ETV Bharat / state

అనకాపల్లి జిల్లాలో విషాదం - సమోసాలు తిని ముగ్గురు విద్యార్థులు మృతి - ANAKAPALLE FOOD POISON DEATHS

Anakapalle Food Poison Incident : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ అనాథాశ్రమంలో సమోసాలు తిన్న మొత్తం 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

Food Poison in Kailasapatnam Orphanage Home
Food Poison in Kailasapatnam Orphanage Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 2:11 PM IST

Updated : Aug 19, 2024, 7:12 PM IST

Food Poison in Kailasapatnam Orphanage Home : ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో 2 రోజుల క్రితం ఓ అనాథాశ్రమంలో 27 మంది విద్యార్థులు సమోసాలు తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంస్థ అల్లూరి మన్యం జిల్లాలోని చింతపల్లి, కొయ్యూరు, గూడెం కొత్త వీధి, పాడేరు, అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తోంది.

Anakapalli Students Eating Contaminated Food : ఈ సంస్థలో సుమారు 80 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి శనివారం సాయంత్రం అల్పాహారంగా సమోసాలను పెట్టారు. సమోసాలు తిన్న కొంతసేపటికి విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

సోమవారం చింతపల్లి మండలం నిమ్మలపాలెం చెందిన జాషువా, కొయ్యూరు మండలానికి చెందిన భవాని, చింతపల్లికి చెందిన శ్రద్ధ మృతి చెందారు. మరో 24 మంది విద్యార్థులు నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏడుగురు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. విశాఖ కేజీహెచ్‌కు నలుగురు బాలలను తరలించారు. నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్డీవో జైరాం పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

Food Poison In Bheemgal Kasturba School : కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత.. 78 మందికి కడుపు నొప్పి, వాంతులు

ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, నర్సీపట్నం ఆర్డీవో ఆరా తీస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. మరోవైపు ఫుడ్‌పాయిజన్ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. విద్యార్థుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె, అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు అనిత అధికారులను అప్రమత్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్​ పాయిజన్ - 24 మంది విద్యార్థులకు అస్వస్థత

ఆదర్శ పాఠశాలలోని అల్పాహారంలో బల్లి - అస్వస్థతకు గురైన విద్యార్థులు

Last Updated : Aug 19, 2024, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.