ETV Bharat / state

వామ్మో దెయ్యం, అమావాస్య నాడు స్కూల్​లో నిద్రపోయిన టీచర్ - చివరకు ఏం జరిగిందంటే - Ghost Teacher in Adilabad - GHOST TEACHER IN ADILABAD

Ghost Teacher in Adilabad : తెలుగు మాస్టారు, లెక్కల మాస్టారు, సోషల్‌ మాస్టారు, అని విద్యార్థులు తమ ఉపాధ్యాయులను పిలుచుకుంటారు. మరి! దెయ్యం మాస్టారు అని పిలిస్తే? కొత్తగా ఉంది కదా! కానీ ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడు దెయ్యం మాస్టారుగా మారుమోగిపోతున్నారు. ఇంతకీ ఆయనకు ఈ బిరుదు రావడం వెనుక కథేంటో చూద్దాం.

Teacher Sleeps in Haunted Classroom
Ghost Teacher in Adilabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 6:49 AM IST

Teacher Sleeps in Haunted Classroom : ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌ మండలం ఆనంద్‌పూర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో బలంగా గాలి వీచినా విద్యార్థులకు భయమే. చెట్టుకొమ్మల చప్పుడు వినిపిస్తే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సాయంత్రమవుతుందంటే చాలు, అయిదో తరగతి గది వైపు కన్నెత్తి చూడాలంటే విద్యార్థుల వెన్నులో వణుకు. ఎందుకంటే ఆ పాఠశాలలో దయ్యం తిరుగుతోందని విద్యార్థుల భయం. అది ఐదోతరగతిలోనే నివాసం ఉంటోదని వారి అపనమ్మకం.

విద్యార్థుల్లో భయం : రవీందర్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడు జులై రెండున అక్కడికి బదిలీపై వెళ్లారు. అదేరోజు ఏడో తరగతిలో పాఠం బోధిస్తుండగా, ఓ శబ్ధం వినిపించటంతో వెనక బెంచీల్లో కూర్చున్న విద్యార్థలంతా ఒక్క పరుగున ముందుకు పరుగెత్తుకొచ్చారు. దీంతో ఉపాధ్యాయుడు ఎవమయిందని ఆరాతీస్తే, అయిదో తరగతి గదిలో దెయ్యం ఉందని విద్యార్థులు భయం భయంగా చెప్పారు. ఉపాధ్యాయుడు దయ్యాల్లేవని ఎంత చెప్పిన విద్యార్థులు నమ్మలేదు.

నిద్రపోయిన ఉపాధ్యాయుడు : మరి ఏంచేస్తే నమ్ముతారంటే, అమావాస్య రోజున ఒక్కరే నిద్రపోతే నమ్ముతామని విద్యార్థులు చెప్పారు. దీంతో జులై అయిదో తేదీన అమావాస్య రోజున రవీందర్‌రెడ్డి ఒక్కరే నిద్రపోయి విద్యార్థుల్లో ఉన్న అపనమ్మకాన్ని పటాపంచలు చేశారు. అమావాస్య రోజున రవీందర్‌రెడ్డి ఒక్కరే పాఠశాలలో నిదురపోవటం, తెల్లారాక ఆయనకు ఏమీ కాకపోవడంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం వచ్చింది.

ఆత్మస్థైర్యంలో విద్యార్థులు : అంతుకుముందు ఉపాధ్యాయులు సైతం ఎలాంటి దెయ్యాల్లేవని చెప్పినప్పటికీ, రవీందర్‌రెడ్డి ఆచరణాత్మకంగా చూపించటం ద్వారా విద్యార్థుల్లో సంపూర్ణమైన మార్పువచ్చింది. ఇప్పుడు చిన్నారులు పాఠశాలకు ధైర్యంగా వస్తున్నారు. ఉల్లాసంగా విద్యాలయ ప్రాంగణంలో తిరుగుతున్నారు. ఆనంద్‌పూర్‌ పాఠశాలలో ఇప్పుడు ఎలాంటి దెయ్యం భయంలేదు. పిల్లల్లోనూ నూతన ఉత్తేజం నిండింది.

ఓ ఉపాధ్యాయుడు చేసిన గుణాత్మకమైన బోధన విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చిందని ఇతర ఉపాధ్యాయులు ప్రశంసిస్తుంటే, తనకు దెయ్యం మాస్టర్‌ అనే బిరుదు వచ్చిందని రవీందర్‌రెడ్డి ఆనందంగా చెబుతున్నారు. రవీందర్ రెడ్డి చేసిన ప్రయోగంతో విద్యార్థుల్లో మూఢవిశ్వాసాలపై నమ్మకం పోయింది. గ్రహణం వీడిన చంద్రుని వలె వారిలోని అపనమ్మకాలు తొలగిపోయాయి. రవీందర్‌రెడ్డి చేసిన పని రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. కానీ ఆయన ఇటీవల పదోన్నతిపై ఆనంద్‌పూర్‌ బడినుంచి దీపాయిగూడకు వెళ్లటమే విద్యార్థులను కొంత ఆవేదనకు గురిచేసింది.

సమస్యలకు కేరాఫ్​ అడ్రస్​గా కరీంనగర్​ ఫార్మసీ కళాశాల - అరకొర వసతుల మధ్య విద్యార్థుల చదువులు - Karimnagar Pharma College Problems

తిమ్మాపురం స్కూల్​లో - 11 మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్స్ - Govt Schools Problems In warangal

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.