ETV Bharat / state

ఆ మండలాల్లో వడగాడ్పు- ప్రజలు బయటకు రావొద్దు: ఐఎండీ హెచ్చరిక - high temperature - HIGH TEMPERATURE

Summer Heat Waves in Andhra Pradesh: ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకి పెరిగిపోతుంది. ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో అత్యధికంగా 47.1 డిగ్రీలు నమోదైంది. నేడు 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Summer Heat Waves in Andhra Pradesh
Summer Heat Waves in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 1:04 PM IST

Summer Heat Waves in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. నేడు 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే విధంగా 156 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 261 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు ఇంట్లో ఉండాలని ఐఎండీ (India Meteorological Department) సూచించింది. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో అత్యధికంగా 47.1 డిగ్రీలు నమోదు అయ్యాయి.

మార్కాపురంలో 47, బనగానపల్లెలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా అక్కమాంబపురంలో 46.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా తవణంపల్లె, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 46.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, కర్నూలు జిల్లా గూడూరులో 45.3 డిగ్రీలు, పల్నాడు జిల్లా విజయపురిలో 45.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా తిరుపతి జిల్లా చియ్యవరంలో 44.8, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 44.6 డిగ్రీలు నమోదైనట్లు తెలిపింది. ఇక 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 188 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

బాబోయ్​ ఎండలు! నీరు తగినంత తాగుతున్నారా? డీహైడ్రేషన్​ను గుర్తించడమెలా? - Symptoms Of Dehydration

ఏపీలో గురువారం ఉష్ణోగ్రతలు: ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో గురువారం అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురంలో 47 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబాపురంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

చిత్తూరు జిల్లా తవణంపల్లె, కడప జిల్లా జమ్మల మడుగులో 46.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, కర్నూలు జిల్లా గూడూరు, పల్నాడు జిల్లా విజయపురిలో 45.3 డిగ్రీలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 43 డిగ్రీల కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 188 మండలాల్లో వడగాల్పులు వీచాయని ప్రకటించింది.

Precautions From Summer: తీవ్ర వడగాల్పుల దృష్ట్యా ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సెల్​ఫోన్లకు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అయితే మండుతున్న ఎండలకు తోడు రాష్ట్రంలో పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలగటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు.

భారత్​లో భిన్న వాతావరణ పరిస్థితులు - ఓచోట కరవు మరోచోట వరదలు - ఎందుకిలా? - Prof Raghu Murtugudde on Climate

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.