుందని ప్రకటించారు.

10:28 AM, 1 Aug 2024 (IST)

స్కిల్‌ వర్సిటీ బిల్లుపై చర్చకు సహకరించాలి : స్పీకర్‌

సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించాలని బీఆర్​ఎస్​ పట్టుబడింది. దీంతో సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్‌ తెలిపారు. స్కిల్‌ వర్సిటీ బిల్లుపై చర్చకు సహకరించాలని బీఆర్​ఎస్​ సభ్యులకు స్పీకర్‌ సూచించారు.

10:23 AM, 1 Aug 2024 (IST)

స్కిల్‌ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది : శ్రీధర్‌బాబు

నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుందని వ్యాఖ్యానించారు.

10:18 AM, 1 Aug 2024 (IST)

అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు : శ్రీధర్‌బాబు

2 లక్షల ఉద్యోగాలు కల్పించినా మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని మంత్రి శ్రీధర్​బాబు పేర్కొన్నారు. ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని తెలిపారు. నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని చెప్పారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ' స్థాపనకు ప్రతిపాదిస్తున్నామన్నారు. నైపుణ్యాల పెంపొందించే ఉద్దేశంతోనే 'యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ' స్థాపన అని వెల్లడించారు. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్‌ కాంపొనెంట్‌ను కలిగి ఉంటాయని చెప్పారు.

10:15 AM, 1 Aug 2024 (IST)

రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ : మంత్రి శ్రీధర్‌బాబు

'యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ' బిల్లును శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అతి త్వరలో జాబ్‌ క్యాలెండర్ ప్రకటించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నాయని తెలిపారు.

10:12 AM, 1 Aug 2024 (IST)

శాసనసభలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు

నల్ల బ్యాడ్జీలతో సభలోకి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు వచ్చారు.

10:10 AM, 1 Aug 2024 (IST)

శాసనసభ ప్రారంభం

స్కిల్ వర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.

Last Updated : Aug 1, 2024, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.