ETV Bharat / state

కొండపోచమ్మ భూ నిర్వాసిత గ్రామాల్లో నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు - undefined

Students Facing Problems in Kondapochamma Sagar Villages : కొండపోచమ్మ జలాశయం భూనిర్వాసిత గ్రామాల ప్రజలతో పాటు విద్యార్థులకూ ఇబ్బందులు తప్పడం లేదు. జలాశయం నిర్మించాక అధికారులు పాఠశాలలు నిర్మించడంలో ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా నాలుగు గ్రామాల విద్యార్థులు అరకొర వసతుల మధ్య నిత్యం నానా అవస్థలు పడుతున్నారు.

Students Facing Problems for School in Mulugu Mandal
Students Facing Problems in Kondapochamma Sagar Villages
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 10:29 AM IST

కొండపోచమ్మ భూనిర్వాసిత గ్రామాలలో నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు

Students Facing Problems in Kondapochamma Sagar Villages : కోటి ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో గత ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని నిర్మించింది. దీంతో ములుగు మండలంలోని నాలుగు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాలను 2013లో ఆర్ అండ్ ఆర్‌ కాలనీ(R&R Colony) ఏర్పాటు చేసి పునరావాసం కల్పించారు. అన్ని శాఖల వ్యవహారాలన్నీ పాత గ్రామాల పేరుతోనే సాగుతున్నాయి. విద్యా వ్యవస్థను మాత్రం తున్కిబొల్లారంలో(Thunki Bolarum) విలీనం చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులివ్వడంతో అప్పట్లో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. దీంతో పునరావాస కేంద్రంలోనే పాఠశాలలు నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

మామిడ్యాలలో నిర్మించిన భవనంలోనే నాలుగు గ్రామాలకు చెందిన బడులు నడుపుతున్నారు. అదనంగా భవనాలు మాత్రం నిర్మించలేదు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నూతన భవనాలు నిర్మించకపోవడంతో నాలుగు గ్రామాలకు చెందిన 242 మంది విద్యార్థులకు ఒకే భవనంలో పాఠాలు బోధిస్తున్నారు. తరగతి గదులు చాలకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యుల సహకారంతో వరండాలో దుప్పట్లు అడ్డంగా కట్టి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మరికొందరు పిల్లలను చెట్ల కింద కూర్చోబెడుతున్నారు.

'కొండపోచమ్మ జలాశయం వల్ల సర్వం నష్టపోయాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హై స్కూల్​, ప్రైమరీ స్కూల్​ వేర్వేరుగా నిర్మించాలని కోరుతున్నాం. తరగతి గదులు లేక చాలా ఇబ్బందిపడుతున్నాం'. - యాదగిరి, విద్యాకమిటీ ఛైర్మన్

Students Facing Problems for School in Mulugu Mandal : బోధన గదిలోనే బీరువాలను అడ్డంగా పెట్టి ఉపాధ్యాయులు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. వరండాలో, ఆరుబయట పాఠాలు చెబుతుండటంతో అర్ధం కావడం లేదని విద్యార్థులు అవేదన చెందుతున్నారు. శౌచాలయాలు లేకపోవడంతో విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. బడి చుట్టూ ప్రహరీ లేదు. పాఠశాల కోసం నిర్మిస్తున్న భవనానికి నిధులు లేక పనులు ఆగిపోయాయి.

ఉన్నతాధికారులు సమస్యలు పరిష్కరించాలని నాలుగు ముంపు గ్రామాల విద్యార్ధులు , ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పాలకులు వెంటనే అదనపు తరగతి గదులను నిర్మించి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను వేరు వేరుగా ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యార్ధులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

'ఇక్కడ సరిపడా తరగతి గదులు లేనందున ఆరు, ఏడో తరగతి విద్యార్థులు బయట కూర్చుంటున్నారు. మాకు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. కొత్త స్కూల్​ భవనం నిర్మించాలని కోరుతున్నాం'. - విద్యార్థులు

గురువు ప్రోత్సాహం, విద్యార్థులు అద్భుతం - ఆవిష్కరణల్లో సత్తా చాటుతున్న విద్యార్థులు

భారతీయ విద్యార్థులపై దాడులు- తొలిసారి స్పందించిన వైట్ హౌస్​- ఏం చెప్పిందంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.