TDP Leaders Released Book on Macherla MLA Pinnelli Anarchy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర నేరమయం అని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోదరుడితో కలిసి హత్యలు, దోపిడీలు చేస్తూ మాచర్లను ఎస్టేట్‌గా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో 'పిన్నెల్లి పైశాచికం' పేరుతో పుస్తకం విడుదల చేశారు. మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మారణహోమం సృష్టించిందని నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాల్లేకుండా పోయిందన్న నేతలు వైఎస్సార్సీపీ హయాంలో ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉందని మండిపడ్డారు.
అన్నింట్లో దోపిడీయే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. ఎక్కడ ఏ చిన్న పని జరిగినా వాటా కావాల్సిందేనని దుయ్యబట్టారు. పాస్ పుస్తకాలు అప్లయ్ చేసిన వారి వివరాలు వెంటనే పిన్నెల్లికి వెళ్లిపోతాయని విమర్శించారు. ఆఖరికి పాస్ పుస్తకాల్లో కూడా 15 వేలు దోచుకునే పరిస్థితి ఉందని ఆరోపించారు. పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం రాబట్టే పిన్నెల్లి పారిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ప్రజల్లో పిన్నెల్లిపై తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పారిపోయారని అన్నారు. వైఎస్సార్సీపీ రౌడీ మూకలు మారణాయుధాలతో దాడులు చేశారని దుయ్యబట్టారు. పిన్నెల్లి సోదరులు మాచర్లలో మారణహోమం సృష్టించారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్‍ను నామరూపాలు లేకుండా చేశారని గుర్తుచేశారు. జగన్ వచ్చిన తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ దాడులు మొదలుపెట్టారని మండిపడ్డారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు తెలిపారు.
బత్తాయి వ్యాపారుల బడా మోసం- ధర ఉన్నా నాణ్యత సాకుతో కోతలు - Mosambi Farmers Low Price
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మారణహోమం సృష్టించింది. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాల్లేకుండా పోయింది కాని వైఎస్సార్సీపీ హయాంలో ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. వైసీపీ నేతలు అన్నింట్లో దోపిడీయే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడ ఏ చిన్న పని జరిగినా వాటా కావాల్సిందే. పాస్‌పుస్తకాలు అప్లయ్ చేసిన వారి వివరాలు వెంటనే పిన్నెల్లికి వెళ్లిపోతాయి. ఆఖరికి పాస్‌పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే పరిస్థితి వచ్చింది. పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ప్రజల్లో చైతన్యం రాబట్టే పిన్నెల్లి పారిపోయే పరిస్థితి వచ్చింది.- టీడీపీ నేతలు