ETV Bharat / state

శుభ గడియలు వచ్చేశాయ్​ - పెళ్లికి బాజా మోగింది - కుమారి శ్రీమతి కానుంది - Wedding Season Started

Wedding Season Started in August 2024 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెళ్లిళ్ల సీజన్ రానే వచ్చేంది. మూడున్నర నెలల విరామం తర్వాత మూడుముళ్ల బంధానికి స్వాగత ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వివాహాది శుభకార్యాలకు ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. పెళ్లిళ్లకు ఈ నెలలో అత్యంత శుభ ముహూర్తాలు ఇవే.

Wedding Season
Wedding Season (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 1:58 PM IST

Best Dates For Marriage in Sravana Masam 2024 : ఆషాఢమాసం ముగియటంతో ఇవాళ్టి నుంచి శ్రావణమాసం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 28 నుంచి శుక్ర మూఢమి, దానికి తోడు గురు మూఢమి రావడంతో వివాహాలకు అవాంతరం ఏర్పడింది. అయితే శ్రావణం రాకతో శుభ ముహూర్తాలకు వేళయింది. ఈ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఈ మాసంలో మంచి ముహూర్తాలు ఇవే:

  • ఇవాళ్టితో మొదలైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగియనుంది.
  • దీంతో ఈ నెల 31 లోపే శుభకార్యాలను ముగించుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.
  • ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. వీటితో పాటు ఈ నెలలో 28వ తేదీ పెళ్లిళ్లకు చివరి ముహూర్తమని.. 17, 18 తేదీలు వివాహాలకు అత్యంత శుభ ముహూర్తాలని చెబుతున్నారు.
  • మూడున్నర నెలల నుంచి ఎంతగానో వేచి చూస్తున్నవారంతా ఈ శుభ ముహూర్తాల్లో వారికి అనుకూల తేదీలను నిర్ణయించుకుని పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే సన్నద్ధమయ్యారు.

శ్రావణం తెచ్చే పండగలు:

  • శ్రావణమాసం వచ్చిందంటే ఇంటింటా పండగే.
  • విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ మాసంలో అందరూ భక్తిపారవశ్యంలో మునిగిపోతారు.
  • ఈ నెల 9వ తేదీ నుంచి పండుగలు స్టార్ట్ కానున్నాయి.
  • 9న నాగుల పంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి పండగలు ఉన్నాయి.
  • ఈ నెలలో వచ్చే సోమవారాల్లో శివుడిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని, శనివారాల్లో విష్ణుమూర్తిని భక్తి, పవిత్రతో పూజిస్తారు. ఈ రోజుల్లో ఆలయాలన్నీ పూజాది కార్యక్రమాలతో బిజీగా మారనున్నాయి.
  • ఈ మాసంలోనే మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు వంటి శుభ కార్యక్రమాలను అందరూ నిర్వహించుకుంటారు.

వారంతా బిజీ: దాదాపు 105 రోజులు శుభ కార్యాలయాలకు మంచి ముహూర్తాలు లేకపోవటంతో పనిలేక చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అన్‌సీజన్‌ పోయి సీజన్‌ రావటంతో శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకునే పురోహితులు, బ్యాండుమేళం, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు, ప్రింటింగ్‌ప్రెస్‌, బట్టలు, కిరాణం, పండ్లు, పూలు, క్యాటరింగ్‌తో పాటు నగల వ్యాపారులకు ఇప్పుడు చేతినిండా పని దొరకనుంది.

శ్రావణమాస వ్రతాలకు యాదాద్రి సంసిద్ధం- మూడురోజులపాటు పవిత్రోత్సవాలు - Yadadri Sravana Masam Poojalu

శ్రావణమాసం స్పెషల్​ : అరుణాచలం TO తంజావూర్​ - అతి తక్కువ ధరకే IRCTC సూపర్​​ ప్యాకేజీ! - Divya Dakshin yatra Jyotirlinga

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.