ETV Bharat / state

తిరుమల లడ్డూలో శ్రీకాకుళం బెల్లం - స్వచ్ఛతకు మారుపేరుగా నిమ్మతొర్లువాడ సరుకు - Srikakulam Organic Jaggary

Organic Jaggery in Srikakulam : ఆ ప్రాంతంలో కనుచూపుమేర చెరకు తోటలే. రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ చెరకు పండిస్తున్నారు అక్కడి రైతులు. స్వచ్ఛతను పాటిస్తూ నాణ్యమైన బెల్లాన్ని తయారు చేస్తున్నారు. రుచికరంగా ఉండటంతో నిమ్మతొర్లువాడ బెల్లం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ బెల్లం స్వచ్ఛత గురించి తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ప్రసాదాల తయారీకి ఇవ్వాలని కోరడంతో రైతులు అంగీకరించారు. ఏటా 20 టన్నులకు పైగా బెల్లాన్ని అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

Srikakulam Organic Jaggery Supplying For Tirumala Prasadam
Srikakulam Organic Jaggery Supplying For Tirumala Prasadam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 4:47 PM IST

Srikakulam Organic Jaggery Supplying For Tirumala Prasadam : బెల్లం పేరు వినగానే నోరూరుతుంది. నోటికి రుచిగానే కాదు ఐరన్ లాంటి పోషక విలువలు కూడా అధికమే. శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే బెల్లాన్ని మిఠాయిలతో పాటు ఇతర ఆహార పదార్థాల్లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. కాగా, బెల్లాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారు సిక్కోలు రైతులు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లువాడలో అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ విధానాలను అనుసరించి ధాన్యం, చెరకు, కూరగాయలతోపాటు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు.

అన్నిటిలో మెరుగైంది : మొదట్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లేకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో సేంద్రియ పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న రైతులు ఇక్కడి బెల్లాన్ని పరీక్షలకు పంపించారు. మార్కెటింగ్ అధికారులు చేసిన పరీక్షల్లో నిమ్మతొర్లువాడ బెల్లం చాలా స్వచ్ఛమైనదిగా తేలింది. స్వయంగా టీటీడీ అధికారులు నిమ్మతొర్లువాడ వచ్చి మొత్తం బెల్లాన్ని ఇవ్వాలని కోరగా రైతులు అంగీకరించారు. ప్రస్తుతం ఏడాదికి 20 టన్నులకు పైగానే దేవస్థానానికి బెల్లాన్ని సరఫరా చేస్తుండగా భవిష్యత్తులో పరిమాణాన్ని మరింత పెంచనున్నారు.

ప్రకృతి సేద్యంతో పండించిన భోజనం అందిస్తున్న అన్నదమ్ములు - brothers Organic Farming

స్వచ్ఛమైన బెల్లం తయారీ విధానం చాలా శ్రమతో కూడుకున్న పని. ముందుగా చెరకు గడలను తీసుకొచ్చి క్రషర్‌లో వేస్తారు. దాని నుంచి వచ్చిన మొలాసిస్‌ను ఓ కంటైనర్‌లో నింపి పిప్పి, ఇతర పదార్థాలను ఏరివేస్తారు. శుభ్రమైన చెరకు రసాన్ని బాయిలర్‌లో వేడి చేస్తారు. దీన్ని కలుపుతూ ఉంటే చిక్కగా బెల్లం ద్రావణం ఏర్పడుతుంది. దీన్ని చల్లార్చితే ఎంతో రుచికరమైన బెల్లం సిద్ధమవుతుంది. దీన్ని కూలీలందరూ కలిసి చక్కగా ప్యాక్‌ చేస్తారు. స్వచ్ఛమైన బెల్లం తయారీలో చిన్న పొరపాటు చేసినా బెల్లం నాణ్యత దెబ్బతిని ఎందుకూ పనికి రాకుండా పోతుందని రైతులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారికి తమ బెల్లంతో ప్రసాదాలు తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ముందు ఒకరిద్దరితో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం క్రమంగా చుట్టుపక్కల అనేక గ్రామాలకు విస్తరించింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రముఖ వ్యవసాయ నిపుణుడు పాలేకర్ ద్వారా ఎంతో మంది రైతులకు ఉచిత శిక్షణ ఇవ్వడం వల్లే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ సర్కార్ పాలనలో మార్కెటింగ్ కాస్త నెమ్మదించినా ఇపుడు మళ్లీ చంద్రబాబు పాలన రావడంతో వ్యాపారం మరింత మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఇక్కడ పండించే బెల్లానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. నిమ్మతొర్లువాడ బెల్లాన్ని తిరుమల ప్రసాదాల్లోనే కాకుండా ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా తయారీలో కూడా వాడుతున్నారు. రైతులే స్వయంగా ధర నిర్ణయించుకుని అమ్ముకోవడంతో స్వయం ఉపాధితోపాటు ఆదాయం దండిగానే ఉంటుంది. ఒక బెల్లం తయారీనే కాదు అన్ని రకాల ఆహార, వాణిజ్య పంటలు కూడా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ప్రకృతి పరిరక్షణకు, ప్రజారోగ్యానికి తోడ్పడుతున్నారు రైతులు.

చిరుధాన్యాల ఉత్పత్తి కోసం ఆహార సార్వభౌమత్వం కార్యక్రమం - ప్రభుత్వానికి 10 డిమాండ్లతో తీర్మానం

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సేంద్రీయ ఉత్పత్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.