ETV Bharat / state

అమెరికాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు- భారీ వర్షంలోనూ భక్తిశ్రద్ధలతో వేడుకలు - Saint Louis Hindu temple

Brahmotsavam Hindu Temple At Saint Louis in America : అమెరికాలోని సెయింట్​ లూయిస్​ నగరంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సేవలో ప్రవాస భక్తులు తరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ొ

saint_louis_temple
saint_louis_temple (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 12:15 PM IST

Srivari Brahmotsavam Hindu Temple At Saint Louis in America : అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామి వారి గోవింద నామం మార్మోగింది. నిత్యం ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకారాలు, సుప్రభాతం, తోమాల సేవ, తిరు ఆరాధన గజవాహన సేవ వంటి క్రతువులను నిర్వహించారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ఇవాళ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవ వైభవం- శ్రీ క్షీర భావనారాయణ స్వామి రథాన్ని లాగిన భక్తులు - Bhavanarayana Swamy Brahmotsavam

అమెరికాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు- భారీ వర్షంలోనూ భక్తిశ్రద్ధలతో వేడుకలు (ETV Bharat)

Saint Louis in America : గత రెండు రోజులుగా నిర్వహించిన పలు యజ్ఞాలు, హోమాలకు ప్రతిఫలం అన్నట్లు వడగళ్ల వానతో వరుణుడు కుండపోత కురిపించారు. భక్తులు ఆ తన్మయత్వంలోనే మూడోరోజు హోమాలను, పూజలను, వాహన సేవలను కొనసాగించారు. ఇవాళ ఉదయం కుంభారాధనం అనంతరం వుక్తహోమం నిర్వహించి హనుమంతుడిపై కోదండధారిగా వెంకటేశ్వరుడు మాఢవీధుల్లో ఊరేగేతూ భక్తులను కనువిందు చేశారు. భారతీయ నేపథ్యం కలిగిన బెంగాలీ, మలయాళీ, తమిళ, తెలుగు, మరాఠి ప్రవాస కుటుంబాలకు చెందిన స్థానిక చిన్నారులు పలు కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. మధ్యాహ్నం ప్రముఖ నాట్యాచార్యుడు డా.కళాకృష్ణను ఆలయ కార్యవర్గం సన్మానించింది. పలువురు స్థానిక నాట్యచార్యుల శిష్యులు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు.

వైభవంగా గోవిందరాజస్వామి రథోత్సవం- మాఢవీధుల్లో రథం లాగేందుకు పోటెత్తిన భక్తులు - GOVINDARAJA CHARIOT FESTIVAL

ఆదివారం సాయంత్రం హోమం సమయంలో ఒకసారిగా వడగళ్లతో కుండపోత వాన కురిసింది. అయినప్పటికీ నిర్వాహకులు ఎటువంటి అవాంతరాలు కలగకుండా హోమాన్ని కొనసాగించారు. అనంతరం సహస్రదీపాలంకార ఊంజల్ సేవ, గరుడ వాహన సేవలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తమ భక్తి ప్రపత్తులు వరుణుడిని అనుకున్న దానికన్న ఎక్కువగా మెప్పించారని ఆలయ ఛైర్మన్ రజనీకాంత్ గంగవరపు పేర్కొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళి ఏర్పాట్లను సమన్వయపరిచారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఘనంగా వేంకటరమణుడి బ్రహ్మోత్సవాలు - బాలికతో కల్యాణోత్సవం - Venkateswara Swamy Brahmotsavam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.