Technogeon-2024 Celebrations At NIT Warangal : విద్యార్థులే నిర్వాహకులై జరిపే టెక్నోజియాన్ వేడుక ఉత్సాహభరితంగా సాగింది. ప్రతి ఏటా సరికొత్త థీమ్‌తో జరిగే ఈ సాంకేతిక సంబురాలు ఈసారి ఇంజీనియస్ పేరుతో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక స్ఫూర్తి అనే అర్థంతో జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన 3 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు 40 కి పైగా ఈవెంట్లలో పాల్గొని ఔరా అనిపించారు. రెండో రోజు టెక్నోజియాన్ ఈవెంట్లలో భాగంగా విద్యార్థులు చేసిన పలు రోబోటిక్ ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
Warangal National Institute of Technology : రోబోటిక్ విభాగంలో హైదరాబాద్‌కి చెందిన విద్యార్థులు రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే కార్ల రేసులో ఒక ఆకారంలో పేర్చిన రాళ్ల మధ్యలో నిర్ణీత సమయంలో దూసుకు పోయేలా ప్రదర్శనలు చేశారు. ఈ వేడుకల్లో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బ్లూటూత్ కనెక్టివిటీ కంట్రోల్ ద్వారా దేశం మొత్తం చుట్టేస్తున్న వాహనాన్ని తయారుచేసి అందరీ దృష్టిని ఆకర్షించారు. ఎలక్ట్రిక్ వెహికల్ మోడలింగ్‌పై వర్క్‌షాప్‌లను నిర్వహించారు. సిమ్యులేషన్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా తయారు చేయాలో ఈ వర్క్‌షాప్‌లో నేర్పిస్తున్నారు.
" ఈ రిమోట్ కార్స్ మేము స్వయంగా తయారు చేశాం. చాలా వాటికి ప్రిక్వెన్సిస్ సింక్ అవుతుంటాయి. మేము నేర్చుకున్న నాలెడ్జ్ ఉపయోగించి సింక్ కాకుండా బ్యాటరీలు రీఛార్జ్ కు సరిపడే విధంగా మల్టిపుల్‌గా బ్యాటరీలు అందుబాటులో ఉంచుకొని ఒ సారి రేస్ అయిపోగానే మళ్లీ ఇంకోసారి ప్రయోగించడానికి తయారు చేసుకుంటాం."-విద్యార్థులు
వరంగల్ నిట్‌లో ఉత్సాహంగా సాగుతోన్న యూత్ ఫెస్ట్
Technogeon-2023 Celebrations : ఈ వేడుకలలో సాంకేతిక ప్రదర్శనలతో పాటుగా పలువురు ప్రముఖులను ఆహ్వానించి వారితో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి టెక్నోజియన్ వేదికగా నిలుస్తుందని నేర్చుకున్న దానికంటే అనుభవపూర్వకంగా చేసింది గొప్పగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇవాళ్టితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ ప్రదర్శనల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులను కూడా అందించనున్నారు.
"పిక్సల్ టు పోట్రెట్ అనే ఈవెంట్ ఉంది. మా ఫొటోస్ తీసి ప్రింట్ బయటకు తీసుకొని పోట్రెట్గా అమ్మొచ్చు ఆ ఈవెంట్ ఇక్కడ చేస్తున్నాం. మరో గేమింగ్ ఈవెంట్ ఇక్కడ ఏర్పాటు చేశాం. కస్టమైసైడ్ బొమ్మలు ప్రింట్ చేసుకునే ఈవెంట్ ఉంది. టెక్నోజియాన్-2024 వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది."-విద్యార్థులు
వరంగల్ నిట్‌లో 'స్ప్రింగ్ స్ప్రీ' వేడుకలు.. ఆకట్టుకున్న సుమ 'టాక్ షో'
వరంగల్ నిట్‌లో సాంకేతిక ఫెస్ట్.. పూర్వ విద్యార్థుల కోటి విరాళం