ETV Bharat / state

శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టం - సందడిగా అంకురార్పణ - Sri Paidithalli Sirimanotsavam - SRI PAIDITHALLI SIRIMANOTSAVAM

Sri Paidithalli Sirimanotsavam Ankurarpana Program: విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అమ్మవారి సిరిమానును తెచ్చే ప్రక్రియను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సిరిమాను కోత, తరలింపు చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలిరావటంతో పెదతాడివాడ సందడిగా మారింది.

SRI_PAIDITHALLI_SIRIMANOTSAVAM
SRI_PAIDITHALLI_SIRIMANOTSAVAM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 1:54 PM IST

Updated : Sep 28, 2024, 3:34 PM IST

Sri Paidithalli Sirimanotsavam Ankurarpana Program: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అమ్మవారి సిరిమానును తీసుకొచ్చే ప్రక్రియను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డెంకాడ మండలం పెదతాడివాడలోని అప్పారావు, సూర్యనారాయణ కల్లంలో గుర్తించిన (చింతచెట్టు) సిరిమానుకు ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అటవీ అధికారుల సహాయంతో సిరిమాను, ఇరుసుమాను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.

శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టం - సందడిగా అంకురార్పణ (ETV Bharat)

సిరిమాను తొలగింపు ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో దేవాదాయశాఖ అధికారులు, పైడితల్లి ఆలయ పండితులతో పాటు, విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు లోకం మాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజుతో పాటు పెద్దఎత్తున సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అతంత్య భక్తిశ్రద్ధలతో గుర్తించిన సిరిమానుకు పూజలు చేశారు. అనంతరం సిరిమాను చెట్టును భూదేవి నుంచి వేరుచేసే క్రతువుకు శ్రీకారం చుట్టారు. సిరిమాను కోత, తరలింపు కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలిరావటంతో పెదతాడివాడలో సందడి నెలకొంది. భక్తులు పైడితల్లి అమ్మవారికి మొక్కులు చెల్లించకున్నారు.

అక్టోబర్ 15న జరగనున్న సిరిమానోత్సవానికి ఈ చెట్టును సిద్దం చేయనున్నట్లు సిరిమాను అధిరోహిత పూజారి బండుపల్లి వెంకటరావు తెలియచేసారు. ఎమ్మెల్యేలు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ప్రత్యేకతను వివరిస్తూ ఉత్తరాంధ్రతో పాటూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందుకు కూటమి ప్రభుత్వానికి సకల శక్తులు కల్పించాలని పైడితల్లి అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

పండుగ వేళ ప్రయాణికులకు గుడ్​న్యూస్​- 10 శాతం రాయితీ ఆఫర్​ వీరికి మాత్రమే - Good News for Passengers

విశాఖ ఉక్కుకు ఊపిరి - సెయిల్‌లో విలీనం చేసే యోచనలో కేంద్రం! అదే జరిగితే - Visakha Steel Plant Merge with SAIL

Last Updated : Sep 28, 2024, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.