Dogs Attack on Old Woman In siddipet : అందరూ ఉన్న ఓ వృద్ధురాలు ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కొడుకులు ఉన్నప్పటికీ సంరక్షణ బాధ్యత చేపట్టకపోవడంతో కడు దుర్భరమైన జీవితాన్ని ఓ పూరి గుడిసెలో గడుపుతున్న ఆ వృద్ధురాలపై కుక్కలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 2 వార్డు రేపల్లెవాడలో వృద్ధురాలైన అయ్యారి రంగవ్వ గత కొంత కాలంగా జ్వరంతో బాధపడుతూ ఉంది.
లేవలేని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో నేలపై పడుకుని ఉంది. అటుగా సంచరిస్తున్న పది కుక్కలు ఒక్కసారిగా ఆ పూరిగుడిసెలో ప్రవేశించి రంగవ్వపై దాడి చేశాయి. తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. చుట్టుపక్కల వాళ్లు గమనించి కుక్కలను తరిమివేశారు. మనవడి సాయంతో 108 వాహనంలో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దయనీయ పరిస్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Dog Attack on Children in Jagtial : మరోవైపు జగిత్యాల జిల్లాలో రోజురోజుకూ కుక్కల దాడులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలువురిని గాయపరిచిన కుక్కలు తాజాగా జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లికి చెందిన అనుష్క అనే 11 నెలల చిన్నారిపై దాడి చేసింది. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్క దాడికి పాల్పడింది. దీంతో ఆ చిన్నారికి తలపై తీవ్రమైన గాయాలయ్యాయి.
గాయపడ్డ చిన్నారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలు కావటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద వల్ల భయంగా ఉందని వీటి నుంచి కాపాడాలని మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నారు.
వీధికుక్కల స్వైరవిహారం - బాలుడి పురుషాంగంపై దాడి
పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్క దాడి - సీసీ ఫుటేజీ వైరల్ - Dog Attack In Hyderabad