ETV Bharat / state

ప్రతీ ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనా ?: నారా లోకేశ్

Nara Lokesh on Geetanjali Death: ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనా అంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 2019లో బాబాయ్‌ని బలితీసుకున్న వైఎస్సార్సీపీ ఇప్పుడు గీతాంజలిని ఎందుకు బలి తీసుకుందో నంటూ పోస్టు పెట్టారు. వైఎస్సార్సీపీ బలి జాబితాలో ఇంకెందరు ఉన్నారో అంటూ ట్వీట్‌ చేశారు. వైఎస్సార్సీపీ ఓ మ‌హిళ శవంతో వికృత రాజ‌కీయాలు ఆరంభించిందని లోకేశ్ విమర్శలు గుప్పించారు.

Nara Lokesh on Geetanjali Death
Nara Lokesh on Geetanjali Death
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 10:54 PM IST

Nara Lokesh on Geetanjali Death: గీతాంజలి మృతి ఘటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. ప్రతీ ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసారు. 2019లో బాబాయ్ ని బలి తీసుకున్న వైసీపీ, ఇప్పుడు గీతాంజలిని ఎందుకు బలి తీసుకుందో అంటూ ప్రశ్నించారు. బలి జాబితాలో ఇంకెందరు ఉన్నారో అంటూ నిలదీశారు.

శవంతో వికృత రాజ‌కీయాలు: సైకో జ‌గ‌న్ పార్టీ, తండ్రి శవం ద‌గ్గ‌ర పుట్టిందని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. బాబాయ్ శ‌వంతో ఓట్లు దండుకుందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయ‌మైన ప్ర‌స్తుత ద‌శ‌లో ఓ మ‌హిళ మృతదేహంతో వికృత రాజ‌కీయాలు ఆరంభించిందని మండిపడ్డారు. గీతాంజ‌లి అనే ఆమెతో బ‌ల‌వంతంగా వీడియో రూపంలో అబ‌ద్ధాలు చెప్పించారన్నారు. ఆమె 7వ తేదీన ప్ర‌మాదానికి గురి అయిందో, ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకుందో తెలియ‌దు గానీ, తీవ్రంగా గాయ‌ప‌డితే మెరుగైన చికిత్స కూడా అందించే ప్ర‌య‌త్నం వైఎస్సార్సీపీ సైకోలు చేయ‌లేదని లోకేశ్ (Lokesh) ధ్వజమెత్తారు.

10వ తేదీన ప్ర‌శ్నించారు: గీతాంజలి 4 రోజులు మృత్యువుతో పోరాడితే వైఎస్సార్సీపీ సైకోలు అటువైపు కూడా చూడ‌లేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చ‌నిపోతే మాత్రం ఆ మృత‌దేహంతో క‌న్నింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. గీతాంజ‌లితో వైఎస్సార్సీపీలోని పిల్ల స‌జ్జ‌ల గ్యాంగ్ చెప్పించిన అబ‌ద్ధాల‌ను ఖండిస్తూ, టీడీపీ అభిమానులు ఆధారాల‌తో 10వ తేదీన ప్ర‌శ్నించారు. 7వ తేదీన గీతాంజ‌లి గాయ‌ప‌డిందన్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే బాబాయ్ గొడ్డ‌లిపోటుని గుండెపోటుగా ప్ర‌చారం చేసిన గ్యాంగ్ ఈ మ‌ర‌ణాన్నీ త‌మ వికృత‌ రాజ‌కీయాల‌కు వాడుకుంటున్న‌ట్టు చాలా స్ప‌ష్టంగా అర్థ‌మవుతోందని లోకేశ్ ఆరోపించారు.

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ - షరతులు వర్తింపు

4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదు: గీతాంజలి మృతిపై వైఎస్సార్సీపీ అసత్య ప్రచారం దుర్మార్గమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (Tangirala Soumya) మండిపడ్డారు. సజ్జా అజయ్ ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిదన్న అసత్యప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎప్​ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మళ్లీ ఆత్మహత్యగా ఎందుకు ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ప్రశ్నించారు. గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడింది ఈనెల 7వ తేదీ అయితే అజయ్ వీడియో మాట్లాడింది 10వ తేదీ అని తంగిరాల సౌమ్య తెలిపారు. గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే 4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. శవ రాజకీయాలు చేస్తున్న వైఎస్సార్సీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సౌమ్య స్పష్టం చేశారు.

'శవ రాజకీయాలు వైఎస్సార్సీపీకి వెన్నతో పెట్టిన విద్య - సొంత చెల్లి, తల్లికే రక్షణ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.