ETV Bharat / state

పండుగలా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు- పాల్గొన్న భువనేశ్వరి, బాలకృష్ణ, బ్రాహ్మణి - CHANDRABABU BIRTHDAY CELEBRATIONS - CHANDRABABU BIRTHDAY CELEBRATIONS

CHANDRABABU BIRTHDAY CELEBRATIONS: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుటినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పాఠశాల విద్యార్థులతో కలిసి చంద్రబాబు తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేశారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ శ్రేణులు, అభిమానుల మధ్య ఘనంగా చంద్రబాబు జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. మంగళగిరిలో నారా బ్రాహ్మణి మహిళలలో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

CHANDRABABU_BIRTHDAY_CELEBRATIONS
CHANDRABABU_BIRTHDAY_CELEBRATIONS
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 2:19 PM IST

CHANDRABABU BIRTHDAY CELEBRATIONS: టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎక్కడికక్కడ కేక్​లు కట్ చేసి తన అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలలో పాల్గొంటున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. అనంతపురం జిల్లా కణేకల్‌ క్రాస్​లోని శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో టీడీపీ అధినేతనారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు వెళ్లి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థ సారథి, సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి తదితరులు తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేద పండితులు చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కణేకల్ క్రాస్ నుంచి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లా గూడూరుకు చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు.

16 వేల 676 అడుగుల ఎత్తులో - చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు - Chandrababu Birthday Wishes

Nara Bhuvaneswari in Chandrababu Birthday Celebrations: చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో 74 కిలోల కేకును కత్తిరించి సంతోషాన్ని పంచుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. చంద్రబాబు జన్మదిన వేడుకలతో పాటు ముస్లిం మహిళలతో సమావేశం అయ్యారు.

Balakrishna CBN Birthday Celebrations: చంద్రబాబునాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తన నివాస గృహం వద్ద టీడీపీ శ్రేణులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ నాయకులకు కేక్ తినిపించారు.

"అభివృధ్ధి, సంక్షేమ విజనరీ మన చంద్రన్న" - టి.డి.జనార్దన్‌ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు - Chandrababu Book Launch

Nara Brahmani CBN Birthday: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నారా దేవాన్ష్ కంటే చంద్రబాబు యువకుడని బ్రాహ్మణి చెప్పారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మహిళాభ్యుదయం కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కృషి చేస్తారని బ్రాహ్మణి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని సంధ్య స్పైసెస్ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం అయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజువారి కూలీ, ఇతర నిత్యావసర ధరలు, కుటుంబ విషయాల గురించి మహిళలను అడిగారు. ఆదాయం పెంపునకు ఎలాంటి మార్గాలు చేపడితే బాగుంటుందని మహిళలని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో తమకు రోజూ పని దొరికేదని ఇప్పుడు చాలా కష్టమైపోయిందని మహిళలు చెప్పారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయి రాజధాని పనులను వేగవంతం చేస్తే తమకు ఉపాధి లభిస్తుందని వారంతా అన్నారు.

చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన భువనేశ్వరి - పసుపు మయంగా మారిన కుప్పం - Chandrababu Nomination

HBDBabu Hashtag Trending: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ఎక్స్​లో 1వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అదే విధంగా #HBDCBN , #CBNBIRTHDAYCDP కూడా ట్రెండ్ అవుతున్నాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పోస్టుల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.