State Govt Set up Committee on VRA Issues : గత కొంతకాలంగా సరైన సమయానికి వేతనాలు రాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సర్దుబాటు వీఆర్ఏలపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది. వీఆర్ఏలకు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేసేందుకు అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఆదేశాలు జారీ చేసింది.
అందరి కోసం మనమందరం అనే స్ఫూర్తితో 'ఓటాన్ అకౌంట్ బడ్జెట్'
ఈ కమిటీలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నియమించిన అధికారి, జీఏడీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా, సీసీఎల్ఏ కార్యదర్శి కన్వీనర్‌గా ఉన్నారు. వీఆర్ఏలకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని జీవోల రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, చట్టపరిమితి, న్యాయవివాదాలు తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.
త్వరలోనే మెగా డీఎస్సీ - జాబ్ క్యాలెండర్ ప్రక్రియ ప్రారంభించాం : భట్టి విక్రమార్క
VRA Issues Committee : గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం హయాంలో వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించిన సంగతి తెలిసిందే. కానీ వాళ్ల సంతోషం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. బదిలీ అయిన శాఖలో, అప్పటి రెవెన్యూ శాఖలో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదంటూ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. మరికొందరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. దీనిపై దృష్టిసారించిన రాష్ట్రప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించింది.
'మహాలక్ష్మి బిల్లులు నెలనెలా చెల్లిస్తాం - రాబోయే రోజుల్లో ఆర్టీసీకి మరో 1000 బస్సులు'