ETV Bharat / state

టానిక్‌ మద్యం దుకాణం ఏర్పాటు జీవోలో మతలబుపై ప్రభుత్వం ఫోకస్! - Tonique LIQUOR STORES CASE - TONIQUE LIQUOR STORES CASE

Tax Evasion in Foreign Liquor Sales Scam Updates : టానిక్‌ మద్యం దుకాణం, దాని అనుబంధ క్యూ దుకాణాలు పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సర్కార్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎలైట్‌ షాప్‌ పేరిట వెసులుబాటుతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడిన ఆరోపణలపై కూపీ లాగుతోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో మతలుబుపై దర్యాప్తు చేపడుతోంది.

Tax Evasion Tonique Liquor Stores
Tax Evasion Tonique Liquor Stores
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 1:01 PM IST

Tax Evasion in Foreign Liquor Sales Scam Updates : హైదరాబాద్‌లోని టానిక్‌ మద్యం దుకాణం, దాని అనుబంధ క్యూ దుకాణాలు జీఎస్టీ, వ్యాట్‌, ప్రివిలేజ్‌ ఫీజుల్లో ఎగవేతలకు పాల్పడినట్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు ఆయా దుకాణాల్లో సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిని నిశితంగా పరిశీలించి త్వరలోనే తెలంగాణ సర్కార్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tax Evasion Tonique Liquor Stores : టానిక్‌ మద్యం దుకాణం ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చిన కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే ఆరోపణలపై రెండు శాఖలూ కూపీ లాగుతున్నాయి. అసలు ఆ జీవో ఇవ్వడంలోనే దురుద్దేశం ఉన్నట్లు తెలంగాణ సర్కార్ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరెవరికీ ఈ అవకాశం ఇవ్వకుండా కేవలం ఆ ఒక్క దుకాణానికి మాత్రమే ఎలైట్‌ షాప్‌ కోసం అనుమతి ఇచ్చారు. ఇందులోని మతలబుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.

మూడేళ్లపాటు ప్రివిలేజ్‌ ఫీజులో వెసులుబాటు : 2016లో ఎలైట్‌ రూల్స్‌ పేరుతో ఇచ్చిన జీవో ద్వారా ఏర్పాటైన టానిక్‌ మద్యం (Tonique Liquor Shops Case) దుకాణానికి మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ప్రివిలేజ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించారు. తెలంగాణలోని 2,620 మద్యం దుకాణాల్లో మరేదానికీ ఇలాంటి సదుపాయం లేదు. మిగిలిన దుకాణాలన్నీ రెండేళ్లకోసారి కొత్త లైసెన్స్‌ కోసం లాటరీలో పాల్గొనాల్సి ఉంటుంది. టానిక్‌కు మాత్రం ఎలాంటి టెండర్‌ అవసరం లేకుండా ఏకంగా ఐదేళ్లపాటు లైసెన్స్‌ కట్టబెట్టారు.

ఇందుకు పెద్దఎత్తున లైసెన్స్‌ ఫీజు వసూలు చేశారా అంటే అదీ లేదు. కేవలం రూ.15 లక్షలు అదనంగా చెల్లించినందుకు ఈ వెసులుబాట్లు కల్పించడం వెనక నాటి కీలక నాయకుల ప్రమేయముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, సాధారణ దుకాణాలు ఏడాదిలో తమ లైసెన్స్‌ ఫీజు మొత్తానికి ఏడు రెట్ల విలువైన మద్యం విక్రయిస్తే, తదుపరి చేపట్టే విక్రయాలపై ప్రభుత్వానికి 13.7 శాతం వరకు ప్రివిలేజ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టానిక్‌కు మూడు సంవత్సరాల పాటు ప్రివిలేజ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చిన తర్వాత కూడా లైసెన్స్‌ ఫీజుకు పది రెట్ల వరకు విక్రయించిన తర్వాతే ప్రివిలేజ్‌ ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించారు.

Tonique Liquor Scam Case updates : మరోవైపు ప్రతి రెండేళ్లకోసారి వేలం నిర్వహిస్తే టానిక్‌ లాంటి ఎలైట్‌ షాప్‌ కోసం 200 వరకు దరఖాస్తులు వచ్చేవని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అర్జీల రూపంలోనే రెండేళ్లకోసారి రూ.4 కోట్ల వరకు నాన్‌-రిఫండబుల్‌ రుసుం దక్కకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో టానిక్‌ నిర్వాహకులకు (Tonique Liquor Scam Case ) కల్పించిన వెసులుబాట్లతో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు సర్కార్ అనుమానిస్తోంది. రెండు శాఖల నుంచి సమగ్ర నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

2023లో కిక్కే కిక్కు - రూ.36వేల కోట్ల విలువైన మందు తాగేశారు

రాష్ట్రంలో వ్యాట్‌ చెల్లింపులపై ప్రచ్ఛన్న యుద్ధం - వాణిజ్య, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న వైరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.