ETV Bharat / state

ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్​బండ్​ అందాలు - భారీ ఎల్​ఈడీ తెరలతో సిద్ధం - Telangana Formation Day 2024 - TELANGANA FORMATION DAY 2024

Tank Bund Arrangements for Telangana Formation Day 2024 : రాష్ట్రంలో ఆదివారం దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. కళాకారుల కోసం ప్రత్యేకంగా స్టేజ్​ను సిద్దం చేశారు. సాంస్కృతిక సంబరాలను వీక్షించేందుకు ఎల్​ఈడీ తెరలను పెట్టారు.

Telangana Formation Day Celebrations 2024
Tank Bund Arrangements (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 5:11 PM IST

Tank Bund Decoration for Telangana Formation Day 2024 : రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ప్రభుత్వ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సంబరాలకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో రాష్ట్ర అధికార గీతాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఆవిర్భావ వేడుకల వేదికగా రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

Telangana Decade Celebrations : దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ట్యాంక్​ బండ్​ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. వేడుకలు జరిగే ముఖ్య ప్రదేశాల్లో ట్యాంక్​బండ్​ ​ఒకటి. అందువల్ల దీనిని అధికారులు మూడు భాగాలుగా విభజించి ఏర్పాట్లు చేశారు. మధ్య భాగంలో సీఎం సహా వీవీఐపీలు కూర్చోడానికి వీలుగా స్టేజ్​ను సిద్ధం చేశారు. మిగతా రెండు వైపుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో దాదాపు వంద మంది కూర్చోడానికి వీలుగా ఉండేలా తీర్చిదిద్దారు. ప్రధాన స్టేజ్​కి ఎదురుగా కళాకారుల కోసం ప్రత్యేకంగా మరో భారీ స్టేజ్​ సిద్ధం చేశారు.

దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి - సర్వాంగ సుందరంగా ముస్తాబైన పరేడ్ గ్రౌండ్

ఆకర్షవంతంగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు : దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సాంస్కృతిక సంబరాలను వీక్షించేందుకు వీలైనన్ని ఎల్​ఈడీ తెరలను అధికారులు ట్యాంక్​బండ ప్రాంతానికి ఇరువైపుల ఏర్పాటు చేశారు. సచివాలయం, సెయిలింగ్​ క్లబ్​ వైపు నుంచి ట్యాంక్​ బండ్​పైకి చేరుకునే రెండు మార్గాలను రెండు భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో హస్తకళలు, షాపింగ్​, ఫుడ్​ కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా అమ్యూజ్​మెంట్​ జోన్​, ఫొటో జోన్లను రూపొందించారు. ప్రధాన స్టేజ్​ వెనుకవైపు వీవీఐపీ లాంజ్​లను పెట్టారు.

Lighting Arrangements Around Tank Bund : టాంక్​బండ్​ పరిసర ప్రాంతాలు, పీవీ మార్గ్​, ఎన్టీఆర్​ మార్గ్​, సెక్రటేరియట్​ను రంగు రంగుల విద్యుత్​ కాంతులతో ఆకర్షవంతంగా తీర్చిదిద్దారు. రాత్రి సమయాల్లో వీటిని చూసినప్పుడు ఆనందంగా ఉంటుందని, ప్రదేశమంతా కాంతులతో వెదజల్లుతుందని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమాలను చూసేందుకు వచ్చిన జనాభాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు సమకూర్చామని తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైన తెలంగాణ - రేపే దశాబ్ది ఉత్సవాలు - TS Decade Celebrations Arrangements

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.