ETV Bharat / state

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం - మేడిగడ్డలో గేట్లు ఎత్తే సాధ్యసాధ్యాలపై విశ్లేషణ

State Dam Safety Officers Inspects Barrages : మేడిగడ్డ ఆనకట్ట గేట్లు ఎత్తే పరిస్థితి ఉందా? అనే అంశాన్ని రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం పరిశీలించింది. కుంగిపోయిన ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను క్షుణ్నంగా పరీక్షించింది. అన్నారం బ్యారేజీలో కొత్తగా ఏర్పడిన బుంగల్ని నిశితంగా పరిశీలించి గ్రౌటింగ్‌కు సంబంధించిన అంశాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకుంది. రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం ఇచ్చే నివేదిక అనంతరం జాతీయ డ్యాం సేఫ్టీ బృందం మరోసారి మేడిగడ్డ, అన్నారం పర్యటనకు రానుంది.

State Dam Safety Officers Inspects Barrages

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 9:54 AM IST

మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను పరిశీలించిన రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం

State Dam Safety Officers Inspects Barrages : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం మంగళవారం పరిశీలించింది. ముందుగా అన్నారం బ్యారేజీలోని సీపేజీ బుంగలను చూశారు. బ్లాక్ నంబర్ నాలుగులోని 38, 39 పియర్ల మధ్య ఉన్న వెంట్ వద్ద ఏర్పడిన కొత్త బుంగల్ని పరిశీలించారు. గత ఏడాది ఏర్పడ బుంగల పరిస్థితిపైనా ఆరా తీశారు. బుంగలు ఏర్పడిన చోట గ్రౌటింగ్ చేశామని సీఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ యాదగిరి రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందానికి వివరించారు. పూర్తిస్థాయిలో లీకేజీని నియంత్రించామని అధికారులు తెలిపారు.

Annaram Barrage Damage Issue Updates : సీపేజీ బుంగల మరమ్మతుకు ఏయే రసాయన పదార్థాలను వినియోగించారు, ఎన్నిసార్లు వాడారని ఇంజినీరింగ్ అధికారులను డ్యాం సేఫ్టీ బృందం ప్రశ్నించింది. నీటి వెలాసిటీ, గేట్ల పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వెంట్ వద్ద వేసిన ప్లాట్ ఫామ్ పూర్తిగా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యారేజీకి (Annaram Barrage) సంబంధించి గేట్ల కింది భాగంలో సిమెంట్ పెచ్చులు ఊడిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. 66 గేట్లకు గాను 42 పిల్లర్ల వద్ద సిమెంట్ పెచ్చులు ఊడినట్లు ఇంజినీరింగ్ అధికారులు వారికి వివరించారు.

రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఏడో పియర్‌ను పరిశీలించిన బృందం : అన్నారం బ్యారేజీ తర్వాత మేడిగడ్డకు వెళ్లిన రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం ఏడో బ్లాక్‌లో దెబ్బతిని కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. కాలినడకన వెళ్తూ పరీక్షించింది. ఆనకట్ట మీద నుంచి కుంగిన పియర్లు, దెబ్బతిన్న గేట్ల పరిస్థితిని చూశారు. మేడిగడ్డ దిగువకు వెళ్లి బ్లాక్‌ నంబర్‌ ఏడులోని పియర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పియర్ చీలిక, తెగిన ఇనుప చువ్వలు, పగుళ్లు, గేటును పరిశీలన చేశారు.

అన్నారం బ్యారేజీలో మళ్లీ సీపేజీలు - దిగువకు మళ్లీ నీటి విడుదల

మేడిగడ్డలో గేట్లు ఎత్తే సాధ్యసాధ్యాలపై విశ్లేషణ : బ్యారేజీలోని మిగతా పియర్లు, బ్లాక్‌లకు పగుళ్లు విస్తరించాయా? లేదా అని చూశారు. గేట్లు ఎత్తే పరిస్థితి ఉందా? ఒక వేళ గేట్లు ఎత్తితే ఏర్పడే ఇబ్బందులేంటీ? కుంగిన చోట చేపట్టాల్సిన చర్యలపై విశ్లేషించారు. దీనికి సంబంధించిన వివరాలను సీఈ సుధాకర్‌ రెడ్డి, ఈఈ తిరుపతిరావు, డీఈ సురేశ్‌లు బృంద సభ్యులకు వివరించారు. బృందంలో అపరేష అండ్ మెయింటెనెన్స్‌, సాంకేతిక, మైనింగ్ పలు విభాగాలకు చెందిన నిపుణులు ఉన్నారు.

Medigadda Barrage Damage Issue Updates : ఈ క్రమంలో వారికి సంబంధించిన వారిగా పరిశీలిస్తూ కారణాలు, చర్యలపై చర్చించుకున్నారు. మరోవైపు మేడిగడ్డ (Medigadda Barrage), అన్నారం బ్యారేజీలు పూర్తిగా ఖాళీ కావడంతో ఇసుక మేటలు వేసింది. రెండు బ్యారేజీల పరిస్థితుల్ని ఫోటోలు, వీడియో తీసుకున్నారు. రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం నివేదిక అనంతరం జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం మరోమారు బ్యారేజీని పరిశీలించనుంది.

డ్రాయింగ్​లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం

'మేడిగడ్డ ఒప్పందాలు ముగిశాయి - పనులు చేయాలంటే కొత్త కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.