ETV Bharat / state

ప్రశ్నిస్తే కక్ష కట్టారు - ఆదిమూలపు సురేష్​పై పోటీ చేస్తా: టీచర్​ సుజాత - TEACHER CONTEST ON ADIMULAPU SURESH

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 1:31 PM IST

Updated : Apr 12, 2024, 2:49 PM IST

Teacher Contesting Against Minister Adimulapu Suresh: రాబోయే ఎన్నికల్లో మంత్రి ఆదిమూలపు సురేష్​కు వ్యతిరేకంగా కొండపి నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఓ ఉపాధ్యాయురాలు ప్రతిజ్ఞ చేసింది. తాను పని చేసే పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని, అక్రమాలపై టీచర్ల సమావేశాల్లో ప్రశ్నిస్తున్నాననే కారణంతో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని సుజాత ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోకపోగా, దళితురాలినైన తనపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారని తెలిపారు.

Teacher_Contesting_Against_Minister_Adimulapu_Suresh

Teacher Contesting on Minister Adimulapu Suresh: సమాజంలో పెద్ద మనుషుల ముసుగులో ఉన్న వారు మహిళలకు అన్యాయం చేస్తుంటే ఎక్కడికి వెళ్లాలని టంగుటూరుకు చెందిన సుజాత ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఆదిమూలపు సురేష్​పై కొండపి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె తెలిపారు.

పల్నాడులో వైసీపీ కార్యకర్తల వీరంగం.. ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే..!

Independent Candidate Contest On Adimulapu Suresh at Kondapi: బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం 2022లో ప్రకాశం జిల్లా టంగుటూరులోని జ్యోతిరావు పూలె బాలుర పాఠశాలలో గెస్ట్ టీచర్​గా విజ్జం సుజాత పని చేశారు. పాఠశాలలో వసతులు, సమస్యలపై ఉపాధ్యాయుల సమావేశాల్లో చెప్పినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని సుజాత ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోకపోగా, దళితురాలినైన తనపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారని తెలిపారు. అక్రమ కేసుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను ఆశ్రయిస్తే అధికారులు స్పందించలేదని వాపోయారు. మహిళలపై ఇలాంటివి జరగకుండా చూసేందుకు కొండపిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని సుజాత పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే కక్ష కట్టారు - ఆదిమూలపు సురేష్​పై పోటీ చేస్తా: టీచర్​ సుజాత

'ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే మహిళలపై దాడి'

ప్రశ్నిస్తుందని కక్షసాధింపు: తాను పని చేసే పాఠశాలలో మాదిగ సామాజిక వర్గం వారే పని చేయాలనే దురుద్దేశంతో ప్రిన్సిపల్, పాఠశాల భవన యజమాని తనపై కక్ష సాధింపులకు పాల్పడి వర్గపోరుతో ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. దీనిలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాత్ర ఉన్నట్లు సుజాత ఆరోపించారు. 2022లో హిందీ గెస్ట్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సమయంలో పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని, దోమల కారణంగా వ్యాధుల బారీన పడుతున్నారని, విద్యార్థులు చెడు అలవాట్లకు గురవుతున్నారని, అక్కడ జరుగుతున్న అక్రమాలపై టీచర్ల సమావేశాల్లో తాను చెప్పినందుకు ఎస్సీ మాల మహిళ ప్రశ్నిస్తున్నాననే కారణంతో పాఠశాల ప్రిన్సిపల్, భవన యజమాని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బందిని బెదిరించి తనపై తప్పుడు రిపోర్టు గురుకుల విద్యా సంస్థల కార్యదర్శికి రాశారని సుజాత తెలిపారు. వారు రాసిన రిపోర్టు, తనపై పెట్టిన అక్రమ కేసు వివరాలు వేరుగా ఉండటం కార్యదర్శికి చూపించడంతో విచారణకు ఆదేశించారన్నారు. అక్రమ కేసుపై ఎస్సీ, ఎస్టీ కమిషనర్​ను కలిసి పరిస్థితిని తెలపడంతో ఆయన విచారించి తనను విధుల్లోకి తీసుకోవాలని కార్యదర్శికి లేఖ రాశారని సుజాత తెలిపారు. అయినా దీనిపై అధికారులు ఇప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ ప్రచారానికి వెళ్లారని వైసీపీ కక్ష - జనసైనికుడి గుడిసె కూల్చివేత - YSRCP Destructed Janasainik House

Last Updated : Apr 12, 2024, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.