ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు - రాధాకృష్ణుల వేషధారణతో ఉట్టి కొడుతూ అలరించిన చిన్నారులు - Janmashtami Celebrations Telangana

Sri Krishna Janmashtami celebrations In Telangana 2024 : రాష్ట్రవ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. జన్మాష్టమి సందర్భంగా మురళీలోలుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Janmashtami Celebrations in Telangana :
Sri Krishna Janmashtami celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 7:39 PM IST

Sri Krishna Janmashtami celebrations In Hyderabad : చిన్ని కృష్ణుని ఆటపాటలతో రాష్ట్రం పులకించింది. జన్మాష్టమి సందర్భంగా ఆలయాల్లో పరంధామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేపీహెచ్​బీ కాలనీలోని గోవర్ధనగిరిపై ఉన్న ఆలయంలో గోవిందుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బంజారాహిల్స్‌లోని పూరీ జగన్నాథ్‌, ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వేలాదిమంది భక్తులు వాసుదేవుడి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో రాధాకృష్ణుల వేషధారాలతో వెన్నతింటూ చిన్నారులు సందడి చేశారు.

రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టి కొట్టిన చిన్నారులు : ఆదిలాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో భక్తులు కోలాటం భజనలతో బాల కృష్ణుడిని పల్లకి సేవతో ఊరేగించారు. పాఠశాలలో చిన్నారులు రాధా కృష్ణుని వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. దేవాలయాన్ని పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

గోపాలుడి గీతాలపై చిన్నారులు నృత్యాలు : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఖాదీ హనుమాన్ ఆలయంలో గీతసత్సంగ్ ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారికి విశేష అభిషేకాలు, పుష్పార్చన నిర్వహించిన భక్తులు వాసుదేవుడికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. కన్నయ్య వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టి సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నీలవర్ణుడి జన్మాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీకృష్ణుడు, సత్యభామ వేషాధారణలో ప్రధాన వీధుల్లో గోపాలుడి గీతాలపై చిన్నారులు నృత్యాలు చేస్తూ అలరించారు.

చిన్నారులతో ఉట్టి సంబరాల్లో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య : హనుమకొండలో కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా జరిగాయి. మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. చిన్నారులతో కలసి కోలాటమాడిన ఎంపీ ఉట్టి సంబరాల్లో పిల్లలతో సందడి చేశారు. వాసుదేవుడి జన్మాష్టమి పురస్కరించుకొని నిజామాబాద్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీకృష్ణ పరమాత్ముడి జయంతి వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష తులసీదళ పుష్పార్చనతో ప్రత్యేక పూజలు చేశారు.

హైదరాబాద్‌లోని పలు పాఠశాలల్లో శ్రీకృష్టుడి జన్మదిన వేడుకలు : మెదక్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. విద్యార్ధినీ విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఉట్టికొట్టి సందడి చేశారు. మురళీలోలుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు పాఠశాలల్లో వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.

వనస్థలిపురం రాజప్పనగర్​లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కన్నయ్య వేషదారణలతో అలరించిన చిన్నారులు గోపాలుడి పాటలపై నృత్యాలు చేస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా నారాయణఖేడ్‌కు చెందిన శివకుమార్ నెమలి పింఛంపై నందగోపాలుడి రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించి భక్తిని చాటుకున్నాడు. అంతేకాదు రావి ఆకుపై మురళీకృష్ణుడి ఆకృతిని అద్భుతంగా తీర్చిదిద్దాడు.

కనులవిందుగా కన్నయ్య పండుగ - భక్తిపారవశ్యంలో మునిగిన తెలంగాణ - Janmashtami Celebrations 2024

Sri Krishna Janmashtami celebrations in Telangana : గోకుల కృష్ణ.. గోపాల కృష్ణా.. మా ఇంటికొచ్చాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.