Teacher Beats Students in Khammam District : విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వారి పట్ల మూర్ఖంగా ప్రవర్తించాడు. కేవలం పరీక్షలో తక్కువగా మార్కులు వచ్చాయంటూ వారిని చితకబాదాడు. ప్లీజ్ సార్ వద్దు సార్ మమ్మల్ని వదిలేయండని ఆ పిల్లలు ఎంత బతిమాలినా వినిపించుకోకుండా డస్టర్‌తో విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో వారి వీపులు ఎర్రగా కమిలిపోయి వాతలు ఏర్పడ్డాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Gurukulam Teacher Crushed Students : మార్కులు తక్కువగా వచ్చాయంటూ పదో తరగతి విద్యార్థులను తెలుగు ఉపాధ్యాయుడు వీపుపై వాతలు తేలేలా కొట్టిన ఘటన కలకలం రేపింది. తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 62 మంది పదో తరగతి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌రావు ఇటీవల గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటూ దాదాపు 25 మంది విద్యార్థులను మంగళవారం రాత్రి బ్లాక్‌బోర్డు తుడిచే డస్టర్‌తో లక్ష్మణ్‌రావు విచక్షణారహితంగా కొట్టాడు (Teacher Beats Students). దీంతో వారి వీపులు ఎర్రగా కమిలిపోయి వాతలు వచ్చాయి. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. సమీపంలో ఉన్న చంద్రుతండాకు చెందిన పిల్లల తల్లిదండ్రులు చేరుకుని ఉపాధ్యాయుణ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న ఎస్సై గిరిధర్‌రెడ్డి బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు.
Drunken Teacher Beat Students: మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ : తమను టార్గెట్ చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌రావు ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. మార్కులు తక్కువ వచ్చాయనే సాకుతో తీవ్రంగా కొట్టారని వాపోయారు. 100 మార్కులకు గానూ 51 నుంచి 71 మధ్య వచ్చినా కానీ చితకబాదారని అవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన విషయాలను దృష్టిలో ఉంచుకొని, తమపై ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా తెలుగు ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు అధికారులను కోరారు.
Teacher Beats Students Brutally in Khammam : దీనిపై పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సరైన విద్యాబుద్ధులు నేర్పి, పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఇలా వారే తప్పు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వారి కోపం పిల్లలపై చూపడం సరికాదని వాపోయారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.
మదర్సా విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు... అన్నం పెట్టకుండా..
Teacher Beats Students Karimnagar : 'మీరు పుట్టి వేస్ట్ రా' అంటూ.. విద్యార్థులను చితకబాదిన టీచర్