ETV Bharat / state

రామోజీరావు పాడె మోసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు - CHANDRABABU ATTENDS RAMOJI RAO FUNERAL - CHANDRABABU ATTENDS RAMOJI RAO FUNERAL

Chandrababu Tribute to Ramoji : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద రామోజీరావు పాడె మోసి నివాళులర్పించారు. అనంతరం ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

Chandrababu Tribute to Ramoji
Chandrababu Tribute to Ramoji (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 2:26 PM IST

Chandrababu Attends Ramoji Rao Funeral : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై రామోజీ రావు పాడె మోసి నివాళులర్పించారు. రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొన్న అనంతరం ఆయన దిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనవుతూ చంద్రబాబు ట్వీట్​ చేశారు. హృదయం బాధతో నిండిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు.

"తెలుగు వెలుగు, అక్షర యోధుని అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు పలికాను. హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుంది." - చంద్రబాబు ట్వీట్

రామోజీరావు జీవితమొక తెరిచిన పుస్తకం - ప్రతి పేజీ ఒక మధురానుభూతి - Ramoji Rao Biography in Telugu

Ramoji Rao Final Rites : శనివారం రామోజీ ఫిల్మ్​సిటీలోని రామోజీరావు పార్థివదేహానికి సతీసమేతంగా వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాసేపు అక్కడే వారితో గడిపి, రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం తెలుగుజాతికి తీవ్ర నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.

రామోజీరావు అంత్యక్రియలు పూర్తి : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగింది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీ గ్రూపు కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు అంతిమయాత్ర సాగింది. అంతిమ యాత్రలో రామోజీరావు కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్​ కిరణ్​, కోడళ్లు శైలజా కిరణ్​, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్​, కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

'నా పట్ల మీరు చూపిన అవ్యాజ అభిమానమే నా ఆశకు శ్వాస - ఇక సెలవు' - తెలుగువారికి రామోజీ చివరి లేఖ - RAMOJI RAO LETTER TO TELUGU PEOPLE

మరణానికి ముందే స్మారక కట్టడాన్ని సిద్ధం చేయించిన రామోజీ - నేడు అక్కడే అంత్యక్రియలు - RAMOJI RAO SMRUTHI VANAM IN RAMOJI FILM CITY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.