Rohit Vemula Death Controversy : రోహిత్ వేములను దళితుడని అవమానించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లేవని గచ్చిబౌలి పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, పిటీషన్‌పై విచారణను ముగించేసింది. గచ్చిబౌలీ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని హెచ్‌సీయూ మాజీ వీసీ అప్పారావు 2016లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు పోలీసులతో పాటు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసింది.
సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు నిందితుడు ఆత్మహత్య- లాకప్‌లోనే సూసైడ్ - Salman Khan shooting case
గచ్చిబౌలీ పోలీసులు ఈ నెల 2వ తేదీన హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రోహిత్ వేములను దళితుడని వేధించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రశాంత్ అనే పీహెచ్‌డీ విద్యార్థి ఫిర్యాదు చేశాడని తెలిపారు. వీసీ అప్పారావు, భాజపా నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్.రాంచంద్రారావు, స్మృతి ఇరానీల పేర్లు ఫిర్యాదులో పేర్కొన్నాడని, దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని గచ్చిబౌలీ పోలీసులు నివేదికలో పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగా రోహిత్ వేముల ఆత్మహత్యకు వేదింపులే కారణమనడానికి ఆధారాలు లభించలేదని గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, అప్పారావు పిటిషన్‌పై విచారణ ముగించింది. పోలీసుల నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత కోర్టుకు వెళ్లాలని ప్రతివాదియైన ప్రశాంత్ తరఫు న్యాయవాదికి సూచించింది. రోహిత్ వేములకు న్యాయం చేయాలంటూ హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వర్సిటీకి విద్యార్థులు భారీగా చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా మోహరించారు.
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో రోహిత్ వేముల మృతి కేసును పునర్విచారణ చేయాలని డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. కేసుపై రోహిత్ తల్లి అనుమానం వ్యక్తం చేయడం, విద్యార్థుల నిరసనలు చేపట్టడంతో ఈనిర్ణయం తీసుకున్నారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
అసలేం జరిగిందంటే.. 2016 జనవరి 17న హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అప్పట్లో విద్యార్థులకు మద్దతు తెలిపింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై స్పందించారు. రోహిత్ వేముల జాతి వివక్ష, అవమానాలతో హత్యకు గురయ్యాడు. ఇన్నేళ్లు గడిచినా ప్రతిఘటనకు రోహిత్, నమ్మకానికి ఆయన తల్లి చిహ్నాలుగా నిలుస్తున్నారు. ప్రాణం పోయే వరకు పోరాడిన రోహితే నా హీరో.. నా సోదరుడు’’అని గతంలో చేసిన ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు.
పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట - Lovers Committed Suicide
'నాకింకా చదువుకోవాలనుందమ్మా కానీ ఇప్పుడు కుదరదు - అందుకే చనిపోతున్నా' - BRIDE SUICIDE IN KOTHAGUDEM