ETV Bharat / state

పదోతరగతి విద్యార్థులకు​ అలర్ట్ - రిజల్ట్స్‌ వచ్చేది ఆరోజే? - Telangana ssc results 2024

Telangana SSC Results 2024 : రాష్ట్రంలో పదోతరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 30న లేదా వచ్చేనెల 1న ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

TELANGANA SSC RESULTS 2024
TELANGANA SSC RESULTS 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 8:16 AM IST

Updated : Apr 21, 2024, 10:57 AM IST

Telangana 10th Results 2024 On May 1st : తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఫలితాల ప్రకటనకు ముహూర్తం సిద్ధమైంది. ఈనెల 30న లేదా వచ్చే నెల 1న ఉదయం ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది పరీక్షలు రాశారు. దీనికి సంబంధించిన మూల్యాంకనం శనివారం పూర్తయింది.

TS SSC Board Results 2024 : ఈ క్రమంలోనే వారం రోజులపాటు ఫలితాల డీకోడింగ్‌ అనంతరం ఈనెల 30న లేదా వచ్చే నెల 1న ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడిని ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకోసం విద్యాశాఖ మొత్తం 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్షలు జరిగాయి. అయితే పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం లోనికి అనుమతించారు.

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips

తెలంగాణలో ఉన్న 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. 30,000ల మంది వరకు ఇన్విజిలేటర్లు పరీక్షా విధులు నిర్వహించారు. విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లో కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మరోవైపు పదోతరగతి పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ సైతం విద్యార్థులు పరీక్షలకు సమయానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాలురు తమ హాల్ టికెట్ చూపించి జనరల్ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు ఉచిత ప్రయాణం చేసేలా వీలును కల్పించింది. బాలికలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సర్వీసు అందుబాటులో ఉంది.

విద్యార్థులారా బీ రెడీ - ఈనెల 24న ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - TELANGANA INTER RESULTS DATE 2024

నావల్ డాక్​యార్డ్​లో 301 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - Naval Dockyard Apprentice Posts

Last Updated : Apr 21, 2024, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.