PD Act On Social Media Misusers : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో హేయమైన దాడికి పాల్పడుతున్న సైకోలపై ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్(పీడీ) యాక్ట్ ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. ఉచ్ఛనీచాలు మరచి, జుగుప్సాకర పదజాలంతో పేట్రేగుతున్న ఉన్మాద మూక ఇకపై సంవత్సరం దాకా జైల్లో మగ్గాల్సిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం- 1986 (ప్రమాదకర కార్యకలాపాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లు ఇటీవల శాసనసభలో ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఈ సవరణ చట్టం అమల్లోకి రానుంది.
విచారణకు హాజరు కాని సజ్జల భార్గవ్ రెడ్డి - వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసుల దర్యాప్తు వేగం
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో ఎంతలా రెచ్చిపోయినా పోలీసులు ఏమీ చేయలేరనే భావనతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వారికి ఈ చట్టంతో అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారందరినీ పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు పెట్టి, దర్యాప్తు చేస్తున్నారు. మానవ మృగాల్లా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్, వర్రా రవీంద్రారెడ్డి వంటి అనేక మంది వివరాలతో జాబితాను సిద్ధం చేశారు. వీరిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
సొంత పార్టీ వారే కేసులు పెట్టి వేధించారు - వైఎస్సార్సీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా
AP Govt Focus on Obscene Posts : ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం- 1986 ప్రకారం. అక్రమ మద్యం, నాటుసారా తయారీ, సరఫరా, రవాణా, ఎగుమతి, దిగుమతి చేసేవారు, బందిపోటు దొంగతనాలకు పాల్పడే ముఠాలు, మత్తు పదార్థాల తయారీ, సరఫరా, విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, భూకబ్జాదారులను నిర్బంధించేందుకు అవకాశముంది. తాజాగా తీసుకొచ్చిన సవరణ బిల్లులో మరో 8 రకాల నేరాలకు పాల్పడేవారిపైనా పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు వీలు కల్పించారు.
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో దాడి చేసేవారిని, సైబర్ నేరగాళ్లనూ అందులో చేర్చారు. ఎవరైనా సరే మళ్లీ నేరాలకు పాల్పడే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని భావిస్తే పీడీ యాక్ట్ కింద వారిని నిర్బంధించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు కానీ నగర పోలీసు కమిషనర్లు కానీ లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వొచ్చు. ఎవరిపైనైనా సరే ఈ చట్టాన్ని ప్రయోగిస్తే వారు కనీసం సంవత్సరం జైల్లో ఉండాల్సిందే. బెయిలుకూ అవకాశం ఉండదు.
"సీఐడీ కస్టడీ మిస్టరీ" - ఈ కేసులో పెద్ద చేపలు త్వరలో తెరపైకి : RRR
వ్యవస్థీకృతంగా అసభ్య దాడి : జగన్‌ను, వైఎస్సార్సీపీని ప్రశ్నించేవారు, విమర్శించేవారిపైనే కాకుండా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత సహా కూటమిలోని ముఖ్య నాయకులు, వారి కుటుంబాల్లోని మహిళలు, చిన్న పిల్లలు లక్ష్యంగా వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమాల్లో అసభ్య, బూతుల దాడిని వ్యవస్థీకృతంగా కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది.
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం వేదికగా వైఎస్సార్సీపీ ఈ దాడిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని మూలాలు బెంగళూరు, హైదరాబాద్ నుంచి విదేశాల వరకూ వేళ్లూనుకుని ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ భాగస్వాములైన దాదాపు 50,000ల మంది వివరాలు సేకరించారు. నేరపూరిత కుట్రతో ఈ అసభ్య దాడి చేస్తున్నట్లు నిర్ధారణకొచ్చారు. సూత్రధారులు, తీవ్రమైన బూతులతో పోస్టులు పెట్టేవారిపై పీడీ చట్టం ప్రయోగించే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు - కేసులు నమోదు
అసభ్యకర పోస్టులు పెట్టేవారు ప్రపంచంలో ఎక్కడున్నా తప్పించుకోలేరు : సీపీ