ETV Bharat / state

పంచెకట్టులో ఎంపీలు - తెలుగులో ప్రమాణం - సైకిల్‌పై పార్లమెంట్‌కు - లోక్‌సభ సమావేశాల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఇవే - TELUGU MPs OATH IN LOK SABHA 2024

Telugu MPs Oath Taking in Lok Sabha Today : 18వ లోక్‌సభ సమావేశాల తొలిరోజున పలువురు ఎంపీల ప్రమాణ స్వీకారం ఆసక్తిని కలిగించింది. తెలంగాణ, ఏపీల నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్‌సభలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిలో కొంతమంది పంచెకట్టులో అచ్చమైన తెలుగు సంప్రదాయపద్ధతిలో వచ్చి తెలుగు భాషలో ప్రమాణం చేయగా, విజయనగరం ఎంపీ కలిశెట్టి వినూత్నరీతిలో సైకిల్​పై పార్లమెంట్​కు వెళ్లి, పార్టీపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

Lok Sabha MPs Oath Ceremony 2024
TDP MP's Oath at Parliament (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 4:43 PM IST

లోక్​సభ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన - సైకిల్​పై పార్లమెంట్‌కు చేరుకున్న ఎంపీ కలిశెట్టి (ETV Bharat)

Lok Sabha MPs Oath Ceremony 2024 : 18వ లోక్‌సభ సమావేశాల్లో తొలిరోజు పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ, ఏపీ నుంచి లోక్‌సభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో పలువురు పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తెలుగులో ప్రమాణం చేశారు. మరోవైపు టీడీపీ ఎంపీ ఏకంగా సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకుని పార్టీపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇవాళ ప్రమాణం చేశారు. కిషన్ రెడ్డి తెలుపు రంగు పంచెకట్టులో పార్లమెంటుకు చేరుకోగా, బండి సంజయ్ ఎప్పటిమాదిరి వైట్ కలర్ డ్రెస్సులో వచ్చారు. ఈ ఇద్దరూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్​ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్​ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా, చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి​ గతంలోనే బాధ్యతలు స్వీకరించారు.

పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్‌ హౌస్​కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, దిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు. సైకిల్‌ గుర్తుపై ఎంపీగా గెలిచిన తాను, మొదటి రోజు పార్లమెంట్‌లో అడుగు పెడుతున్న వేళ ఇలా సైకిల్‌పై చేరుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు.

తెలుగులో కొందరు, ఆంగ్లంలో మరికొందరు : కూటమికి చెందిన మిగిలిన ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీ భరత్‌, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్‌ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, సీఎం రమేశ్, ఉదయ్‌ శ్రీనివాస్‌, హరీశ్​ బాలయోగి, పుట్టా మహేశ్‌కుమార్‌ తదితరులు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.